హైకోర్టు సీజేకు సీఎం కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించతలపెట్టిన ఆయుత చండీయాగంలో పాల్గొనవలసిందిగా సీఎం.. చీఫ్ జస్టిస్కు ఆహ్వాన పత్రిక అందజేశారు.
మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత చండీయాగానికి ఇప్పటికే దేశంలోని ప్రముఖులకేకాక, రాష్ట్రంలోని ముఖ్య వ్యక్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తదితరులను ఇప్పటికే ఆహ్వానించిన కేసీఆర్.. నేడో, రేపో విజయవాడకు వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చండీయాగం ఆహ్వాన పత్రికను అందించనున్నారు.