
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అద్దె ప్రాతిపదికన 659 బస్సుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ టెండర్లు పిలిచింది. వాటిలో ఏసీ స్లీపర్ 9, నాన్ ఏసీ స్లీపర్ 47, ఇంద్ర ఏసీ 6, సూపర్ లగ్జరీ 46, అల్ట్రా డీలక్స్ 22, ఎక్స్‌ప్రెస్ 70, అల్ట్రా పల్లె వెలుగు 208, పల్లె వెలుగు 203, మెట్రో ఎక్స్‌ప్రెస్ 39, సిటీ ఆర్డినరీ బస్సులు 9 ఉన్నాయి. ‘ఎంఎస్‌టీసీ’ ఇ–పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేయవచ్చునని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఆగస్టు 5 ఉదయం 10గంటల నుంచి ఆగస్టు 6 సాయంత్రం 4గంటల వరకు రివర్స్ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం అద్దె బస్సుల టెండర్లను ఖరారు చేస్తారు. బస్సు రూట్ల వివరాలు, బస్సు ప్రమాణాలు, టెండర్ల నిబంధనలు, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్: http://apsrtc.ap. gov. in
టెండర్లు పిలిచిన అద్దె బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి
శ్రీకాకుళం–39, పార్వతీపురం మన్యం–32, విజయనగరం–14, విశాఖపట్నం–61, అనకాపల్లి–22, కాకినాడ–41, తూర్పు గోదావరి–27, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ – 39, పశ్చిమ గోదావరి–52, ఏలూరు – 21, కృష్ణా – 28, ఎన్టీఆర్ – 12, గుంటూరు – 26, పల్నాడు – 30, బాపట్ల– 6, ప్రకాశం– 10, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు – 39, తిరుపతి– 35, చిత్తూరు – 2, అన్నమయ్య – 10, వైఎస్సార్ – 6, నంద్యాల – 29, కర్నూలు – 14, అనంతపురం – 31, శ్రీసత్యసాయి – 33.
Comments
Please login to add a commentAdd a comment