ముంబై: భారత క్రికెట్ జట్టుకు క్లాతింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోన్న ప్రఖ్యాత సంస్థ ‘నైకీ’తో ఒప్పందం వచ్చే సెప్టెంబరుతో ముగియనుంది. దాంతో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు పిలవాలని బీసీసీఐ యోచిస్తోంది. తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే క్రమంలో ఇప్పటి వరకు నైకీ ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ. 88 లక్షల చొప్పున బోర్డుకు చెల్లించింది. ఏడాదికి మరో రూ. 6 కోట్ల మినిమం గ్యారంటీ, 15 శాతం రాయల్టీతో పాటు సుమారు రూ. 10 కోట్ల విలువైన నైకీ ఉత్పత్తులు కూడా అందించింది. ఇదంతా కలిపి నాలుగేళ్లలో 220 మ్యాచ్‌లు జరిగేలా ఒప్పందం కుదిరింది.
అయితే కోవిడ్–19 కారణంగా ప్రపంచ మార్కెట్ దెబ్బ తింది. అన్ని రంగాలు సమస్యలు ఎదుర్కొంటుండటంతో ఏ రూపంలోనైనా స్పాన్సర్‌షిప్ మొత్తం తగ్గుదల కనిపించవచ్చని బీసీసీఐ అంచనా వేసింది. అందుకనుగుణంగా తాజాగా ప్రకటించబోయే రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)లో బేస్ ప్రైస్ విలువను తగ్గించాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మొత్తం రూ. 61 లక్షలుగా ఉండవచ్చు. గతంతో పోలిస్తే ఇది 31 శాతం తక్కువ కావడం విశేషం. పైగా కంపెనీలు పలు సడలింపులు కోరుతూ షరతులు కూడా పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment