సాక్షి, అమరావతి: వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు టెండర్ల ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. మీటర్ల ధర ఇతర రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉందని, టెండర్లలో అవకతవకలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా కొందరికి టెండర్లు కట్టబెట్టారని, ఈ ఖర్చంతా ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపైనే వేస్తారని పచ్చ పత్రికలు, విపక్షాలు చేస్తున్న తప్పు డు ప్రచారంపై వారు స్పందించారు.
వారు శని వా రం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టెండర్లలో ఎటువంటి దాపరికం లేదని స్పష్టంచేశారు. నిబంధనల ప్రకా రం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అనుమతి తీసుకొన్న తరువాత ఏపీ ఈ–ప్రొక్యూర్‌మెంట్ పో ర్టల్ ద్వారా టెండర్లను ఆహ్వానించామని చెప్పారు. దే శంలోని ప్రతి గుత్తేదారు పాల్గొనేలా టెండర్ల ప్రక్రి య పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశా రు. వారు వెల్లడించిన వివరాలు వారి మాటల్లోనే..
స్మార్ట్ మీటర్ల టెండర్లలో షిరిడీ సాయి, అదానీ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్ 1 గా నిలిచింది. అనుబంధ పరికరాల టెండర్లలో షిరిడీ సాయి, జీవీఎస్, విక్రాన్ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్ 1 గా నిలిచింది. ఒక్కో వ్యవసాయ సర్వీసుకు, అనుబంధ పరికరాలతో కలిపి రూ.11,191.64 మాత్రమే. పన్నులతో కలిపి మొత్తం రూ.13,334.88 ఖర్చవుతుంది. స్మార్ట్ మీటర్ల ధరను మాత్రమే కేంద్రం రూ.6 వేలతో అంచనా వేసింది. ఒక్కో మీటరు వ్యయం రూ.36,700కు కొంటుందనడంలో వాస్తవం లేదు. ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్స్ కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా 93 నెలల కాంట్రాక్ట్ కాల వ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని చెల్లిస్తారు. వీటికి నెలకు రూ.194 చొప్పున టెండర్లను దాఖలు చేశారు.
మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా విద్యుత్ ప్రమాదాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయి.
వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు యథాతథంగా కొనసాగుతుంది. ప్రజల నుంచి ఏ విధమైన ట్రూ అప్ చార్జీలు వసూలు చేయరు.
ఉత్తరప్రదేశ్‌లోని మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ మీటరుకు రూ.10 వేలు చొప్పున సింగిల్ ఫేజ్ మీటర్లను మాత్రమే ఏర్పాటు చేస్తోంది. వీటికి ఎటువంటి అనుబంధ పరికరాలూ లేవు. మన రాష్ట్రంలో మొత్తం అన్ని పంపుసెట్లకు త్రీ ఫేజ్ స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో ఒక్కో స్మార్ట్ మీటరుకు ఏడున్నరేళ్ల పాటు నెలకు రూ.200.96గా ధర ఖరారు కాగా వాటిలో 80 శాతం సింగిల్ ఫేజ్‌వే. ఏపీలో మొత్తం త్రీ ఫేజ్ మీటర్లే. అయినప్పటికీ ఇక్కడ 93 నెలలకు నెలకు రూ.194 మాత్రమే చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment