smart meters
-
వ్యాపారులకు ‘స్మార్ట్’ షాక్
చిత్తూరు కార్పొరేషన్/రొంపిచెర్ల: విద్యుత్ స్మార్ట్ మీటర్లతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా రూ.వేలల్లో కరెంటు బిల్లులు వస్తుండటంతో షాక్‌కు గురవుతున్నారు. చిత్తూరులో విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ డిసెంబర్లో ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక మెడికల్ ఆక్సిజన్ గ్యాస్ తయారీ పరిశ్రమ సప్తగిరి ఎయిర్ ప్రొడక్ట్స్‌లో స్మార్ట్ మీటర్ ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు డిసెంబర్లో బిల్లు రూ.3,142 రాగా, ఫిబ్రవరిలో అంతకు 8 రెట్లు అధికంగా రూ.25,748 బిల్లు వచ్చిందని యజమాని ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రోజూ మూడు గంటలు మాత్రమే మోటారు వాడుతామని, గతంలో నెలకు 400–500 యూనిట్లు మాత్రమే వినియోగించామని రూ.3వేల నుంచి రూ.5 వేల మధ్యలో బిల్లులు వచ్చేవని తెలిపారు. కానీ, స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత జనవరి నెలలో 1,570 యూనిట్లు వినియోగించారని రూ.12,444 బిల్లు వచ్చిందన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదన్నారు. ఫిబ్రవరిలో 3,461 యూనిట్లు వాడారంటూ రూ.25,748 బిల్లు, బకాయిలతో కలిపి మొత్తం రూ.38,192 వచ్చిందన్నారు. దీనిపై విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తే కండక్టర్ల సమస్య పేరు చెప్పి బిల్లు కట్టాలని బుకాయిస్తున్నారని, లేని పక్షంలో సరఫరా ఆపివేస్తామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 15 యూనిట్లకు రూ.387 బిల్లు15 యూనిట్లు మాత్రమే వినియోగించిన ఓ ఇంటికి రూ.387 బిల్లు వచ్చింది. చిత్తూరు జిల్లా బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ ఫజులుపేటలో కె.సుహాసిని ఇంట్లో (సర్వీస్ నంబర్ 5831200004266) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 2 వరకు 15 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. దానికి రూ.387 బిల్లు వచ్చింది. వాస్తవానికి 15 యూనిట్లకు రూ.28.50 బిల్లు కాగా, సర్దుబాటు చార్జీల పేరిట వారికి 2022 జూన్‌కు రూ.153, 2023 మే నెలకు రూ.77.50, 2025 జనవరికి రూ.7.60 చొప్పున రూ.266.6, ఫిక్సిడ్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, సర్‌చార్జీలు తదితర పేర్లతో మరో రూ.120 కలిపారు. ఇదేమిటని ట్రాన్స్‌కో అధికారులను అడిగితే ప్రభుత్వం గతంలో వాడిన విద్యుత్‌కు అదనంగా డబ్బు వసూలు చేస్తోందని తామేమీ చేయలేమని చెబుతున్నారు. -
పవర్ ఇక ప్రీ పే!
కొత్తపేట: రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీల చెల్లింపు విధానం ప్రీపెయిడ్ విధానంలోకి మారనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల స్థానే స్మార్ట్ మీటర్లు రానున్నాయి. మొదట మాన్యువల్ మీటర్ల నుంచి ప్రారంభమైన విద్యుత్ మీటర్లు ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల వంతు వచ్చిoది. ప్రీపెయిడ్ ఆప్షన్‌తో ఈ మీటర్లు రూపొందించారు. సాధారణంగా ఈ నెల వినియోగించిన విద్యుత్ బిల్లును వినియోగదారులు మరుసటి నెల చెల్లిస్తున్నారు. బిల్లు ఇచ్చిన 15 రోజుల వరకు ఎటువంటి అపరాధ రుసుం చెల్లించవలసిన అవసరం లేదు. ఈ లెక్కన వినియోగదారుడికి బిల్లు చెల్లించడానికి దాదాపు నెల వరకు సమయం ఉంటుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పద్ధతి ఇదే. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దశల వారీగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మీటర్లలో ప్రీపెయిడ్ ఆప్షన్ జతచేశారు. దీని ద్వారా విద్యుత్ సరఫరా కోసం ముందుగానే రీచార్జి చేయాల్సి ఉంటుంది. అలా చేయక పోతే సరఫరా ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. విద్యుత్ మీటర్లలో మార్పులు మొదట మెకానికల్ (మాన్యూవల్) మీటర్లు ఉండేవి వాటిలో యూనిట్లు చూసి రీడర్లు బుక్‌లో రీడింగ్ రాసుకునేవారు. తర్వాత ఎలెక్ట్రో మెకానికల్ మీటర్లు, హై యాక్యురసీ మీటర్లు వచ్చాయి. ఆ తరువాత ఐఆర్ పోర్ట్ అంటే స్కాన్ చేస్తే రీడింగ్ ఆటోమేటిక్ రికార్డు అవుతుంది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. ఇవన్నీ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రూపొందించినవే. ఇప్పటి వరకు అమలవుతున్న విధానానికి అలవాటు పడిన వినియోగదారులకు స్మార్ట్ మీటర్‌పై మరింత అవగాహన కల్పించాల్సి ఉంటుంది. జీతాలకు కోట్లు విద్యుత్ శాఖ పరిధిలో వేల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి నెలా విద్యుత్ శాఖ జీతాలు, పింఛన్లు చెల్లించడానికి రూ.కోట్లు కావాల్సి వస్తోంది. ఇక శాఖాపరంగా అభివృద్ధి కోసం వందల కోట్లు కావాల్సి వస్తోంది. వీటికి మూలాధారం విద్యుత్ బిల్లుల ద్వారా వచ్చే ఆదాయమే. జిల్లాలో నెలకు సుమారు రూ.50 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల రూపంలో ఆదాయం వస్తోంది. అదే స్మార్ట్ మీటర్లు పెడితే ఇంకా పెరుగుతుందని అంచనా. ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలు, పంచాయతీలు, పరిశ్రమలు, వ్యాపార, గృహావసరాలు కలిపి మొత్తం 6,12,317 సర్విసులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాల పరంగా ఇప్పటి వరకు రూ.103 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఆ బకాయిల చెల్లింపుల కోసం ఎన్ని నోటీసులు ఇచ్చినా వసూళ్లు మాత్రం అంతంత మాత్రమేనని ఆ శాఖ రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలే కదా విద్యుత్ సరఫరా కట్ చేయరనే భావన ఏర్పడడంతో అవి మొండి బకాయిలుగా మారాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్ విధానం అమలులోకి వస్తే విద్యుత్ శాఖకు బకాయిల బాధ ఉండదు. ఉపయోగాలు.. » సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఏ విధంగా చూసుకుంటామో.. ఇక్కడ అదే విధంగా యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. »బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా ఉంటుంది. నగదు అయిపోయిన వెంటనే సరఫరా బంద్ అవుతుంది. రీచార్జి చేస్తేనే విద్యుత్ వెలుగులుంటాయి. »బ్యాలెన్స్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. నష్టాలూ.. » విద్యుత్ సంస్థను నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే వారి ఉపాధికి పెద్ద దెబ్బేనని చెప్పాచ్చు. » అవగాహన లేమితో రీచార్జ్ చేసుకోవడంలో వినియోగదారులు ఏ మాత్రం అలసత్వం వహించినా, సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. » విద్యుత్ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. లైన్ల నుంచి విద్యుత్‌ను అక్రమంగా వాడుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఏది నిజం?: కూటమి ‘స్మార్ట్’ నాటకం!
‘అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేయలేక కుప్పిగంతులు వేస్తోంది. ప్రజలను ఏమార్చేందుకు అబద్ధాలు, మోసాలతో మాయా నాటకాన్ని మొదలుపెట్టింది. అందులో భాగంగా ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తమకు గిట్టని అధికారులపై కక్ష సాధిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోంది.హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ విభాగాల్లో డబ్బులు లేవంటూ శ్వేతపత్రాల పేరుతో కాలం వెళ్లదీస్తోంది. తప్పుడు లెక్కలు చూపిస్తూ ఖజానా ఖాళీగా ఉందంటూ బేలతనాన్ని ప్రదర్శిస్తోంది. తాను అమలు చేయాల్సిన పథకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే స్మార్ట్ మీటర్ల టెండర్లపై ఎల్లో మీడియాతో కలిసి విషం చిమ్ముతోంది’’సాక్షి, అమరావతి: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థకు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా చెల్లింపులు జరిగాయంటూ ‘స్మార్ట్ దోపిడీపై ఆడిట్’ శీర్షికన ఓ అసత్య కథనాన్ని సీఎం చంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు సోమవారం ప్రచురించింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మార్గదర్శకాలకు అనుగుణంగా, న్యాయ సమీక్ష ద్వారా అనుమతి పొందిన టెండర్లపై అడ్డగోలుగా అసత్యాలు అచ్చేసింది. జరగని దోపిడీపై ఆడిట్‌కు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ చెప్పుకొచ్చింది.నిజానికి వ్యవసాయ విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే టెండర్లు, ఆ టెండర్లు దక్కించుకున్న సంస్థకు బిల్లులు చెల్లింపుల్లో గత ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాయి. ఇందులో ఎలాంటి దాపరికం, నిబంధనల ఉల్లంఘన జరగలేదు. రైతులకు ఎప్పటికీ పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను హక్కుగా ఇచ్చేందుకు జరుగుతున్న యత్నాన్ని టీడీపీ మొదటి నుంచీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది.స్మార్ట్ మీటర్లకు సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని, అన్నీ నిబంధన మేరకే జరిగాయని ఇంధన శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటప్పుడు గత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే తప్పేముంది? అసలు ఈనాడు, చంద్రబాబు బాధేమిటో అర్ధం కాదు. బిల్లులు చెల్లిస్తే చెల్లించేశారంటూ ఏడుపు..! చెల్లించకపోతే ఇంకా చెల్లించలేదంటూ గగ్గోలు పెట్టడం ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.ఇంత పెద్ద వ్యవస్థలో తనిఖీ కష్టమా?నిర్ణీత సమయంలో ఎంత సామగ్రినైనా తనిఖీ చేసే సామర్ధ్యం రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ వ్యవస్ధకు ఉంది. విద్యుత్ సంస్థలకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఉద్యోగులున్నారు. ఇలాంటి తనిఖీల కోసమే ప్రతి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లో కన్స్ట్రక్షన్ విభాగం ఉంటుంది.అందులోని అధికారులు స్టోర్స్‌కి మెటీరియల్ రాగానే స్వయంగా పరిశీలిస్తారు. ప్రతి పరికరం నాణ్యత ప్రకారం ఉందోలేదో తనిఖీ చేస్తారు. పరికరాల సంఖ్య కూడా లెక్కిస్తారు. ఈ వివరాలన్నీ నమోదు చేసుకున్న తరువాత మాత్రమే బిల్లులను అకౌంట్స్ విభాగానికి సమర్పిస్తారు. కన్స్ట్రక్షన్ విభాగం నుంచి వచ్చిన బిల్లుల ఆధారంగా టెండర్లో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా అకౌంట్స్ విభాగం అధికారులు బిల్లులు మంజూరు చేస్తారు. స్మార్ట్ మీటర్ల విషయంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా, సక్రమంగా జరిగింది. అందువల్లే డిస్కంలు బిల్లులు చెల్లించాయి. న్యాయ సమీక్షకు టెండర్లు..ఏ సంస్థ అయినా స్మార్ట్ మీటర్ల బిడ్లలో పాల్గొనేలా నిబంధనలున్నాయి. స్మార్ట్ మీటర్ల టెండర్లను ఆహ్వానిస్తూ డిస్కంలు తెలుగు, ఇంగ్లీషు దినపత్రికల్లో ప్రకటన కూడా జారీ చేశాయి. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టెండర్లలో అక్రమాలను అరికట్టడానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్, న్యాయ సమీక్ష అనే విధానాలను ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేశారు. ఈ వినూత్న నిర్ణయాలతో రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్ న్యాయ సమీక్షకు వెళుతుంది. అక్కడ వెబ్సైట్లో 14 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో టెండర్ డాక్యుమెంట్లను ఉంచి ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలు, సూచనలను తీసుకుంటారు.అదంతా ముగిసిన తరువాతే అనుమతి లభిస్తుంది. స్మార్ట్ మీటర్ల టెండరు ప్రక్రియ ఏపీ–ఈ–ప్రొక్యూర్మెంట్, జెమ్ పోర్టల్ ద్వారా జరిగింది. ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగింది. అందువల్ల ఏదైనా సంస్థ పూర్తి అర్హతలతో పారదర్శకంగా నిబంధనల ప్రకారం కాంట్రాక్టులు, ప్రాజెక్టులు పొందితే దానికి లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చేశారనడంలో అర్ధం లేదు. ఒకసారి టెండర్ ఖరారయిన తరువాత అందులోని నిబంధనలు మార్చకూడదు. అలాంటిదేమీ ఇక్కడ జరగలేదు. గతేడాది పిలిచిన టెండర్ నిబంధనలే ఈ ఏడాదీఉండాలని, ఒక టెండర్లో ఉన్నట్లుగానే మరో టెండర్లో నిబంధనలు పెట్టాలని ఏ చట్టం చెబుతుందో ఈనాడుకే తెలియాలి.రివర్స్ టెండరింగ్‌తో 15.75 శాతం తగ్గిన ధరవ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం, మీటర్లు కాలిపోకుండా, రైతులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడటంతోపాటు మోటార్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ మీటర్లను రక్షణ పరికరాలతో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఆదేశించింది. ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా డిస్కంలు టెండర్లను పిలిచాయి. ఎల్ 1గా నిలిచిన కాంట్రాక్టర్‌కు టెండర్‌ను అప్పగించాయి. అయితే టెండర్ ధర అధికంగా రావటాన్ని గమనించిన గత ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో తొలి టెండర్ రద్దు అయింది. అనంతరం రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్ల ధర మొదటిసారి కంటే 15.75 శాతం తగ్గింది. తద్వారా ప్రజాధనాన్ని ఆదా చేశారు. ఇక మీటర్ గ్యారంటీ సమయం 10 ఏళ్లకు పెరిగింది. నిర్వహణ సమయం పెంచడం వల్ల డిస్కంలకు వ్యయంలో 2 శాతం ఆదా అవుతుంది. అంటే డిస్కంలకు ఆర్ధికంగా కొన్ని కోట్ల రూపాయలు మిగులుతాయి. అదీగాక ప్రతి టెండర్ నిబంధన న్యాయ సమీక్షకు వెళ్లింది. ఆ తరువాతే ఖరారైంది. అంతేకాకుండా ఏపీఈఆర్సీ అనుమతి కూడా పొందింది. ఇందులో ఎలాంటి ఉల్లంఘనగానీ, ఒకరికి ఉద్దేశపూర్వకంగా మేలు చేయడంగానీ లేదు.నిబంధన మేరకే బిల్లులు..గుత్తేదారు సంస్థ బిల్లులు పంపడమే ఆలస్యం డిస్కంలు చకచకా రూ.1,828 కోట్లు చెల్లించాయని సమాచారమంటూ ఈనాడు చెప్పుకొచ్చింది. వ్యవసాయ స్మార్ట్ మీటర్లకు అయ్యే ఖర్చులో ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘జి.ఓ.ఎం.ఎస్. 22, తేదీ:01.09.2020’ ద్వారా స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే డిస్కంలు టెండర్లు పిలిచాయి. తాము కాంట్రాక్టు సంస్థకు చెల్లించిన డబ్బును తిరిగి తమకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. అందుకు గత ప్రభుత్వం అంగీకరించింది.ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగింది. కూటమి ప్రభుత్వంగానీ ఈనాడుగానీ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. కాంట్రాక్టర్‌తో పని చేయించుకుని బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ప్రాథమికంగా డిస్కంలదే. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఇందులో ఏ తప్పూ లేదు. ఇదేమీ కొత్తగా జరిగిందీ కాదు. సంక్షేమ పథకాల ద్వారా వివిధ వర్గాలకు విద్యుత్ రాయితీలు అందించే ప్రభుత్వం ఆ మొత్తాన్నీ ముందుగా డిస్కంలు భరిస్తే, ఆ తర్వాత రీయింబర్స్మెంట్ చేస్తుంటుంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ఖర్చును డిస్కంలు ముందుగా భరించాయి. ఆ బకాయిలు రూ.8,845 కోట్లు కాగా వాటిని ఇవ్వకుండా నాడు చంద్రబాబు ఎగవేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆ మొత్తం బకాయిలను చెల్లించింది.రాష్ట్రపతి అవార్డు అందుకున్న సంస్థపై ఎందుకీ కక్ష?మూడు డిస్కమ్‌ల పరిధిలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు పొందిన షిర్డీ సాయి సంస్థ చిన్న సంస్థ ఏమీ కాదు. 25 ఏళ్లుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తయారు చేస్తూ సుదీర్ఘ అనుభవం, సామర్థ్యం ఉన్న కంపెనీగా పేరు పొందింది. ట్రాన్స్ఫార్మర్ల తయారీలో 2022కిగానూ ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు కూడా దక్కించుకుంది. ఎనర్జీ కన్జర్వేషన్ (ఇంధన పొదుపు) అవార్డును కేంద్రం నుంచి రెండు సార్లు అందుకుంది. అండర్ స్టాండింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌కు కూడా ఈ సంస్థ అర్హత సాధించింది.స్మార్ట్ మీటర్లతో జవాబుదారీతనంఒకప్పుడు వ్యవసాయ విద్యుత్తు సర్వీసులకు మీటర్ల ద్వారా వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్ హార్స్ పవర్ ప్రాతిపదికన వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గింది. విద్యుత్ సంస్థలు కెపాసిటర్లను విడతలవారీగా వినియోగదారులకు అందించినప్పటికీ కాలక్రమేణా వాటిని రైతులే తీసేశారు. దీంతో సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను తీర్చడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా ప్రభుత్వం జమ చేసేలా రైతుల బ్యాంకు ఖాతాలను కూడా సేకరించింది. రైతులే ఆ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని భావించింది.నాణ్యమైన విద్యుత్స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. వీటివల్ల ఆ ఖర్చు తప్పుతుంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు.కేంద్రమే చెప్పిందికేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత రీ వ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డిఎస్ఎస్)లో భాగంగా స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు దేశంలోని అనేక రాష్ట్రాలతో జరుగుతోంది. ‘ఆర్డీఎస్ఎస్’లో భాగంగా 2025 మార్చి నాటికి దేశం అంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని 2020లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు గత ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ 50 శాతం నుంచి 100 శాతం వరకూ పూర్తవుతోంది. స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని, సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. -
fact check: అయినవారికి కాదు రామోజీ.. అర్హతలున్నవారికే టెండర్లు
సాక్షి, అమరావతి: పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా అన్నట్టు పదే పదే ఒక అబద్ధాన్ని తన విషపుత్రిక ఈనాడులో అచ్చేయడం, ప్రభుత్వంపై యధారీతిన దు్రష్పచారం చేయడం లక్ష్యంగా మరోసారి రామోజీరావు చెలరేగిపోయారు. ఇందులో భాగంగానే శనివారం ఈనాడులో ‘అయినవారి కోసం.. ‘అన్న’ స్మార్ట్ టెండర్’ అంటూ ఒక విష కథనాన్ని అచ్చేశారు. ఇందులో ఒక్క అక్షరమైనా నిజం లేకుండా.. ప్రభుత్వంపైన ఇష్టారీతిన బురదజిమ్మారు.అన్ని అర్హతలున్నవారికే పారదర్శకంగా టెండర్లు అప్పగిస్తున్నా.. టెండరుదారులు ఎక్కువ మొత్తం కోట్ చేస్తే మళ్లీ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లినా రామోజీకి మాత్రం ఇదంతా బూటకంలా కనిపిస్తోంది. అందుకే తనకు కావాల్సినవారికే ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల టెండర్లను కట్టబెట్టిందంటూ పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. ఈ నేపథ్యంలో ఈనాడు విషకథనంపై ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు పృధ్వీతేజ్, సంతోషరావు వివరణ ఇచ్చారు.ఈనాడు కథనంలో అణువంతైనా నిజం లేదని.. ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టడం లేదని అర్హతలు ఉన్నవారికే పారదర్శకంగా టెండర్లు దక్కుతున్నాయని తేల్చిచెప్పారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మార్గదర్శకాలకు అనుగుణంగానే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం పడదని కుండబద్దలు కొట్టారు. పైగా నాణ్యమైన విద్యుత్‌ను అందించడం వల్ల విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉందన్నారు. పృధ్వితేజ్, సంతోషరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ–పోర్టల్ ద్వారా అత్యంత పారదర్శకంగా టెండర్లు విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే డిస్కంలు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో 12.08 లక్షల ప్రీ–పెయిడ్ మీటర్లను అమరుస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలో 15.78 లక్షల ప్రీపెయిడ్ మీటర్లు పెడుతున్నారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 9.97 లక్షల ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం డిస్కంలు టెండర్లను ఆహా్వనిస్తూ తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో ప్రకటన జారీ చేశాయి. టెండరు ప్రక్రియను ఏపీ–ఈ ప్రొక్యూర్మెంట్, జెమ్ పోర్టల్ ద్వారా చేపట్టారు. ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా గుత్తేదారులు ఎవరైనా ఐచ్చికంగా పాల్గొనవచ్చు. టెండర్ల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుంది. ఈ టెండర్ల ఎంపిక ప్రక్రియలో గుత్తేదారులను తొలగించడానికి విద్యుత్ సంస్థలకు ఎటువంటి అధికారాలు కూడా ఉండవు. మొదటి దశలో ఇలాదక్షిణ ప్రాంతం డిస్కం పరిధిలో మొదటి విడతలో 8.75 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, త్రీ–ఫేజ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మధ్య ప్రాంత డిస్కం పరిధిలో 8.32 లక్షల మీటర్లను, తూర్పు ప్రాంత డిస్కంలో 7.24 లక్షల మీటర్లను అమర్చుతున్నారు. అయితే ఒక్కో స్మార్ట్ మీటర్‌కు రూ.17.41 అధికంగా మొత్తం కలిపి రూ.95.99 అదాని సంస్థకు చెల్లిస్తున్నట్లు ఈనాడు తన కథనంలో అబద్ధాలను అచ్చేసింది. నిజానికి.. ఒక్కో సింగిల్ ఫేజ్ మీటర్‌కు నెలకు రూ.86.32 చొప్పున, త్రీ–ఫేజ్ మీటర్‌కు రూ.176.02 చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు దక్షిణ ప్రాంత డిస్కంలో సింగిల్ ఫేజ్ మీటర్లకు రూ.496.91 కోట్లు, త్రీ–ఫేజ్ మీటర్లకు రూ.419.50 కోట్లను చెల్లించాలి.ఇందులో రూ.118.12 కోట్లను కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో సంస్థకు అందిస్తుంది. అలాగే మధ్య ప్రాంత డిస్కంలో సింగిల్ ఫేజ్ మీటర్లకు రూ.496.91 కోట్లు, త్రీ–ఫేజ్ మీటర్లకు రూ.178.96 కోట్లను చెల్లించాలి. ఇందులో రూ.74.91 కోట్లను కేంద్రం ఇస్తుంది. ఇక తూర్పు ప్రాంత డిస్కంలో సింగిల్ ఫేజ్ మీటర్లకు రూ.543.85 కోట్లు, త్రీ–ఫేజ్ మీటర్లకు రూ.250.27 కోట్లను చెల్లించాలి. ఇందులో కేంద్రం గ్రాంటుగా రూ.82 కోట్లు వస్తుంది.ఈ చెల్లింపులన్నింటికీ 93 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఇలాగే రెండో దశలోనూ ఆయా డిస్కంల పరిధిలో మీటర్లను అమరుస్తారు. వీటికి సైతం కేంద్రం గ్రాంటును అందిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకు పనులను అప్పగించామని సీఎండీలు స్పష్టం చేశారు. -
Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు!
సాక్షి, అమరావతి: అర్హత ఉన్నవారెవరైనా స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని స్పష్టంగా చెప్పి.. వచ్చిన టెండర్లలో పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి తక్కువ ధర వచ్చేలా రివర్స్ టెండరింగ్ కూడా జరిపి.. అప్పుడు వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌మీటర్లు బిగించే టెండర్‌ను ఖరారుచేసినా ఈనాడు రామోజీరావు పెడబొబ్బలు పెడుతున్నారు. అదేదో ఘోరమైనట్లు తన విషపుత్రిక ఈనాడులో పిచ్చి రాతలు రాసిపారేస్తున్నారు. తమకు అభ్యంతరంలేదని రైతులే చెబుతున్నా స్మార్ట్‌మీటర్లపై ఆ పత్రిక పదే పదే విషం కక్కుతోంది. ఇందులో భాగంగానే ‘స్మార్ట్‌గా మేసేస్తున్నారు’ పేరుతో గురువారం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కానీ, ఎప్పటిలాగే రామోజీ రాతల్లో ఏమాత్రం వాస్తవంలేదని.. అయినా రైతులకు లేని అభ్యంతరం ఆయనకెందుకని ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీ కె. సంతోషరావు, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ఐ.పృధ్వీతేజ్‌లు తెలిపారు. శాస్త్ర, సాంకేతికతపై అవగాహనా లేమితో ఈనాడు కథనం వాస్తవానికి దూరంగా వుందని వారు తెలిపారు. ఈ మేరకు సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. నాణ్యమైన విద్యుత్ కోసమే స్మార్ట్ మీటర్లు.. పూర్వం వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్ హార్స్ పవర్ ప్రాతిపదికన వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గింది. ఆ తర్వాత విద్యుత్ సంస్థలు విడతల వారీగా వినియోగదారులకు కెపాసిటర్లను అందించినప్పటికీ కాలక్రమేణా వాటిని రైతులే తీసేశారు. దీంతో సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓ ఎంఎస్. 22, తేదీ : 01.09.2020) జారీచేసింది. దీని ప్రకారం.. ఃనాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను ప్రభుత్వం జమచేస్తోంది. ఆ మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.12,128.71పై.. పన్నులతో కలిపి రూ.14,455ల వ్యయంతో మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా ‘ఆర్డీఎస్ఎస్’ పథకంలో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంలకు సమకూరుతుంది’.. అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రమాదాలను తగ్గించవచ్చు.. అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, మీటరు అమర్చడానికి, అవి పాడైపోకుండా వుండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటుచేస్తున్నాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. మహారాష్ట్రతో పోలికేంటి? మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఇడీసీఎల్) సంస్థ పరిధిలో హెచ్‌వీడీఎస్ పథకం కింద వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు వాల్ మౌంటెడ్ ఎస్ఎంసీ మీటరు బాక్సును మాత్రమే రూ.2,100లతో ఏర్పాటుచేశారు. అయితే, మన రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్న ఎస్ఎంసీ మీటరు బాక్సులో అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు కూడా వుండడంతో మీటరు బాక్సు సైజు సుమారు రెండింతలు వుంటుంది. మహారాష్ట్ర స్మార్ట్ మీటర్లు గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం అమర్చుతున్నారు. ఇక్కడ పూర్తిగా వ్యవసాయ విద్యుత్ ఆధారిత సర్వీసులకు మాత్రమే పెడుతున్నాం. వ్యవసాయ స్మార్ట్ మీటర్ అమర్చడంతో గృహ, వాణిజ్య అవసరాల కోసం అమర్చిన స్మార్ట్ మీటర్లను పోల్చడం సరికాదు. మీటర్లతో అందరికీ మేలు.. మీటర్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్సిడీ మొత్తం మిగులుతుంది. ఈ మిగులు డబ్బుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. డిస్కంకు జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్రవ్యాప్తంగా వున్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకునే సౌలభ్యం వుంటుంది. అంతేకాక.. సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్ హెచ్చుతగ్గులను రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకే పనులను అప్పగించాం. ఈ ప్రక్రియలో ఎలాంటి గోప్యతకు ఆస్కారం లేదు. విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నామని సీఎండీలు వివరించారు. తెలియకపోతే తెలుసుకోండి.. విద్యుత్ సంస్థల్లో డీబీటీ విధానం కోసం 93 నెలల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. అనుబంధ పరికరాలకు సంబంధించిన టెండరును విక్రాన్ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకోవడంతో ఆ సంస్థ అనుబంధ పరికరాలను బాక్సులో అమర్చి సరఫరా చేసి వ్యవసాయ సర్వీసు వద్ద అమర్చుతోంది. అంతేతప్ప అది ఖాళీ బాక్సులు ఇస్తున్నట్లు కాదు. ♦ స్మార్ట్ మీటర్ల టెండర్లను దక్కించుకున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ విక్రాంత్ సంస్థ అమర్చిన అనుబంధ పరికరాలతో కూడిన మీటరు బాక్సులో మీటరు సరఫరా, అమరిక, అనుసంధానం పనులు చేపడుతోంది. ♦ ఈ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత సెంట్రల్ సర్వర్లతో అనుసంధానం అయిన ప్రతి సర్వీసు మీటర్ డేటా ఆన్లైన్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ♦సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్ హెచ్చుతగ్గులను నివారించడంతో పాటు రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. ♦ ఒప్పందం ప్రకారం డేటా నమోదైన సర్వీసులకు మాత్రమే ప్రతినెలా బిల్లింగ్ చేయడం జరుగుతుంది. ♦ మీటర్ రీడింగ్‌లో సర్వే, జీఎస్ మ్యాపింగ్, అనుసంధానం, హెచ్ఏఎస్, ఎంఏఎస్, ఎంఎంఎస్, సిమ్‌కార్డ్ రెంటల్, నెట్వర్క్ కాస్ట్, ఆపరేషన్–మెయింటినెన్స్ వంటి సేవలను పొందుపరిచారు. ♦ వ్యవసాయ సర్వీసులు దూరంగా వుండడంవల్ల నెట్వర్క్ హెచ్చుతగ్గులు ఉన్నచోట మీటరు దగ్గరకు వెళ్లి మీటరు డేటా స్వీకరిస్తున్నారు. ∙దీని అంచనా సుమారు 15 శాతంగా నిర్ణయించాం. ఈ అంచనా వ్యయం అధ్యయనం చేసిన తర్వాత నెలకు ఒక మీటరుకు రూ.197.05 పైసలుగా నిర్ణయించాం. -
విద్యుత్ రంగ అభివృద్ధికి రూ.13వేల కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పరిధిలో దాదాపు రూ.13 వేల కోట్లను ‘ఆర్డీఎస్ఎస్’ ద్వారా వెచ్చిస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. విద్యుత్ సంస్థ (ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, ఏపీఎస్పీసీఎల్, డిస్కం)ల డైరీల ఆవిష్కరణ, ‘ఏపీసీపీడీసీఎల్’ 4వ వార్షికోత్సవం గురువారం నిర్వహించారు. విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో కొత్తగా దాదాపు 484 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. విద్యుత్ నష్టాలు ఈ ఏడాది బాగా తగ్గాయని, 10 శాతానికి తీసుకుచ్చామని వివరించారు. ఇటీవల సీఎం జగన్ పలు సబ్స్టేషన్లు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కృష్ణపట్నం 800 మెగావాట్ల యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్టీటీటీపీఎస్‌లో మరో 800 మెగావాట్లు ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 99.7 శాతం ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యతతో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీఎస్పీడీడీఎల్ సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ ఇన్చార్జ్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ మాజీ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్ బాబు, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్లతో విద్యుత్ నష్టాలకు చెక్
-
స్మార్ట్ మీటర్లతో విద్యుత్ నష్టాలకు చెక్
సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని.. సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. అందుకే వ్యవసాయ, వాణిజ్య, గృహ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 మార్చి నాటికి దేశమంతటా.. కేంద్ర విద్యుత్ శాఖ ప్రతిపాదిత పంపిణీ వ్యవస్థ పునరుద్దీకరణ పథకం(ఆర్డీఎస్ఎస్)లో భాగంగా విద్యుత్ స్మార్ట్‌మీటర్ల బిగింపు ప్రక్రియ దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న దాదాపు 1.80 కోట్ల మంది (వ్యవసాయేతర) వినియోగదారులలో నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించేవారిని మినహాయించి మిగిలిన వారికి స్మార్ట్ మీటర్లు బిగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అలాగే ‘ఆర్డీఎస్ఎస్’లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం ఏపీలో 18.56 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ 50 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తయ్యింది. అయితే స్మార్ట్ మీటర్లపై అనేక అపోహలు, విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది. రైతులపై పైసా కూడా భారం పడదు.. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్‌ను కచ్చితత్వంతో లెక్కించలేకపోవడం వల్ల ఇంధన ఆడిట్ కష్టమవుతోంది. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి, లబ్ధిదారులకు నగదు బదిలీ కింద ప్రతి నెలా సబ్సిడీ రూపంలో ఎంత మొత్తం చెల్లించాలనే సమాచారం కోసం.. వ్యవసాయ కనెక్షన్లకు బిగించే స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. అలాగే విద్యుత్ ప్రమాదాల నుంచి రైతులను రక్షించేందుకు అలైడ్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వినియోగదారులపై గానీ, విద్యుత్ సంస్థలపై గానీ ఒక్క పైసా కూడా భారం పడదు. ‘ఆర్డీఎస్ఎస్’కు ఏపీ డిస్కంలు ఎంపికైనట్టు కేంద్రం ప్రకటించింది. తద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే అవకాశం ఏర్పడింది. స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదేనని కేంద్రం వివరించింది. స్మార్ట్‌మీటర్లతో ఉపయోగాలు.. మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలతో పాటు విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లకు, 11కేవి ఫీడర్లకు అన్నింటికీ కలిపి 42 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు డిస్కంలు చర్యలు చేపట్టాయి. గృహాలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార(టైం ఆఫ్ డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. అలాగే బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాలకు అనుగుణంగా చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకోవచ్చు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చు. ఈ మీటర్ల పెట్టుబడిలో దాదాపు 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది. రైతులకు అభ్యంతరం లేదు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వ్యవసాయ బోరు పనితీరు మెరుగుపడుతుంది. మోటార్ కాలిపోకుండా ఉంటుంది. ఇప్పటికంటే మెరుగైన విద్యుత్ వస్తుందని విద్యుత్ శాఖ సిబ్బంది మాకు వివరించారు. దీంతో మీటర్ పెట్టడానికి మా లాంటి రైతులందరూ ముందుకు వస్తున్నారు. మీటర్‌తో పాటు రక్షణ పరికరాలు అందించడం బాగుంది. మాకు 8 బోర్లు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ వల్ల ఏ సర్వీసునూ తొలగించలేదు. – బొల్లారెడ్డి రామకృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం, పశ్చిమగోదావరి జిల్లా -
అవి అప్పులు కాదు.. డిస్కంలకు ఆస్తులే.!
సాక్షి, అమరావతి: ఎవరైనా స్థిరాస్తులు ఏర్పరుచుకునే సమయంలో రుణం తీసుకోవడం సహజం. అలాగే ఆస్తుల కల్పనకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కూడా తీసుకుంటాయి. వాటితో విద్యుత్ సరఫరా సాఫీగా జరగడానికి సబ్ స్టేషన్లు, కార్యాలయ భవనాలు, స్థలాలు, విద్యుత్ లైన్లు వంటి స్థిరాస్తులు ఏర్పరుచుకుంటాయి. ఆ తర్వాత బిల్లుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించి అప్పులు తీరుస్తాయి. అలాగే విద్యుత్ కొనుగోలు కోసం బ్యాంకుల వద్ద కన్నా తక్కువ వడ్డీకి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణం సేకరించి ఉత్పత్తి సంస్థలకు చెల్లిస్తుంటాయి. దీనివల్ల వడ్డీ మిగులు రూపంలో రూ. వందల కోట్లు ఆదా అవుతుంటే.. ఏమాత్రం అవగాహన లేకుండా ‘కరెంటోళ్ల నెత్తిన అప్పుల కుప్ప’ శీర్షికన ఈనాడు మంగళవారం ఓ కట్టుకథను అచ్చేసింది. దీనిపై నిజాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ‘సాక్షి’కి వివరించారు. పెట్టుబడిలో 40 శాతం రాయితీ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత పంపిణీ వ్యవస్థ పునరుద్దీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా వినియోగదారులకు స్మార్ట్‌మీటర్ల బిగింపు ప్రక్రియ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న దాదాపు 1.80 కోట్ల మంది (వ్యవసాయేతర) వినియోగదారులలో నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించే వారిని మినహాయించి మిగిలిన వారికి స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రతిపాదించడం జరిగింది. ఇది కేవలం 25 శాతం మంది వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల సమయానుసార (టైం అఫ్ డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే ఆఫ్ పీక్ సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం అధిక విద్యుత్ వాడే వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల బిగింపు తప్పనిసరి. ఈ మీటర్ల పెట్టుబడిలో దాదాపు 40 శాతం వరకూ రాయితీ లభిస్తుంది. ఈ ఆర్డీఎస్ఎస్ పథకంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఒక భాగం మాత్రమే. వడ్డీ మిగులు ఈ సంవత్సరం పెరిగిన రుణాలలో ఎక్కువ భాగం విద్యుత్ ఉత్పత్తి సంస్థల బకాయిలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆలస్య చెల్లింపుల సర్ చార్జీ నిబంధనల ప్రకారం పంపిణీ సంస్థలు చెల్లించాయి. బ్యాంకుల వద్ద కన్నా తక్కువ వడ్డీకి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో ఉన్న ఆలస్య చెల్లింపు సర్ చార్జీకన్నా చాలా తక్కువ వడ్డీ రేటుకు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణం సేకరించి ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాయి. దీనివల్ల వడ్డీ మిగులు రూపంలో రూ. వందల కోట్లు మిగిల్చాయి. వాస్తవాలు ఇలా ఉంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈనాడు వక్రరాతలు రాయడం విడ్డూరంగా ఉంది. రుణాల ద్వారా ఆస్తుల సృష్టి అభివృద్ధి పనులు, వ్యవస్థ బలోపేతం కోసం చేసే పనుల ప్రాజెక్టుల వ్యయంలో దాదాపు 80 శాతం నుంచి ఒక్కోసారి 100 శాతం వరకూ ఆర్థిక సంస్థల నుంచి విద్యుత్‌రంగ సంస్థలు రుణాలు తీసుకుంటాయి. కొత్త ఆస్తుల సృష్టి రుణాల ద్వారానే సాధ్యమవుతుంది. వాటి ద్వారా వచ్చే రాబడితో అప్పులు కూడా తీరతాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కూడా ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలకు బహుళ వార్షిక విద్యుత్ టారిఫ్ నిబంధనలు నిర్దేశిస్తుంది. డిస్కంలు ఏటా అవసరాలకు అనుగుణంగా సబ్ స్టేషన్లు, లైన్లు నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులు చేపడతాయి. వీటికి కావలసిన ఆర్థిక అవసరాలలో ఎక్కువ భాగం రుణాల ద్వారా సేకరిస్తాయి. ఖర్చులను నిబంధనల ప్రకారం టారిఫ్ నుంచి రాబట్టుకోవడానికి కమిషన్ అనుమతి తీసుకుంటాయి. రైతుకు డిమాండ్ చేసే హక్కు ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం వినియోగంలో వ్యవసాయ రంగానికి 18 శాతం నుంచి 20 శాతం అవుతోంది. కచ్చితత్వంతో ఈ విద్యుత్‌ను లెక్కించలేకపోవడం వల్ల రాష్ట్రంలో ఇంధన ఆడిట్ కష్టం అవుతోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనల ప్రకారం వ్యవసాయ వినియోగదారులకు కూడా మీటర్లు బిగించాలి. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ పథకం ద్వారా అయ్యే కరెంట్ వినియోగం తెలుసుకోవడానికి, ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు నగదు బదిలీ లెక్కకు వ్యవసాయ కనెక్షన్లకు బిగించే స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. దీనికయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతీ నెల వ్యవసాయ విద్యుత్ వినియోగదారుడు కూడా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉండడంతో రైతులకు నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా కోసం డిస్కంలను డిమాండ్ చేసే హక్కు లభిస్తుంది. -
‘స్మార్ట్’ మీటర్లకు సై
వీరంపాలెం గ్రామం నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్: అర్ధరాత్రి చేనుకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటార్ స్విచ్ ఆన్ చేయగానే విద్యుత్ షాక్ తగిలి అన్నదాత ప్రాణాలు వదిలేస్తే ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. రైతులకు ఇచ్చే కరెంటులో నాణ్యత లేకపోతే పంట మనుగడ కష్టం. ఎన్ని సర్వీసులకు ఎంత విద్యుత్ ఇవ్వాలో తెలియక సాంకేతిక సమస్యలతో సబ్ స్టేషన్లపై లోడ్ ఎక్కువై ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టం. ఈ సమస్యలను అధిగమించి, పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌ను ఇకపై రైతులకు హక్కుగా మార్చాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తూ, మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామంటుంటే ఎందుకు కాదంటామని రైతులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. పొలాల్లో ప్రాణాలు వదిలే పరిస్థితిగానీ, నీళ్లు లేక పంటలు ఎండిపోయే దుస్థితిగానీ రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రైతులు మద్దతు పలుకుతున్నారు. పైలట్ ప్రాజెక్టులో 33% విద్యుత్ ఆదా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా 2025 మార్చి నాటికి దేశం అంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్రంలో 18.56 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని 2020లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగంలో 18 శాతం నుంచి 20 శాతం వరకు వ్యవసాయ రంగం వాటా ఉంది. దీనిని మరింత కచ్చితంగా లెక్కించడం కష్టమవుతోంది. ఇది తెలియాలంటే మీటర్లు అమర్చి, విద్యుత్ వినియోగాన్ని లెక్కించాలి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ముందు శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఫలితంగా 33 శాతం విద్యుత్ ఆదా కనిపించింది. దీంతో రాష్ట్రం అంతటా స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు డిస్కంలు సన్నద్ధమయ్యాయి. తొలి విడతగా ఏపీఈపీడీసీఎల్‌లో 32,500, ఏపీసీపీడీసీఎల్‌లో 35,000, ఏపీఎస్పీడీసీఎల్లో 70,200 చొప్పున స్మార్ట్ మీటర్లను అమర్చే ప్రక్రియను మొదలుపెట్టాయి. నమ్మకంతోనే రైతుల మద్దతు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ప్రస్తుతం రైతుల పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొత్త ఖాతాలు తెరిపిస్తోంది. వినియోగం ఆధారంగా బిల్లు మొత్తం నగదు బదిలీ ద్వారా జమ చేస్తుంది. అది డిస్కంలకు బదిలీ అవుతుంది. దీనివల్ల నాణ్యమైన విద్యుత్‌ను పొందే హక్కు రైతులకు లభిస్తుంది. మీటర్ రీడింగ్ కోసం మోటారు దగ్గరకు లైన్మెన్లు రావడం వల్ల విద్యుత్ సమస్య ఏదైనా ఉంటే వారి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించుకోవచ్చు. రీడింగ్‌ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని తెలుసుకుని లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవచ్చు. ఎంత లోడు వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల ఆ మేరకు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు పటిష్టం చేసుకోవచ్చు. అనధికార కనెక్షన్లు ఉండవు. ఇలాంటి ఏర్పాటుపై నమ్మకం కుదరడంతో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రైతులు అంగీకార పత్రాలను డిస్కంలకు అందించారు. పనితనానికి, ప్రాణానికి భరోసా మీటర్‌తో పాటు ఏర్పాటు చేస్తున్న రక్షణ పరికరాలతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కెపాసిటర్, వోల్టేజి హెచ్చు తగ్గులను నివారించి వ్యవసాయ విద్యుత్ మోటారు జీవిత కాలాన్ని పెంచడానికి దోహదపడుతుంది. మోటారు పనితనం వృద్ధి చెందుతుంది. మోటారు స్టార్టర్, వైండింగ్, అనుసంధానించిన వైర్లలో వచ్చిన లోపాలతో మోటారు కాలిపోవడం గాని, షార్ట్ సర్క్యూట్‌తో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవ్వడం గాని జరగకుండా కాన్ఫిగరేషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీబీ) కాపాడుతుంది. వర్షాలకు తడిచినప్పుడు ఇనుప బాక్స్‌ల ద్వారా కలిగే విద్యుత్ ప్రమాదాలను షీట్ మౌల్డింగ్ కాంపౌండ్ (ఎస్ఎంసీ) బాక్స్ నివారిస్తుంది. ఎర్త్ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం, సరైన పద్ధతిలో అనుసంధానించడం వల్ల రైతులకు మోటారు స్టార్టర్, మీటరు బాక్సు తదితర ఉపకరణాల ద్వారా షాక్ తగలదు. వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లదు. రైతుపై పైసా భారం పడదు స్మార్ట్ మీటర్ల కోసం రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా చెల్లించనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క విద్యుత్ సర్వీసునూ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత తొలగించరు. ఒక వినియోగదారుని పేరిట కొన్ని కనెక్షన్లే ఉండాలనే నిబంధన ఏదీ లేదు. ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత యజమాని పేరిట సర్వీసు కనెక్షన్ పేరు మార్చుకోవాలన్నా చేసుకోవచ్చు. అనధికార, అదనపు లోడు కనెక్షన్లన్నీ క్రమబద్దీకరిస్తారు. పేర్ల మార్పు ప్రక్రియ కోసం, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, రైతు ఎవరి దగ్గరకూ వెళ్లనవసరం లేదు. డిస్కంలు, గ్రామ సచివాలయ సిబ్బందే రైతు వద్దకు వచ్చి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. – కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ అనుమానాలేం లేవు స్మార్ట్ మీటర్ పెడతామన్నప్పుడు మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ రామకృష్ణని, లైన్‌మెన్‌ని దాని గురించి అడిగాను. బిల్లు వేస్తారని అందరూ అంటున్నారనే సందేహాన్ని వారి వద్ద వ్యక్తం చేశాను. అలాంటిదేమీ లేదని, ఉచిత విద్యుత్ ఎన్ని యూనిట్లు వాడుతున్నామనేది తెలుసుకోవడం కోసమే మీటర్లు అని చెప్పడంతో నా అనుమానాలన్నీ తీరిపోయాయి. వెంటనే మీటర్ అమర్చడానికి అంగీకరించాను. – అఖిల్ రెడ్డి, రైతు, వీరంపాలెం మాకే మంచిది స్మార్ట్ మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా, దొంగతనానికి, మరమ్మతులకు గురైనా ఆ ఖర్చులు మొత్తం విద్యుత్ కంపెనీలే భరిస్తాయని హామీ ఇచ్చారు. మేం పైసా కట్టకుండా మీటర్ పెడతామన్నారు. అంతకంటే ఏం కావాలి? ఇప్పటికే మాకు తొమ్మిది గంటలు పగలు కరెంటు ఇస్తున్నారు. దానివల్ల పంటలు బాగా పండుతున్నాయి. మీటర్లు పెట్టాక ఇంకా మేలు జరుగుతుందంటే మాకే మంచిది కదా! – మాకిరెడ్డి కృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం రైతులకు మెరుగైన విద్యుత్ రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వడంలో ఎక్కడా రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఏలూరు ఆపరేషన్ సర్కిల్, నీలాద్రిపురం సెక్షన్‌లోని వీరంపాలెం లో ముందుగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు మీటర్లపై అవగాహన కల్పించడంతో వారంతా సంపూర్ణ మద్దతునిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత రావడం లేదు. – పి.సాల్మన్‌రాజు, ఎస్ఈ, ఏలూరు ఆపరేషన్ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ -
రామోజీ మార్కు స్మార్ట్ బ్లండర్!
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి రివర్స్ టెండర్లు కూడా నిర్వహించాకే ఖరారు చేస్తే అదేదో ఘోరమైనట్లుగా ఈనాడు రామోజీ చిత్రీకరిస్తున్నారు. కడప జిల్లా వాసులు అసలు వ్యాపారాలే చేయకూడదన్నట్లుగా స్మార్ట్ మీటర్ల టెండర్ దక్కించుకున్న సంస్థపై ఈనాడు పదేపదే విషం గక్కుతోంది. ఈనాడు కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు స్పష్టం చేశారు. కోవిడ్‌లో అధిక ధర.. అందుకే రద్దు వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ అందించడం, ప్రమాదాలకు తావు లేకుండా, మీటర్లు కాలిపోకుండా, ట్రాన్స్ఫార్మర్ల భద్రతని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ లేదా ఐఆర్డీఏ మీటర్లను రక్షణ పరికరాలతో అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు టెండర్ రూపొందించిన డిస్కమ్‌లు న్యాయ సమీక్షకు పంపించాయి. 15 రోజుల సలహాలు, అభ్యంతరాలను సేకరించిన అనంతరం ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా డిస్కమ్‌లు టెండర్లను పిలిచాయి. ఎల్1 గా నిలిచిన బిడ్డర్‌కు టెండర్ అప్పగించాయి. అయితే ఈ ప్రక్రియ కోవిడ్ సమయంలో జరిగినందువల్ల సంస్థలు, ఫ్యాక్టరీలు మూతపడి ఉండడం, టెండర్ విలువ అధికంగా ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ ప్రక్రియను రద్దు చేసింది. మళ్లీ పిలవడంతో ఆదా.. ధరలు తగ్గించేలా చర్యలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నది అక్షర సత్యమే. రీ టెండరింగ్ ద్వారా ధర మొదటి సారి కంటే 15.75% తగ్గింది. ఏర్పాటుకు 27 నెలలు, నిర్వహణకు 93 నెలలుగా కేంద్ర ప్రభుత్వం వ్యవధి పెంచింది. దీనివల్ల మీటర్ గ్యారంటీ పీరియడ్ 10 ఏళ్లకు పెరిగింది. నిర్వహణ సమయం పెరగడం డిస్కమ్‌లకు వ్యయంలో 2 శాతం ఆదా అవుతుంది. షిరిడీ సాయి, అదాని లాంటి పెద్ద సంస్థలు పోటీ పడటం వల్ల ఈ ప్రాజెక్టుకు సరైన ధర వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోలికలా?.. హవ్వ! స్మార్ట్ మీటర్ల విధానాన్ని దేశంలో మొదటిగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టలేదు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లను పట్టణ ప్రాంతాల్లోని స్మార్ట్ మీటర్ విధానంతో పోల్చడం, ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు చేయడం ‘ఈనాడు’ ద్వంద్వ నీతికి నిదర్శనం. ఏదైనా ఓ వ్యవస్థను మరో సమానమైన దానితో పోల్చడానికి అవి రెండూ ఒకే వ్యవస్థలు అయి ఉండాలి కదా? ఆ మాత్రం కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లకు సంబంధించి రైతులపై బిల్లులు, ట్రూఅప్ లాంటి భారమేదీ మోపట్లేదు. రక్షణ పరికరాలతో సహా మొత్తం ఉచితంగానే ప్రభుత్వం అందచేస్తోంది. -
జనంపై భారం లేదు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ కొనసాగుతుంటే ఏపీ మినహా మరెవరూ స్మార్ట్ మీటర్లు అమర్చడం లేదంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను అచ్చేస్తోంది ఈనాడు. ప్రభుత్వ, వాణిజ్య, పారిశ్రామిక సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తుంటే ‘జనం జేబుకు చిల్లు‘ అంటూ వక్ర భాష్యాలు చెబుతోంది. ఆ కథనంలో దాచిపెట్టిన వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు గురువారం ‘సాక్షి’కి వెల్లడించారు. ♦ విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2025 నాటికి ప్రతి సర్వీసు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు అన్నిటికి స్మార్ట్ మీటర్లను అమర్చాలనే నిబంధన విధించాయి. వినియోగదారులపై ఎటువంటి అదనపు భారం లేకుండా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పధకాన్ని రూపొందించారు. ఈమేరకు దేశవ్యాప్తంగా డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. ♦ రాష్ట్రంలో 200 యూనిట్లు అంతకుమించి వాడకం ఉన్న సర్వీసులకు, ప్రభుత్వ సర్వీసులకు డిస్కమ్‌లు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తాయి. తద్వారా పేద, మధ్య తరగతిపై భారం లేకుండా చర్యలు తీసుకున్నాయి. ప్రీపెయిడ్ మీటర్లలో కొత్త టెక్నాలజీ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, నాణ్యతను తెలుసుకునే వీలుంది. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చు. డబ్బులు కట్టలేదని లైన్మెన్ కరెంట్ నిలుపుదల చేసే పరిస్థితి ఉండదు. ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు 2025 మార్చి వరకు గడువు ఉంది. రెండు నెలల వ్యవధిలో ఏర్పాటు చేయాలన్నది అవాస్తవం. ♦ దేశంలో 19.792 కోట్ల మంది వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు ఆమోదం లభించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌ఘడ్, బిహార్, అసోం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, త్రిపురలో 7.517 కోట్ల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు టెండర్లను ఖరారు చేశారు. బిగించే ప్రక్రియ కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ♦ మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు, వాణిజ్య భవనాలకు, పారిశ్రామిక వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లకు, 11 కేవీ ఫీడర్లకు కలిపి 42 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ఒక్కో సింగిల్ ఫేజ్ మీటర్‌కు నెలకు రూ.86.32, త్రీ–ఫేజ్ మీటర్‌కు రూ.176.02 చొప్పున 93 నెలల వ్యవధిలో టెండర్ దక్కించుకున్న సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, పదేళ్ల పాటు నిర్వహణకు రూ.5 వేల కోట్లు వ్యయం కానుంది. అయితే ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా మీటరుకు రూ.1,350 వరకు కేంద్రం గ్రాంట్ ఇస్తుంది. ఇదంతా వదిలేసి రూ.20 వేల కోట్ల భారమంటూ ‘ఈనాడు’ కాకి లెక్కలతో తప్పుడు రాతలను అచ్చేసింది. -
Fact Check: నిబంధనలు పాటించినా ఏడుపే!?
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టుల కేటాయింపు, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కాంట్రాక్టు నిర్ధారణతో సహా అన్ని విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అత్యంత పారదర్శకతో వ్యవహరించాయి. అన్ని అంశాల్లో అత్యంత పకడ్బందీగా నిబంధలను పాటించినప్పటికీ ఈనాడుతో సహా కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వం, ఇంధన సంస్థలపై పదేపదే అసత్య ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించినట్లు శుక్రవారం వార్తలు ప్రచురించాయి. అయితే, సోమిరెడ్డి మాటల్లో నిజంలేదని, ఈనాడు, ఇతర పచ్చపత్రికల్లో రాతలన్నీ పచ్చి అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పద్మజనార్ధనరెడ్డి స్పష్టంచేశారు. ఆరోపణ : ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల పేరుతో జగన్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది.. వాస్తవం : కేంద్ర ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్, ఏపీ ప్ర భుత్వ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. దేశంలో అర్హత గల ప్రతి గుత్తేదారు (కాంట్రాక్టరు) పాల్గొనే అవకాశం కల్పించారు. రివర్స్ టెండరింగ్ జరిపిన తర్వాతే ఏపీఎస్పీడీసీఎల్ పరికరాలను కొనుగోలు చేస్తోంది. అన్ని నిబంధనలు పరిశీలించిన తరువాత, ఈ ప్రక్రియలో పాల్గొన్న అందరిలో ఎల్–1గా ఉన్న గుత్తేదారుని ఎంపిక జరుగుతుంది. నామినేషన్ పద్ధతిలో ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేయడమనేది అసలు వీలుపడదు. ఆరోపణ : ఎలాంటి అనుభవంలేని సంస్థకు ప్రభుత్వం వేల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టింది.. వాస్తవం : షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనేది చిన్న సంస్థ ఏమీకాదు. ఈ సంస్థకు 25 ఏళ్లుగా విద్యుత్ ట్రా న్స్ఫార్మర్ల తయారీలో అనుభవం ఉంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లే బొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపుతో ఆసియాలోనే అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు వచ్చిన విషయం బహుశా సోమిరెడ్డికి తెలియదేమో. ఆరోపణ : ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 611.40 కోట్ల విలువైన పనులకుగానూ రూ.380 కోట్ల విలువైన పనులకు షిరిడీ సాయికే కట్టబెట్టింది.. వాస్తవం : తక్కువ ధరకు కోట్‌చేసిన సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ కెపాసిటీల కు సంబంధించి 53,003 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లను షిరిడిసాయి సంస్థ దక్కించుకుంది. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 35,911 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లనూ పొందింది. గత ప్రభుత్వంలోనే హెచ్‌వీడీఎస్, వివిధ సబ్–స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించి రూ.2,799.38 కోట్ల విలువైన పనులను షిరిడిసాయి సంస్థ కైవసం చేసుకుంది. నిజంగా ఇది సీఎం జగన్మోహన్రెడ్డికి కావాల్సిన వారి సంస్థ అయితే గత ప్రభుత్వ హయాంలో ఎందుకు టెండర్లు కట్టబెట్టారు? ఆరోపణ : రామాయపట్నం పోర్టు దగ్గర రూ.42 వేల కోట్ల ప్రాజెక్టు షిరిడీ సాయికి ఇచ్చింది.. వాస్తవం : రామాయపట్నం పోర్టు దగ్గర సోలార్ ప్యానల్ తయారీ పార్కు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు. దీని కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంలేదు. దీనిబట్టే ఈ కంపెనీ అన్ని అర్హతలున్న పెద్ద సంస్థ అని, దిగ్గజ సంస్థలను కాదని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు దక్కించుకుందని అర్థమవుతోంది. రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులన్నీ పూర్తి చట్టబద్ధంగా జరిగాయి. ఆరోపణ : పక్కపక్క రాష్ట్రాలు కొన్న ట్రాన్స్ఫార్మర్ల ధరల్లో వ్యత్యాసం ఉందంటే దోపిడీ జరిగినట్లే కదా.. వాస్తవం : ట్రాన్స్ఫార్మర్ ధర దానిలో ఉపయోగించే వైండింగ్ వైర్ డయామీటర్, కాయిల్స్ డయామీటర్, ఇన్సులేషన్, క్లియరెన్స్, ట్యాంక్ డైమెన్షన్, ట్రాన్స్ఫార్మర్, ఆయిల్ క్వాంటిటీ, కోర్ సైజు వంటి నాణ్యతలను బట్టి ఉంటుంది. టెండర్లు వేసిన సమయంలో కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధంవల్ల ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే పరికరాల ధరలు అధికంగా ఉండేవి. ఏపీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేసిన నియంత్రికల్లో నష్టాలు ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్) కన్నా చాలా తక్కువ. వివిధ కంపెనీల ట్రాన్స్ఫార్మర్లను బెంగుళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఎస్ఐ) టెస్ట్‌చేసి షిరిడిసాయి, తోషిబా నియంత్రికల్లో నష్టాలు ఐఎస్ ప్రకారం వున్నాయని ధృవీకరించడం విశేషం. ఇతర కంపెనీల ఉత్పత్తిదారుల ట్రాన్స్ఫార్మర్లు ఈ టెస్టులో ఫెయిలయ్యాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నిర్ధేశించిన విధంగా మన డిస్కంలు ప్రస్తుతం ఫైవ్‌స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు బాగా తగ్గాయి. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా సమస్యలు తగ్గుముఖం పట్టాయి. కానీ, సోమిరెడ్డి మాత్రం టూ–స్టార్‌తో ఫైవ్‌స్టార్ ధరను సరిపోల్చారు. తెలంగాణ డిస్కంలు టూ స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశాయి. ఆరోపణ : కడప కంపెనీదే హవా.. వాస్తవం : ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు టెండరు పొందింది షిరిడిసాయి సంస్థ ఒక్కటే కాదు.. దీనితోపాటు హైపవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, కన్యకాపరమేశ్వరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (మెదక్ జిల్లా), బీఎస్సార్ పవర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (తెనాలి), సాయిబాబా ఫ్లేమ్ ఫ్రూఫ్ స్విచ్‌గేర్, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్, తోషిబా ట్రాన్స్‌విుషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రినిటీ క్లీన్టెక్(హైదరాబాద్), ఎస్వీఆర్ ఎలక్ట్రికల్స్, విజయ్ ట్రాన్స్ఫార్మర్స్ (గుంటూరు) సంస్థలు కూడా కాంట్రాక్టు పొందిన వాటిలో ఉన్నాయి. ఆరోపణ : వ్యవసాయ మీటర్లకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు అమర్చుతామని చెబుతున్న ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేస్తోంది.. వాస్తవం : దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర ఇంధన శాఖ నిబంధనల మేరకే స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు టెండరు నిబంధనావళి తయారైంది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు ఉచితమే. ఇక ఏపీఈఆర్సీ నిర్ణయించిన దాని ప్రకారమే ట్రూఅప్ వంటి విద్యుత్ చార్జీలు ఉంటాయి. -
స్మార్ట్ మీటర్లతో రైతు సాధికారత
సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్ వాడుకునే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని, వారి సాధికారతకు దోహద పడుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నంబర్ 22, తేదీ: 01 – 09 – 2020) ప్రకారం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లపై ‘సాక్షి’ ప్రతినిధికి విజయానంద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ♦ ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా అయ్యే మొత్తం విద్యుత్‌లో 18 నుంచి 20 శాతం వ్యవసాయ రంగం వినియోగించుకుంటోంది. ఈ విద్యుత్‌ను లెక్కించడం కష్టమవుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు మెరుగుదలకు, ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతోందో తెలుసుకోవడానికి, నగదు బదిలీ కింద ప్రతి నెలా సబ్సిడీ రూపంలో ఎంత చెల్లించాలనే లెక్కకు వ్యవసాయ సర్విసులకు స్మార్ట్ మీటర్లు బిగించాలి. ♦ స్మార్ట్ మీటర్లు బిగించడానికయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యుత్ సంస్థలపైగానీ, రైతులపైగానీ ఒక్క రూపాయి భారం పడదు. ప్రతి నెలా వ్యవసాయ విద్యుత్ వినియోగదారుడు కూడా అందరిలాగే విద్యుత్ బిల్లు చెల్లించే వెసులుబాటు ఉండడంతో రైతుకు నాణ్యమైన, నమ్మకమైన అంతరాయాలు లేని విద్యుత్‌ను డిమాండ్ చేసే హక్కు లభిస్తుంది. డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుంది. ఇది రైతు సాధికారతకు దోహద పడుతుంది. ♦ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలను అనుసరించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం. స్మార్ట్ మీటర్ ధరను కేంద్రం ప్రాథమికంగా రూ.6 వేలుగా అంచనా వేసింది. అనుబంధ పరికరాలను అందులో కలపలేదు. స్మార్ట్ మీటరు సక్రమంగా పనిచేయడానికి సాంకేతికంగా అనుబంధ పరికరాలు అవసరం. ♦ స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్త్ వైరు, ఎర్త్ పైపు, మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తారు. మోటార్లను బాగా నడపడంలో, వోల్టేజి సమస్య రాకుండా చూడటంలో కెపాసిటర్లది కీలక పాత్ర. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు సరైన ఎర్తింగ్ ఉండాలి. ఎంసీబీ ద్వారా ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. తద్వారా ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాలను తగ్గించడంతోపాటు విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు. ♦ స్మార్ట్ మీటర్ల ధర, అనుబంధ పరికరాల ధర వేర్వేరు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ సర్విసుకు అనుబంధ పరికరాలకు రూ.12128.71, పన్నులతో కలిపి రూ.14,455ల ఖర్చవుతుంది. దీనిలో దాదాపు 60 శాతం కేంద్రం నుంచి గ్రాంటుగా పొందడానికి ప్రయతి్నస్తున్నాం. ♦ స్మార్ట్ మీటర్లు అమర్చడం వల్ల డిస్కంలకు ప్రయోజనం ఏమీ లేదని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. ఈ ప్రాజెక్టును మరింత పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయడం కోసం సూచనలు చేశాం. ♦ మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల అంశాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు. అనుబంధ పరికరాలు లేకుండా ఉత్తరప్రదేశ్ మినహా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ వ్యవసాయ విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడంలేదు. ♦ ఆర్డీఎస్ఎస్ పథకంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో గృహ విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో ఏపీలోనూ గృహాలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. - ‘సాక్షి’తో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ -
స్మార్ట్ మీటర్లతో రైతుపై పైసా భారం పడదు
సాక్షి, అమరావతి: రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన పథకమే డాక్టర్ వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. ఈ పధకం క్రింద రైతులు వ్యవసాయ విద్యుత్‌కు చెల్లించాల్సి న బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ బిల్లు మొత్తాన్ని నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రత్యేక రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్థనరెడ్డి, కె.సంతోషరావు చెప్పారు. స్మార్ట్ మీటర్లపై అపోహలను తొలగిస్తూ వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను సాంకేతిక అంశాల ఆధారంగా వారు ‘సాక్షి’ ప్రతి నిధికి వివరించారు. వారు తెలిపిన పూర్తి వివరాలు.. రైతులకు పైసా ఖర్చు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ ఎనర్జీ మీటర్లను అమర్చాలని ఆదేశించింది. వినియోగం ఆధారంగా వ్యవసాయ సబ్సిడీ మొత్తం రైతు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. ఆ తర్వాత అంతే మొత్తం డిస్కంలకు స్వయంచాలకంగా బదిలీ అవుతుంది. వ్యవసాయ సర్వీసులకు మీటర్ల ఖర్చును సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న అందరు రైతులకు (వ్యవసాయ వినియోగదారులకి) వర్తిస్తుంది. రైతులు జేబు నుండి ఒక్క పైసా చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారో, అదే విధంగా ఇక మీదట కూడా పొందుతారు. అలాగే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ వినియోగానికి ఎటువంటి పరిమితి లేదు. వినియోగించిన యూనిట్ల బిల్లు మొ త్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. మీటరు బిగించడానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. మీటరు మరమ్మతు ఖర్చులు పూర్తిగా విద్యుత్ కంపెనీలే భరిస్తాయి. మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా లేదా దొంగతనానికి గురైనా, వాటికి అయ్యే ఖర్చును విద్యుత్ కంపెనీలు భరిస్తాయి. మొదటిసారైనా, తర్వాత అయినా మొత్తం ఖర్చు విద్యుత్ కంపెనీలదే. రైతులపై పైసా భారం ఉండదు. రక్షణ పరికరాలతో లాభాలు వ్యవసాయ విద్యుత్ మీటర్‌తో పాటు ఏర్పాటు చేస్తున్న భద్రతా ఉపకరణాలతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కెపాసిటర్, వో ల్టేజి హెచ్చు తగ్గులను నివారించి వ్యవసాయ విద్యుత్ మోటారు జీవితకాలాన్ని పెంచుతుంది. మోటారు పనితనం మెరుగవుతుంది. వ్యవసాయ విద్యుత్ మోటారు స్టార్టర్, మోటారు వైండింగ్, అనుసంధానించిన వైర్లలో వచ్చిన లోపాలతో మోటారు కాలిపోవడం గాని, షార్ట్ సర్క్యూట్‌తో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ కావడం గాని జరగకుండా కాన్ఫిగరేషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీబీ) కాపాడుతుంది. వర్షాలకు తడిసినప్పుడు ఇనుప బాక్స్‌ల ద్వారా కలిగే విద్యుత్ ప్రమాదాలను షీట్ మౌల్డింగ్ కాంపౌండ్ (ఎస్ఎంసీ) బాక్స్ నివారిస్తుంది. ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. పీవీసీ వైరు ఎండకు ఎండి త్వరగా పాడవడమే కాకుండా షార్ట్ సర్క్యూట్‌తో మోటారుకు, ట్రాన్స్ఫార్మర్కు ప్రమాదకారి అవుతుంది. డబ్ల్యూపీటీసీ (అల్యూమినియం) వైరుతో వీటిని నివారించవచ్చు. అల్యూమినియం ఎర్త్ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం, సరైన పద్ధతిలో అనుసంధానించడం వల్ల రైతులకు మోటారు స్టార్టర్, మీటరు బాక్సు తదితర ఉపకరణాల ద్వారా షాక్ తగలదు. తద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. పథకం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు స్మార్ట్ మీటరు బిగించడం వలన రైతు ఎంత కరెంటు ఉపయోగిస్తున్నది కచ్చితంగా లెక్క తేలుతుంది. ప్రభుత్వం డబ్బులు అతనికి ఎంత వస్తున్నాయో తెలుస్తుంది. రైతు డబ్బులు చెల్లించడం వలన సరఫరా నాణ్యత, మంచి సేవలను విద్యుత్ సంస్థ నుంచి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. మీటర్ పెట్టడం వలన జేఎల్ఎం, లైన్మెన్ నెలనెలా మీటర్ రీడింగ్ కోసం మోటారు దగ్గరకు రావడం వలన ఏదైనా సమస్య ఉన్నచో అతని ద్వారా పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. మీటర్ రీడింగ్ ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని వారు తెలుసుకోగలరు. -
పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్లు
సాక్షి, అమరావతి: వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు టెండర్ల ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. మీటర్ల ధర ఇతర రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉందని, టెండర్లలో అవకతవకలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా కొందరికి టెండర్లు కట్టబెట్టారని, ఈ ఖర్చంతా ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపైనే వేస్తారని పచ్చ పత్రికలు, విపక్షాలు చేస్తున్న తప్పు డు ప్రచారంపై వారు స్పందించారు. వారు శని వా రం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టెండర్లలో ఎటువంటి దాపరికం లేదని స్పష్టంచేశారు. నిబంధనల ప్రకా రం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అనుమతి తీసుకొన్న తరువాత ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ పో ర్టల్ ద్వారా టెండర్లను ఆహ్వానించామని చెప్పారు. దే శంలోని ప్రతి గుత్తేదారు పాల్గొనేలా టెండర్ల ప్రక్రి య పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశా రు. వారు వెల్లడించిన వివరాలు వారి మాటల్లోనే.. స్మార్ట్ మీటర్ల టెండర్లలో షిరిడీ సాయి, అదానీ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్ 1 గా నిలిచింది. అనుబంధ పరికరాల టెండర్లలో షిరిడీ సాయి, జీవీఎస్, విక్రాన్ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్ 1 గా నిలిచింది. ఒక్కో వ్యవసాయ సర్వీసుకు, అనుబంధ పరికరాలతో కలిపి రూ.11,191.64 మాత్రమే. పన్నులతో కలిపి మొత్తం రూ.13,334.88 ఖర్చవుతుంది. స్మార్ట్ మీటర్ల ధరను మాత్రమే కేంద్రం రూ.6 వేలతో అంచనా వేసింది. ఒక్కో మీటరు వ్యయం రూ.36,700కు కొంటుందనడంలో వాస్తవం లేదు. ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్స్ కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా 93 నెలల కాంట్రాక్ట్ కాల వ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని చెల్లిస్తారు. వీటికి నెలకు రూ.194 చొప్పున టెండర్లను దాఖలు చేశారు. మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా విద్యుత్ ప్రమాదాలు, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయి. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు యథాతథంగా కొనసాగుతుంది. ప్రజల నుంచి ఏ విధమైన ట్రూ అప్ చార్జీలు వసూలు చేయరు. ఉత్తరప్రదేశ్‌లోని మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ మీటరుకు రూ.10 వేలు చొప్పున సింగిల్ ఫేజ్ మీటర్లను మాత్రమే ఏర్పాటు చేస్తోంది. వీటికి ఎటువంటి అనుబంధ పరికరాలూ లేవు. మన రాష్ట్రంలో మొత్తం అన్ని పంపుసెట్లకు త్రీ ఫేజ్ స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో ఒక్కో స్మార్ట్ మీటరుకు ఏడున్నరేళ్ల పాటు నెలకు రూ.200.96గా ధర ఖరారు కాగా వాటిలో 80 శాతం సింగిల్ ఫేజ్వే. ఏపీలో మొత్తం త్రీ ఫేజ్ మీటర్లే. అయినప్పటికీ ఇక్కడ 93 నెలలకు నెలకు రూ.194 మాత్రమే చెల్లిస్తారు. -
విద్యుత్ బిల్లుల మొత్తం నెల ముందే రైతుల ఖాతాల్లో జమ
సాక్షి, అమరావతి: అసత్య కథనాలతో సర్కారుపై బురద చల్లడమే ఈనాడు, పచ్చపత్రికల పనైపోయింది. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఆ పత్రికలు ప్రచురించిన అవాస్తవాలతో కూడిన కథనాలను ఇంధన శాఖ ఖండించింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేసింది. స్మార్ట్ మీటర్ల కారణంగా రైతులపై ఒక్క పైసా భారం పడదని తేటతెల్లం చేసింది. విద్యుత్ బిల్లులు రైతులు ముందుగా చెల్లించాల్సిన అవసరం కూడా లేదని, బిల్లుల మొత్తం నెల ముందుగానే రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపింది. ఆ తర్వాత రైతు ఖాతా నుంచి డిస్కంలకు వెళ్తాయని వెల్లడించింది. ఇందులో రైతులు ముందస్తుగా చెల్లించడం లేదా సొంత డబ్బు చెల్లించడం వంటివి ఉండవని స్పష్టం చేసింది. మొత్తం ఖర్చంతా ప్రభత్వమే భరిస్తుందని తెలిపింది. అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత కూడా వివిధ వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ రాయితీలు యథాతథంగా అమలవుతాయని తెలిపింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వాస్తవాలను వెల్లడించారు. నిజాలను మరుగనపెట్టి పేదలు, రైతుల్లో అపోహలు కలి్పంచేలా కథనాలు ప్రచురించవద్దని ఆ పత్రికలను హెచ్చరించారు. అంశాలవారీగా ఆయన వెల్లడించిన వాస్తవాలిలా ఉన్నాయి... ఆరోపణ: ఇకపై నేరుగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందదు వాస్తవం: వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల ఉచిత విద్యుత్ ఉండదని ఎవరూ అపోహ పడాల్సిన పనిలేదు. రానున్న 30 ఏళ్ల పాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలుమార్లు విస్పష్టంగా చెప్పారు. ఆరోపణ: రైతులు ముందుగానే బిల్లులు చెల్లించాలి వాస్తవం: రైతులు ముందస్తుగా బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు. వ్యవసాయానికి విద్యుత్ వినియోగించుకున్నందుకు రైతులు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. దాని నుంచే డిస్కంలకు వెళుతుంది. అంతేకాదు.. ఈ నగదును ప్రభుత్వం ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అందువల్ల రైతులు డిస్కంలకు ముందుగా బిల్లులు చెల్లించాల్సిన అగత్యం ఉండదు. రైతులకు అందించే విద్యుత్ అంతా ఉచితమే. రైతులు జేబు నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారో, అదే విధంగా ఇక మీదట కూడా పొందుతారు. ఉచిత విద్యుత్తుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోపణ: వ్యవసాయ రంగంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తున్న అన్ని వర్గాలకు సంబంధించిన బిల్లులకు ఇకపై ఇదే విధానం అవలంబించాలి వాస్తవం: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు అయ్యే మొత్తంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల మొత్తాన్ని కూడా ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తుంది. ఆయా వర్గాల సబ్సిడీలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఆరోపణ: కేంద్రం చెప్పిన వాటిని అంగీకరిస్తే రాష్ట్రానికి మరో రూ.7 వేల కోట్ల అదనపు అప్పు తీసుకోవడానికి ఆస్కారం లభిస్తుంది వాస్తవం: విద్యుత్ రంగం బలోపేతానికి సంస్కరణలు అమలు చేయాలని రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితమే నిర్ణయం జరిగింది. అప్పటి నుంచి వీటిని దశలవారీగా అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాల ద్వారా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభు త్వం రుణాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఆరోపణ: ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి. వాస్తవం: ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు ఎంత విద్యుత్ వినియోగించుకుంటాయో ఆ మేరకు బిల్లులను అవి చెల్లిస్తాయి. స్థానిక సంస్థలు వాటి నిధులతోనే బిల్లులు చెల్లిస్తాయి. ఆరోపణ: పంపిణీ నష్టాలు తగ్గించుకోవాలి. వాస్తవం: ఇందులో తప్పేముంది? విద్యుత్ వృథాను తగ్గించుకోవద్దా? వృథా చేయాలా? ఏయే రంగాలు ఎంతెంత విద్యుత్ వాడుకుంటున్నాయో కచ్చితమైన లెక్కలు తేలితేనే పంపిణీ నష్టాల లెక్కలు తేలతాయి. సంస్కరణల ద్వారా పంపిణీ నష్టాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెబుతోంది. పంపిణీ నష్టాలను తగ్గించేందుకు డిస్కంలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. పంపిణీ నష్టాలు తగ్గించడమంటే విద్యుత్ వృథాను తగ్గించడమనే అర్థం. ఆరోపణ: విద్యుత్ సరఫరాకు, వస్తున్న ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. వాస్తవం: పంపిణీ నష్టాలను (విద్యుత్ వృ«థా/లైన్ లాసెస్) తగ్గించడం ద్వారా చాలా వరకు ఇది సాధ్యమవుతుంది. ఆదాయ, వ్యయాల మధ్య అంతరం లేకుండా చేయడమంటే నష్టాలు లేకుండా చేయడమే. డిస్కంల లక్ష్యం కూడా ఇదే. ఆరోపణ: ఒకే లబ్దిదారు విద్యుత్ రంగంలో రెండు రకాల సబ్సిడీలు పొందకుండా చూడాలి. వాస్తవం: సబ్సిడీల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నందున దీనివల్ల డిస్కంలపై ఎలాంటి ప్రభావం ఉండదు. సబ్సిడీలు ఎలా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ఆరోపణ: విద్యుత్ రంగంలో ఆర్థిక అంశాలన్నీ పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వాలు ఎంత సబ్సిడీ భరిస్తున్నాయి? డిస్క ంలకు ఎంత బాకీ పడ్డాయనేది స్పష్టంగా వెల్లడించాలన్నవి కేంద్ర ప్రభుత్వ షరతులు వాస్తవం: ఇవి మంచివే కదా. వీటిని అమలు చేయడంలో తప్పేముంది? పూర్తి పారదర్శకంగా ఉంచాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుత ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పక్కాగా సబ్సిడీ మొత్తాలను డిస్కంలకు విడుదల చేస్తోంది. ఆరోపణ: వ్యవసాయ రంగంతోపాటు ఏయే రంగాలు ఎక్కడెక్కడ ఎంతెంత విద్యుత్ వినియోగిస్తున్నాయో మీ టర్ల ద్వారా స్పష్టంగా లెక్కలు తేల్చాలి. మొత్తం విద్యుత్ వినియోగంలో ఎంత శాతానికి మీటర్ల వ్యవస్థ ఏర్పాటైందో కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. ఏయే రంగాలు ఎంతెంత విద్యుత్ వినియోగిస్తున్నాయో స్పష్టమైన లెక్కలు తేల్చాలనే ఉద్దేశంతోనే అన్ని చోట్లా స్మార్ట్ మీటర్లు అమర్చాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నిర్ణయించాయి. ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు మీటరు ఉంటుంది. ఎన్నో ఉపయోగాలు స్మార్ట్ మీటర్లతో అనేక లాభాలు ఉన్నాయని, అందువల్లే వీటి ఏర్పాటుకు అంగీకరించామని విజయానంద్ వివరించారు. ‘ఈ మీటర్లతో ఏ సమయంలో ఎక్కడ ఎంత విద్యుత్ వినియోగం అవుతోందో తెలుస్తుంది. తద్వారా ఎంత లోడ్ అవసరమో కచ్చితమైన లెక్క ఉంటుంది. ఆ మేరకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. లోడ్‌కి సరిపడా ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, సబ్స్టేషన్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయొచ్చు. ఎంత విద్యుత్ అవసరమో అంత సరఫరా కావడం వల్ల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. లోవోల్టేజి, హైవోల్టేజి, ఇతర అంతరాయాలు ఉండవు. మీటర్లు, స్విచ్, ఎర్త్ వైరు వంటి వస్తువులన్నీ నాణ్యమైన వాటినే విద్యుత్ కంపెనీనే అమరుస్తుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలూ ఉండవు. వీటన్నిటి ద్వారా నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందుతుంది. ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో లోపాలున్నా, నాణ్యత లోపించినా వెంటనే సంబంధిత శాఖలను నిలదీసే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యుత్ సంస్థల్లో జవాబుదారీ తనం కూడా మెరుగవుతుంది’ అని వివరించారు. -
Fact Check: రాక్షస రాతలు + రోత కతలు = రామోజీ
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టుల కేటాయింపు మొదలుకుని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు, డిస్కంలకు ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కాంట్రాక్టు ఖరారుతో సహా అన్ని అంశాల్లో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నాయి రాష్ట్ర విద్యుత్ సంస్థలు. కానీ, వైఎస్సార్ జిల్లా సంస్థలుగానీ, ఆ జిల్లా వ్యక్తులుగానీ కాంట్రాక్టులు పొందడం, వ్యాపారం చేయడం తప్పనే విధంగా విషపత్రిక ఈనాడు పిచ్చి రాతలు రాస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో విధంగా బురద జల్లాలనే ఏకైక లక్ష్యంతో అడ్డగోలు కథనాలను అచ్చేస్తోంది. తాజాగా.. ‘జగన్ + విశ్వేశ్వరరెడ్డి = 92 వేల కోట్లు’ శీర్షికతో కుట్రపూరిత కథనాన్ని శనివారం ప్రచురించింది. ఇలాగైతే.. రామోజీ + చంద్రబాబు = 6లక్షల కోట్లు అనొచ్చు కదా? అలాగే, రామోజీ ఆస్తులు చంద్రబాబువి.. చంద్రబాబు ఆస్తులు రామోజీవి అయిపోతాయా? అసలు ఈనాడు కథనంలో పేర్కొన్నట్లు ఎక్కడా ఆశ్రిత పక్షపాతానికి చోటివ్వలేదని, అన్ని ప్రక్రియల్లో పకడ్బందీగా నిబంధలను పాటించామని ఇంధన శాఖ, డిస్కంల తరఫున ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె. పద్మాజనార్ధనరెడ్డి స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే ఉద్దేశంతో పదే పదే ఈనాడు ఇలాంటి అసత్య కథనాలు రాస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, నెడ్‌క్యాప్, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ద్వారా ఆయన వెల్లడించిన వాస్తవాలిలా ఉన్నాయి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సంస్థలు దక్కించుకున్న సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఆరోపణ : ‘షిర్డీ సాయి’ చెప్పిందే వేదం. ఏం కావాలన్నా ఆ సంస్థ తెచ్చుకుంటోంది. వాస్తవం : ఏదైనా సంస్థ పూర్తి అర్హతలతో పారదర్శకంగా నిబంధనల ప్రకారం కాంట్రాక్టులు, ప్రాజెక్టులు పొందితే అది చెప్పిందే వేదంగా నడుస్తోందనడం ఏ విధంగా సబబు? వ్యవసాయ మీటర్లకు స్మార్ట్ మీటర్లు, విడిభాగాల అమరిక, తొమ్మిదేళ్ల నిర్వహణ కాంట్రాక్టును నిబంధనల ప్రకారమే షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, దాని అనుబంధ సంస్థ (విక్రాన్ మహారాష్ట్ర) కైవసం చేసుకున్నాయి. ఆరోపణ : షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ చిన్న సంస్థ. అయినా దానికే అన్ని పనులు.. వాస్తవం : స్థానికంగా ఉన్న షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్, బీఎస్ఆర్ ట్రాన్స్ఫార్మర్స్ అనే మూడు సంస్థలే కాకుండా హైదరాబాద్‌కు చెందిన తొషిబా ఎలక్ట్రికల్స్, ట్రాన్స్కామ్, కన్యకాపరమేశ్వరీ, హైపవర్ అని మొత్తం రెండు రాష్ట్రాల్లో ఏడు కంపెనీలు డిస్కంలకు ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేస్తున్నాయి. వీటిలో షిర్డీసాయి ట్రాన్స్ఫార్మర్ల రంగంలో ప్రముఖ సంస్థ అనే విషయం కాదనలేని సత్యం. ఆరోపణ : చిన్న కంపెనీల వైండింగ్ వైరు యజమానులకు పనిలేక హైదరాబాద్‌కు తరలిపోతున్నారు.. వాస్తవం : డిస్కంల సామర్థ్యం పెరగడంతో దొంగతనాలవల్ల కాపర్ ట్రాన్స్ఫార్మర్లకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గింది. దీంతో కాపర్ వైండింగ్‌తో పనిలేదు. దీనికి షిర్డీసాయికి, డిస్కంలకు లింకేంటి? ఆరోపణ : ట్రాన్స్ఫార్మర్పై రూ.69 వేల నుంచి రూ.75 వేల అదనపు బాదుడు.. వాస్తవం : ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై రూ.69 వేల నుంచి రూ.75 వేలు అదనపుభారం అనేది పూర్తిగా అసత్యం. క్షేత్రస్థాయి అవసరాలను బట్టి డిస్కంలు టెండర్ల ద్వారా పారదర్శకంగా ట్రాన్స్ఫార్మర్లను కొంటున్నాయి. ఐదేళ్ల నిర్వహణ బాధ్యతలను కూడా సరఫరా సంస్థకే అప్పగిస్తున్నాయి. దక్షిణ హరియాణ బిజిలీ వితరణ్ నిగమ్ లిమిటెడ్ రూ.70,967లు, ఉత్తర హరియాణా బిజిలీ వితరణ్ నిగమ్ లిమిటెడ్ రూ.65,010 ధరతో ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేస్తున్నాయి. ఇదే రకమైన ట్రాన్స్ఫార్మర్లను ఏపీసీపీడీసీఎల్ అన్ని ఖర్చులతో కలిపి రూ.64,300 ధరతో కొనుగోలు చేస్తోంది. అంటే భారం తగ్గినట్లేగానీ పెరిగినట్లు కాదు కదా. ఆరోపణ : రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే కాంట్రాక్టును కనీవినీ ఎరుగని ధరకు షిర్డీసాయికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పెద్ద కథే నడిపినట్లు తెలిసింది.. వాస్తవం : దేశంలో వ్యవసాయ మీటర్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే తొలి ప్రాజెక్టు మనదే. అందువల్ల ఎక్కువ ధరలు అనడానికి వీల్లేదు. ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా సాగింది. ఏ సంస్థ అయినా బిడ్లలో పాల్గొనేలానే నిబంధనలున్నాయి. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ఎల్–1గా నిలిచి టెండరు దక్కించుకుంది. అనుబంధ పరికరాల అమరిక కాంట్రాక్టును టెండరు, రివర్స్ టెండర్ ద్వారానే ‘విక్రాన్’ కంపెనీ దక్కించుకుంది. దీనిలో ఎక్కడా దాపరికంలేదు. ఆరోపణ : ముఖ్యమంత్రి దగ్గరవారికి చెందిన సంస్థ అయినందున షిర్డీసాయి, అనుబంధ సంస్థలకు ఆశ్రిత పక్షపాతంతో కీలక ప్రాజెక్టులు ఇచ్చారు. వాస్తవం : సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులన్నీ పూర్తి చట్టబద్ధంగా, విధివిధానాల ప్రకారమే జరిగాయి. ప్రభుత్వం రూపొందించిన పాలసీ ప్రకారం ప్రైవేటు సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా సర్కారు పలు ప్రాజెక్టులను మంజూరు రేసింది. ఎన్‌హెచ్‌పీసీ, ఎన్టీపీసీలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం మర్చిపోయారా? ఆరోపణ : నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర ఇండోసోల్ సంస్థ సౌర విద్యుత్ ప్యానళ్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు 5,147 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇది కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ప్రాజెక్టే అయినా భూమి సమకూర్చడం, రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారం ప్రోత్సాహకాలు ఇవ్వడం లాంటివి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వాస్తవం : షిర్డీసాయి చిన్నసంస్థ కాదని, కేంద్ర ప్రభుత్వమే గుర్తించిన పెద్ద సంస్థ అనడానికి ఇది నిదర్శనం. రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారమే ప్రభుత్వం భూమి సమకూర్చనుంది. ఇందులో తప్పేంటి? ఆరోపణ : ఏడాది కాలంలో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు జగన్ సర్కారు కట్టబెట్టిన కాంట్రాక్టులు, ప్రాజెక్టుల విలువ అక్షరాలా రూ.92 వేల కోట్లు.. వాస్తవం : డిస్కంలు నిర్వహించిన పారదర్శక టెండర్ విధానంలో పాల్గొని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ కాంట్రాక్టులు దక్కించుకుంటే తప్పెలా అవుతుంది. దీనికీ, జగన్ సర్కారుకు లింకేమిటి? ఆరోపణ : వైకాపా అధికారంలోకి వచ్చేవరకూ షిర్డీసాయి కేవలం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ మాత్రమే. మరిప్పుడు దీని మాటే వేదం.. వాస్తవం : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ రంగంలో 25 ఏళ్లుగా ఉన్న సంస్థ ఆ అనుభవంతో మరో రంగంలోకి ప్రవేశించకూడదా? అలాగైతే ఈనాడు అధినేత రామోజీ వివిధ రంగాల్లోకి ఎలా వెళ్లారు? అదీ తప్పేగా? ఆరోపణ : సీఎం జగన్‌కు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యజమాని సన్నిహితుడు, ఒకే జిల్లా వాసి కావడంవల్ల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఎక్కువ ఆయన సంస్థే కైవసం చేసుకుంటోంది.. వాస్తవం : ఇరవై ఐదేళుŠాల్గ విశ్వేశ్వరరెడ్డి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ను అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చారు. అర్హతలు, టెండర్ల ద్వారా ప్రాజెక్టులు పొందుతున్నారు. దీనికీ, జగన్‌కు సంబంధం ఏమిటి? వైఎస్సార్ జిల్లా వాసి అయితే టెండర్లలో పాల్గొనకూడదనా ఈనాడు ఉద్దేశ్యం? ఆరోపణ : కడపలో 49.8 ఎకరాలను కేవలం రూ.42.48 కోట్లకే షిర్డీసాయి సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. దీనివిలువ ఇప్పుడు రూ.150 కోట్లు.. వాస్తవం : పరిశ్రమల స్థాపన కోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా ప్రభుత్వం భూములు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే షిర్డీసాయి సంస్థకు భూమిని కేటాయించడం తప్పెలా అవుతుంది? కేటాయించినప్పటితో పోలిస్తే ఇప్పుడు ధర పెరిగి ఉండవచ్చు. పైగా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాస్తవ ధర కంటే తక్కువ రేటుకే భూములు కేటాయిస్తోంది. ఇందులో ఈ సంస్థ పట్ల చూపిన ప్రత్యేక ప్రేమ ఏమీలేదు. అంతా పాలసీ ప్రకారమే.. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ 2020 జూలై 17న ‘ఏపీ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020’ పేరిట జీఓంఎస్ నంబరు–20ను జారీచేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో 33,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి హైడ్రోపవర్ ప్రాజెక్టుల (పీఎస్పీ) ఏర్పాటుకోసం 29 అనువైన ప్రాంతాలను ‘నెడ్‌క్యాప్’ గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై నివేదికలు (టెక్నో కమర్షియల్ ఫీజిబులిటీ రిపోర్టులు) తయారుచేసింది. దీని ప్రకారం.. ఆసక్తిగల ప్రైవేటు సంస్థలేవైనా ‘నెడ్‌క్యాప్’ను సంప్రదిస్తే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. ఇదే విధానంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 3,500 మెగావాట్ల సోలార్ పవర్, 1,500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు పొందింది. ఇలాగే నెడ్‌క్యాప్ సంస్థకు దరఖాస్తు చేసుకుని మరికొన్ని సంస్థలు కూడా ఇలాంటి ప్రాజెక్టులను మంజూరు చేయించుకున్నాయి. అలాగే, ఏపీ పంప్డ్ స్టోరేజీ పవర్ పాలసీ–2022ని ప్రకటించి అనువైన ప్రదేశాల్లో ప్రైవేట్ సంస్థలకు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. ఈ పాలసీలో భాగంగానే ఇండోసోల్ సోలార్ సంస్థకు వైఎస్సార్ జిలాŠల్ పైడిపాలెం వద్ద 2,200 మెగావాట్ల సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు మంంజూరైంది. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కూడా వైఎస్సార్ జిల్లా సోమశిల వద్ద 2,100 మెగావాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని యర్రవరం వద్ద 1,200 మెగావాట్ల పీఎస్పీలు మంజూరయ్యాయి. రాష్ట్రపతి అవార్డు అందుకున్న సంస్థకు ఇస్తే ఈర్ష్య ఎందుకు? మూడు డిస్కంల పరిధిలో 18.58 లక్షల వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు షిర్డీసాయి సంస్థ టెండర్ల ద్వారా కైవసం చేసుకుంటే ఏదో అన్యాయం జరిగినట్లు ‘ఈనాడు’ గుండెలు బాదుకుంటోంది. రూ.6,888 కోట్ల కాంట్రాక్టు షిర్డీసాయికే కట్టబెట్టడం వెనుక పెద్దకథ నడిచిందని ఆరోపించింది. షిర్డీసాయి చిన్న సంస్థ అన్నట్లు ‘ఈనాడు’ పేర్కొంది. అయితే షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అనేది చిన్న సంస్థ ఏమీకాదు. ఈ సంస్థ 25 ఏళ్లుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తయారుచేస్తూ అత్యధిక అనుభవం, సామర్థ్యం గలదిగా ప్రసిద్ధి చెందింది. ట్రాన్స్ఫార్మర్ల తయారీలో ఈ సంçస్థ 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు కూడా పొందింది. – జె. పద్మాజనార్థనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్. -
Fact Check: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది చంద్రబాబు కాదు కాబట్టి.. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిలోనూ రామోజీరావుకు చెడే కనిపిస్తుంది. పనిగట్టుకుని ప్రతి పథకాన్ని, ప్రతి పనిని తప్పుపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవాలకు మసి పూసి ‘ఈనాడు’లో నిత్యం తప్పుడు కథనాలు వండివార్చుతున్నారు. రైతాంగం కోసం ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు విప్లవాత్మకమని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతుంటే.. రామోజీకి మాత్రం ‘రామా’ అంటే కూడా బూతు పదంలా వినిపిస్తుండటం దుర్మార్గం. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనినీ తప్పుబట్టడమే పనిగా పెట్టుకుంది ‘ఈనాడు’. తాను మోస్తున్న పచ్చ పార్టీ చేయని మంచిని ఈ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతోంది. ఎన్నిసార్లు వాస్తవాలను కళ్లకు కట్టినట్టు అధికారులు వెల్లడించినా, వాటన్నిటినీ పెడచెవిన పెట్టి గుడ్డి రాతలు రాస్తోంది. తాజాగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు అమర్చనున్న స్మార్ట్ మీటర్లపై ‘షిర్డీ సాయికే.. స్మార్ట్‌గా ఇచ్చేశారు’ శీర్షికతో శనివారం మరో తప్పుడు కథనాన్ని అచ్చేసింది. ఈ మీటర్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అన్ని నిబంధనలకు అనుగుణంగా సాగిందని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు స్పష్టం చేశాయి. శాస్త్ర సాంకేతికతపై అవగాహన లేమితో ఈనాడు రాసిన కథనం వెనుక దాగిన అసలు నిజాలను వెల్లడించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ: ఒక్కో స్మార్ట్ మీటరు వ్యయం రూ.37,072.28 వాస్తవం: ఇంత కన్నా పచ్చి అబద్ధం మరొకటి లేదు. గతంలో కోవిడ్–19 విపత్కర పరిస్థితుల్లో టెండర్ల అంచనాలను రూపొందించారు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల ప్రకారం ఆ టెండర్లను రద్దు చేశారు. ఆ తర్వాత హెచ్చు తగ్గులను పరిశీలించి ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ప్రభుత్వ అనుమతితో గ్లోబల్ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. దేశంలోని ప్రతి గుత్తేదారు పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న అందరిలో ఎల్–1 గా శ్రీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నిలిచింది. టెండర్ ప్రకారం.. ఒక్కో వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.11,188.82 మాత్రమే. పన్నులతో కలిపి రూ.13,334.83 వ్యయంతో మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఆర్ఎస్ఎస్ ద్వారా 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంలకు సమకూరుతుంది. ఆరోపణ : యూపీలో అదాని సంస్థ కోట్ చేసింది రూ.10 వేలే వాస్తవం: ఉత్తరప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ ఒక్కో మీటర్‌కు రూ.10 వేల చొప్పున 75 లక్షల స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణకు అదాని సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం వాస్తవమే. అయితే అవి సింగల్ ఫేజ్ మీటర్లు. వీటి కంటే త్రీ ఫేజ్ మీటర్ ధర రూ.3 వేలు నుంచి రూ.4 వేలు ఎక్కువ. పైగా ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లోని గృహాలకు ఏర్పాటు చేసేవి. పైగా ఎటువంటి అనుబంధ పరికరాలు లేవక్కడ. ఏపీలో అలా కాదు. సుదీర్ఘ విస్తరణ కలిగిన వివిధ ప్రదేశాల్లో ఉన్న మొత్తం అన్ని పంపుసెట్లకు దీర్ఘ కాల మన్నికకు త్రీ ఫేజ్ స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాల (మీటర్ బాక్స్, పీవీసీ వైరు, ఎంసీబీ, ఎర్త్ స్పైక్, కెపాసిటర్)ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాంటప్పుడు ఈ రెండు రేట్లను ఒకే విధంగా ఎలా సరి పోల్చి రాస్తారు రామోజీ? మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల కోసం ఒక్కో మీటరును ఏడున్నరేళ్ల పాటు నెలకు రూ.200.96గా బిడ్ ఖరారైంది. వాటిలో 80 శాతం సింగిల్ ఫేజ్ మీటర్లు. 20 శాతం మాత్రమే త్రీఫేజ్ మీటర్లు వున్నాయి. ఏపీలో మొత్తం త్రీ ఫేజ్ మీటర్లు. అయినప్పటికీ మన రాష్ట్రంలో 93 నెలల కాల వ్యవధికి నెలకు రూ.194 మాత్రమే చెల్లించనున్నారు. ఆరోపణ: అడ్డగోలు వ్యవహారం కాబట్టే సమాచారం బయటకు పొక్కకుండా ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. వాస్తవం: ఈనాడు బాబు గురించి కల కంటూ నిద్రలో జోగుతుంటే సమాచారం ఎలా తెలుస్తుంది? వాస్తవానికి టెండర్ల ప్రక్రియలో ఎటువంటి దాపరికం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాత ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లను ఆహ్వానించారు. అనుబంధ పరికరాల టెండర్లలో షిరిడీ సాయి, జీవీఎస్, విక్రాన్ సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్–1గా నిలిచింది. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల టెండర్లలో షిరిడీ సాయి, అదాని సంస్థలు పాల్గొనగా షిరిడీ సాయి ఎల్–1 గా నిలిచింది. ఈ వివరాలన్నీ సంబంధిత వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. లేదా డిస్కంల వద్ద ఎప్పుడైనా దొరుకుతాయి. ఇందులో మీ నిద్రావస్థ తప్ప ప్రభుత్వ దాపరికం ఏముంది రామోజీ? ఆరోపణ: అనుబంధ పరికరాలు, నిర్వహణకే ఐదు రెట్లకు మించి వెచ్చిస్తున్నారు.. వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్ర వ్యాప్తంగా వున్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్ మీటరుతో పాటు అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, ఎర్త్ స్పైక్, కెపాసిటర్ అమర్చడానికి, అవి పాడైపోకుండా ఉండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయొచ్చు. లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకునే సౌలభ్యం ఉంటుంది. రైతులు, డిస్కంల మధ్య పారదర్శకతను పెంపొందించొచ్చు. అలాంటప్పుడు వాటి కోసం ఖర్చు చేయడంలో తప్పేముంది? రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడం మీకు ఇష్టం లేదా రామోజీ? ఆరోపణ: ఇదో భారీ కుంభకోణం..ఎలా చూసినా ప్రజలపైనే భారం. విచారణ జరిపిస్తే భాగస్వామ్యులంతా జైలుకెళ్లాల్సిందే. వాస్తవం: మీటర్ల ద్వారా మొదటి రీడింగ్ తీసిన తర్వాత కాంట్రాక్టర్‌కు ఒక్కో మీటరుకు కెపెక్స్ కింద రూ.1,800 చొప్పున చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన మొత్తంతో పాటు ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్‌ల కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా 93 నెలల కాంట్రాక్ట్ కాల వ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని చెల్లిస్తారు. వీటికి నెలకు రూ.194 చొప్పున టెండర్లు దాఖలయ్యాయి. తద్వారా ఆర్డీఎస్ఎస్ పథకం కింద 22.50 శాతం గ్రాంటు రూపంలో సమకూరుతుంది. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించడానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకు ప్రభుత్వం బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తుంది. రైతులపై ఎటువంటి భారం మోపడం లేదు. వినియోగదారుల నుంచి ఏ విధమైన ట్రూ అప్ చార్జీలు వసూలు చేయాలనుకోవడం లేదు. అలాంటప్పుడు ప్రజలపై భారం ఎలా పడుతుందో, భారీ కుంభకోణం ఎలా అవుతుందో ఈనాడుకే తెలియాలి. పైగా మరోపార్టీ అధికారంలోకి వచ్చి.. నాయకులను, అధికారులను జైలుకు పంపుతుందని చెప్పడం ఎవరిని భయపెట్టడానికి? ఈ ఉడత బెదిరింపులకు ఇక్కడ ఎవరూ బెదరడానికి సిద్ధంగా లేరు. -
అదిగో పులి.. అంటే, ఇదిగో తోక.. ఈనాడు తీరిదే! ఖరారుకాని టెండర్లపై కట్టుకథ
సాక్షి, అమరావతి: అదిగో పులి.. అంటే, ఇదిగో తోక.. అన్నట్లుంది ఈనాడు తీరు. అసలు టెండర్లే ఖరారు కాని స్మార్ట్ మీటర్లపై అప్పుడే ప్రజలపై భారం మోపేసినట్లు ఇష్టారాజ్యంగా కట్టుకథలు అల్లేస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో దాదాపు 1.96 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులుంటే వాణిజ్య, పరిశ్రమ, ప్రభుత్వ సంస్థలకు, ట్రాన్స్ఫార్మర్లకు, 11 కేవీ ఫీడర్లకు కలిపి 42 లక్షల మీటర్లకు మాత్రమే టెండర్లు పిలిచారు. ఇందులో తొలివిడతలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8,04,864 స్మార్ట్ మీటర్లు, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 9,77,288 స్మార్ట్ మీటర్లు, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 9,85,894 స్మార్ట్ మీటర్లు ఉన్నాయి. అవికూడా ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. కానీ, ఈనాడు మాత్రం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల సర్వీసులన్నింటికీ స్మార్ట్‌మీటర్లు పెట్టి, ప్రతినెలా గృహ వినియోగదారులపై నెలకు రూ.153.40 భారం మోపనున్నారని అదానీ ‘స్మార్ట్’ షాక్ అంటూ అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఈనాడు రాసిన అబద్ధాల వెనుక అసలు నిజాలు ఇవీ.. ఆరోపణ: స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై రూ.29 వేల కోట్ల భారంవేసి, భారీగా బాదేసేందుకు సిద్ధమైంది. వాస్తవం: ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. పదేళ్ల పాటు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు రూ.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అంచనా వేశాయి. అది వదిలేసి రూ.29వేల కోట్లని కాకిలెక్కలతో పచ్చపత్రిక పిచ్చిరాతలు రాసింది. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలలో భాగంగా డిస్కంల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా 2025 నాటికి ప్రతి విద్యుత్ సర్వీసు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లకు స్మార్ట్‌మీటర్స్ అమర్చాలని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలు నిబంధన విధించాయి. ఈ ఆదేశాలను అనుసరించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల డిస్కంలు ఈ పనులు చేపట్టాయి. ఏదో ఏపీ మాత్రమే చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను ఏమార్చే ప్రయత్నమే ఇది. వినియోగదారులపై ఎటువంటి అదనపు భారంలేకుండా స్మార్ట్‌మీటర్ల ఏర్పాటువలన కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే వెసులుబాటు కల్పించింది. దానితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఖరారుచేసిన రేట్లను దృష్టిలో పెట్టుకుని, నోడల్ ఏజెన్సీ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఆమోదం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తీసుకున్న తరువాతే టెండర్లు ఖరారుచేస్తారు. ఈ విషయాన్ని దాచి, టెండరు ఖరారు కాకుండానే ప్రతినెలా రూ.153.40 భారం అని ప్రచురించటం పూర్తిగా అవాస్తవం. ఆరోపణ: టెండర్ల వివరాలను డిస్కంలు అత్యంత రహస్యంగా ఉంచాయి. వాస్తవం : ప్రస్తుత టెండర్లను 42 లక్షల మీటర్లకు మాత్రమే డిస్కంలు పిలిచాయి. ఇందులో వినియోగదారుల మీటర్లతో పాటు ఫీడర్ మీటర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల (డీటీఆర్) మీటర్లు, ఎల్టీ, సీటీ మీటర్లు, సీటీ, పీటీ మీటర్లు ఉన్నాయి. టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపించిన తరువాతే ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా పారదర్శకంగా టెండర్లు పిలిచింది. ఇందులో టెండర్ల వ్యవహారం గుట్టుగా జరిగిందేమీలేదు. ఆరోపణ : ప్రజలపై పడే భారాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం ముందుకెళ్తోంది. వాస్తవం : స్మార్ట్‌మీటర్ల ద్వారా విద్యుత్ కనెక్షన్ల వినియోగం, ఇతర సర్వీస్ వినియోగ వివరాలను ఆన్లైన్ ద్వారా రియల్ టైం డేటాను పొందే సౌలభ్యం ఉంటుంది. అందువల్ల మీటర్ రీడింగ్ లను మనుషుల అవసరం లేకుండా తీసుకోవచ్చు. ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్ వ్యవస్థను పటిష్టవంతం చేయడం ద్వారా విద్యుత్ నష్టాల తగ్గింపు, బిల్ తీసేందుకు అయ్యే ఖర్చులో మిగులు, ముందుస్తు చెల్లింపు వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా మిగిలిన దాని నుంచే గుత్తేదారు సంస్థకు డిస్కం నేరుగా ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు చెల్లిస్తుంది. వినియోగదారులు ఆఫ్ పీక్ సమయాలలో విద్యుత్‌ను ఉపయోగించినప్పుడు అదనపు రాయితీని పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ వినియోగం తెలుసుకుని అవసరమైన మేర రీచార్జ్ చేసుకోవటం ద్వారా పొదుపును పాటించవచ్చు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ప్రతి వినియోగదారునికీ స్మార్ట్‌మీటర్ అమర్చాలని నిబంధనలున్నా, రాష్ట్రంలో మన డిస్కంలు ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐఆర్డీఏ మీటర్ల ద్వారా వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించడంలో దేశంలోనే ఉత్తమంగా ఉండడంతో, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి వాటిని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నుంచి మినహాయించాయి. ఇవన్నీ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసినవే. -
ఇక ‘పీక్’లో షాక్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారిఫ్ విధానంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు సమీప భవిష్యత్తులో అధిక చార్జీలు విధించి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకు రాయితీ అందించాలనుకుంటోంది. ఈ మేరకు ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై వచ్చే నెల 14లోగా అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలను కోరింది. పీక్ టైమ్‌లో మోత మోగనుంది... ఈ నిబంధనలు అమల్లోకి వస్తే డిమాండ్ గరిష్టంగా ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు సంబంధించి వసూలు చేయాల్సిన చార్జీలు ఆయా కేటగిరీల సాధారణ చార్జీల కంటే అధికంగా ఉండనున్నాయి. వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీల వినియోగదారుల నుంచి కనీసం 20 శాతం, వ్యవసాయం మినహా ఇతర అన్ని కేటగిరీల వినియోగదారుల నుంచి కనీసం 10 శాతం అధిక టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించనుంది. ఇక స్మార్ట్‌మీటర్లు తప్పనిసరి... విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లు బిగించిన వెంటనే ఈ మేరకు ‘టైమ్ ఆఫ్ డే’టారిఫ్‌ను వర్తింపజేయాలని కేంద్ర విద్యుత్ శాఖ కోరింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 10 కిలోవాట్లలోపు గరిష్ట డిమాండ్గల పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులకు... 2025 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయం మినహా మిగిలిన కేటగిరీల వినిమోగదారులకు టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను అమలుచేయాలని గడువు విధించింది. ఈ గడువుల్లోగా ఆయా కేటగిరీల వినియోగదారులందరికీ స్మార్ట్‌మీటర్లను తప్పనిసరిగా బిగించాల్సి ఉంది. ప్రస్తుత విధానంలో మార్పు ఏమిటి? సాధారణంగా పగటివేళల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి రాత్రివేళల్లో గణనీయంగా తగ్గిపోతుంది. డిమాండ్ గరిష్టంగా ఉండే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్‌ను ఎనర్జీ ఎక్ఛ్సేంజీల నుంచి అధిక ధరలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు రాత్రివేళల్లో డిమాండ్ లేక విద్యుత్ మిగిలిపోతోంది. దీనికి పరిష్కారంగా రాత్రివేళల్లో డిమాండ్‌ను పెంచి పగటివేళల్లో తగ్గించడం కోసం టైమ్ ఆఫ్ డే విధానాన్ని డిస్కంలు అమలు చేస్తున్నాయి. డిమాండ్ అధికంగా ఉండే ఉదయం 6–10 గంటలు, సాయంత్రం 6–10 గంటల మధ్య కాలంలో వినియోగించిన ప్రతి యూనిట్ విద్యుత్‌కు ‘టైమ్ ఆఫ్ డే టారిఫ్’పేరుతో అదనంగా రూపాయి చార్జీని విధిస్తున్నాయి. డిమాండ్ తక్కువగా ఉండే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య వాడిన ప్రతి యూనిట్ విద్యుత్‌కు ‘టైమ్ ఆఫ్ డే ప్రోత్సాహాకాలు’పేరుతో ఒక రూపాయి రాయితీ అందిస్తున్నాయి. హెచ్‌టీ కేటగిరీలోని–పరిశ్రమలు, పౌల్ట్రీ ఫారాలు, హెచ్‌టీ–2 (బీ) ఇతరత్రా వినియోగదారులు, ప్రార్థనా స్థలాలు, ఎయిర్‌పోర్టులు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. తాజా ముసాయిదా నిబంధనలు అమల్లోకి వస్తే నిర్దేశిత గడువులోగా వ్యవసాయం మినహా మిగిలిన అన్ని కేటగిరీల వినియోగదారులకు టైమ్ ఆఫ్ డే టారిఫ్, రాయితీ విధానం అమల్లోకి వస్తుంది. పీక్ డిమాండ్ ఎన్ని గంటలు? సూర్యరశ్మి ఉండే వేళల (సోలార్ హవర్స్)కు సంబంధించిన టారిఫ్.. ఆయా కేటగిరీల వినియోగదారుల సాధారణ టారిఫ్‌తో పోలిస్తే 20 శాతం తక్కువగా ఉండాలి. రోజులో విద్యుత్ డిమాండ్ ఎన్ని గంటలపాటు గరిష్టంగా ఉంటుందనే విషయాన్ని ఈఆర్సీ/ఎస్డీఎల్సీలు ప్రకటిస్తాయి. దీని ఆధారంగా టైమ్ ఆఫ్ డే టారిఫ్‌ను ఖరారు చేస్తాయి. అయితే సూర్యుడు ఉండే వ్యవధికన్నా పీక్ డిమాండ్ గంటల నిడివి ఎక్కువ ఉండరాదు. అన్ని కేటగిరీల వినియోగదారులకు సంబంధించిన టారిఫ్‌ను డిస్కంల వెబ్సైట్లో పొందుపరచాలి. ఇంధన సర్దుబాటు సర్‌చార్జీ, ఇతర చార్జీల విధింపుతో టారిఫ్‌లో జరిగే మార్పులను కనీసం నెల రోజుల ముందే వెబ్సైట్లో పొందుపరచడంతోపాటు విద్యుత్ బిల్లు/ఎస్ఎంఎస్/మొబైల్ యాప్ ద్వారా తెలియజేయాలి. స్మార్ట్ మీటర్లతో పెరగనున్న లోడ్ స్మార్ట్ మీటర్లను బిగించాక నమోదైన గరిష్ట లోడ్ ఆధారంగా అంతకుముందు కాలం నాటి విద్యుత్ వినియోగంపై జరిమానాలు విధించడానికి వీలు లేదు. కనెక్షన్ సాంక్షన్డ్ లోడ్ కన్నా అధిక లోడ్‌తో విద్యుత్ వినియోగించినట్టు రికార్డు అయితే, దాని ఆధారంగానే ఆ నెలలో బిల్లులను జారీ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆ సంవత్సరంలో నమోదైన మూడు గరిష్ట లోడ్ సామర్థ్యాల్లో అతి తక్కువ లోడ్‌ను ప్రామాణికంగా తీసుకుని సాంక్షన్డ్ లోడ్‌ను సవరించాల్సి ఉంటుంది. -
‘స్మార్ట్ మీటర్లపై టీడీపీ, కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లకు గానూ 18.57 లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... 1)స్మార్ట్ మీటర్లు కొనుగోలు, ఇన్స్టలేషన్, నిర్వహణ కోసం మొత్తం రూ. 3,406.14 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అలాగే మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, రక్షణ అనుబంధ పరికరాల కోసం 2286.22 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేయడం జరిగింది. 5692.36 కోట్లు ఆయా సంవత్సరాల బడ్జెట్ లలో కేటాయించడం ద్వారా దీనిని ప్రభుత్వం భరిస్తోంది. 2) కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం లిమిట్ పెంచడానికి పెట్టిన కండీషన్ కోసం రైతులకు ఇచ్చే విద్యుత్ కు మీటర్లు పెట్టామని తెలుగుదేశం సభ్యులు ఆరోపించడం భావ్యం కాదు. రైతులందరికి మేలు చేసేలా వారు వినియోగించిన విద్యుత్ బిల్లులను డిబిటి ద్వారా డబ్బులు వారి ఖాతాలకు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం స్మార్ట్ మీటర్లు భిగించడం ద్వారా ఏ రైతు ఎంతమేర విద్యుత్ ను వినియోగిస్తున్నాడనే లెక్కలు తేల్చడం కోసమే పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం జిల్లాలో దీనిని ప్రారంభించాము. అక్కడ డిఆర్బిఎ మీటర్లు పెట్టాం. 1.9.2020, జిఓ నెం. 22 ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 18వేల ఉచిత వ్యవసాయ కనెక్షన్లు ఉండటం వల్ల అందుబాటులో ఉన్న ఐఆర్‌డిఎ మీటర్లు, అనుబంధ సామగ్రితో ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేశాం. 3) శ్రీకాకుళం జిల్లాల్లో 2021 ఆర్థిక సంవత్సరంలో ఉచిత విద్యుత్ కోసం వినియోగించిన విద్యుత్ 101.5 మిలియన్ యూనిట్లు ఉంటే మీటర్లు ఏర్పాటు వల్ల 67.76 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగినట్లు తేలింది. అంటే ఏడాదికి 33.75 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే పైలెట్ ప్రాజెక్ట్ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 2022 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వినియోగదారుల సంఖ్య పెరిగిప్పటికీ విద్యుత్ వినియోగం మాత్రం 33% తగ్గింది. 4) ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఉచిత వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు పెట్టలేదు. డొమెస్టిక్ మాటర్లు మాత్రమే పెట్టారు. ప్రతిచోటా మనకంటే రెట్టింపు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల కోసం 2021లో 6480.12 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవడం జరిగింది. అప్పటి రేట్ల ప్రకారం అధిక వ్యయం అవుతుండటంతో సదరు టెండర్లను రద్దు చేయడం జరిగింది. కరోనా పాండమిక్ తరువాత రేట్లు కొంత మేర తగ్గడంతో తిరిగి 2022లో అప్పటి రేట్ల ప్రకారం రూ.5692.35 కోట్లతో సవరించిన అంచనాలతో టెండర్లు పిలిచాం.టెండర్ ఫైనాన్షియల్ బిడ్ ప్రాసెస్ లో ఉంది. దీనిని ఎవరికో ఇచ్చేశామని, మాకు కావాల్సిన వారికి కట్టబెట్టామనే విధంగా మాట్లాడటం కూడా సరికాదు. 5) తెలుగుదేశం సభ్యులు మాట్లాడుతూ ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ ప్రభుత్వంకు రాసిన లేఖలో స్మార్ట్ మీటర్లు అవసరం లేదని పేర్కొన్నట్లుగా సభలో మాట్లాడారు. అది వాస్తవం కాదు. మీటర్ల ఏర్పాటుపై అన్ని రకాల మీటర్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో రాశారు. దీనిని వక్రీకరించి మాట్లాడటం దురదృష్టకరం. 6) చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పై ఎం మాట్లాడారో అందరికీ తెలుసు. ఉచిత విద్యుత్ ఇచ్చే తీగెలపై దుస్తులు ఆరేసుకోవాలని ఆయన మాట్లాడలేదా? వ్యవసాయం దండగ అని అనలేదా? ఈ ప్రభుత్వం రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను వ్యవసాయం కోసం ఉచితంగా అందిస్తోంది. తెలుగుదేశం హయాంలో అర్థరాత్రి ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల ఎంత మంది రైతులు చీకట్లో పాము కాటుకు గురయ్యారు, ఎంత మంది విద్యుత్ షాక్ తో మృతి చెందారో తెలుగుదేశం సభ్యులు లెక్కలు చెప్పాలి. ఇప్పుడు వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు భిగించాలనే నిర్ణయం కోసం వాస్తవంగా ఉచిత వ్యవసాయ కనెక్షన్ల ద్వారా ఎంత వినియోగం అవుతుందో తెలుసుకునేందుకే. రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకే. ఇది కూడా కేంద్రప్రభుత్వం, సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే స్మార్ట్ మీటర్లను అమరుస్తున్నాం. దీనిపై టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డిబిటి కోసం స్వచ్ఛందంగా బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 10,025 మంది రైతులు మినహా మిగిలిన రైతులంతా ఖాతాలను తెరిచారు అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
ఆదా.. ఇదిగో
సాక్షి, అమరావతి: ‘‘శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లను అమర్చడం, నెలవారీ రీడింగ్‌లు నమోదు చేయడం అభినందనీయం. వ్యవసాయ విద్యుత్ మీటరింగ్ కోసం విలువైన పాఠాలను అందించేలా ఈ ప్రయోగం చేపట్టిన డిస్కమ్‌లు, సంబంధిత విభాగాలను అభినందించాల్సిన అవసరం ఉంది’’ – తుది నివేదికలో ప్రయాస్ సంస్థ ప్రశంసలివీ.. వ్యవసాయ బోర్లకు స్మార్ట్ విద్యుత్ మీటర్లను అమర్చడం వల్ల రైతులకు మేలేగానీ కీడు జరగదు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేసినా కొన్ని పార్టీలు, వాటి అనుకూల మీడియా పని గట్టుకుని విషప్రచారం చేస్తూనే ఉన్నాయి. అన్నదాతలను అయోమయంలోకి నెట్టేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల వల్ల ఏ మీటర్లో ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోందనేది ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తెలుస్తుంది. అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, ఫీడర్ల వద్ద మీటర్లు పెట్టి రీడింగ్ తీస్తే వాటి పరిధిలోని నాలుగైదు మీటర్ల విద్యుత్ వినియోగం వస్తుంది. ఏ రైతు ఎంత విద్యుత్ వాడుతున్నారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. పంటలు ఉన్నప్పుడు మీటర్ల దగ్గరికి వెళ్లడం చాలా కష్టం. అదే స్మార్ట్ మీటర్లతో ఈ సమస్యలన్నీ తీరుతాయి. రిమోట్ ద్వారా మీటర్‌ను ఆపరేట్ చేయవచ్చు. రీడింగ్ కోసం మీటర్ దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు. రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మీటర్ అమర్చడమే కాకుండా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్, మోటార్ కాలిపోకుండా, రైతుల ప్రాణ సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. అందుకు అవసరమైన ఐదు రక్షణ పరికరాలను (అలైడ్ మెటీరియల్) మీటర్లతో పాటు ఏర్పాటు చేయనుంది. మిగతా రాష్ట్రాల్లో కేవలం మీటర్లే ఇస్తున్నారు. మన దగ్గర స్మార్ట్ మీటర్‌తో పాటు మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్(ఎంసీసీబీ)తో కూడిన షీట్ మౌడ్లింగ్ కాంపొనెంట్(ఎస్ఎంసీ) బాక్స్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యూజు కారియర్లు ఇనుముతో చేసినవి ఉండగా వాటి స్థానంలో తాకినా విద్యుత్ షాక్ కొట్టని మెటీరియల్‌తో ఈ బాక్సులు తయారవుతాయి. ఇప్పుడున్నట్లు మూడు ఫ్యూజులు కూడా ఉండవు. దానివల్ల మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదు. అలాగే ఎర్తింగ్ పైప్ కూడా ఇస్తారు. ఓల్టేజ్ సమస్యల నుంచి కాపాడేందుకు షంట్ కెపాసిటర్లను అమర్చుతారు. ఈ ఏర్పాటు వల్ల విద్యుత్ ప్రమాదాల నుంచి రైతులకు, జీవాలకు, వాతావరణ పరిస్థితుల నుంచి స్మార్ట్ మీటర్లకు రక్షణ లభిస్తుంది. అలైడ్ మెటీరియల్, మీటర్లకు కలిపి ప్రభుత్వం రూ.4,000 కోట్లు భరిస్తోంది. ఎవరు చెప్పారు? వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారంతో అబద్ధాలను అడ్డంగా అచ్చేసిన ఈనాడు రాతలను ఇంధన శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని, వాటివల్ల విద్యుత్ ఆదా జరగకపోగా ఖర్చు వృథా అని ఏ సంస్థగానీ, రైతులుగానీ చెప్పలేదని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, సెంట్రల్ డిస్కమ్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డితో కలసి విజయవాడలోని విద్యుత్ సౌధలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ► మీటర్లు అమర్చడం ద్వారా డిస్కమ్‌లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్ హక్కుగా లభిస్తుంది. ‘ప్రయాస్’ సంస్థ ఏడాదిన్నర క్రితం జరిపిన శాంపుల్ అధ్యయనంలో పలు సూచనలు మాత్రమే చేసింది. సగటు విద్యుత్ కొనుగోలు ధరను ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ ఒక యూనిట్‌కి రూ.4.20 చొప్పున తీసుకుని లెక్కించడం వల్లే గణాంకాలు సరిగా లేవు. వాస్తవానికి సగటు సరఫరా ఖర్చు ఒక యూనిట్‌కి రూ.6.98 చొప్పున ఉంది. దీన్ని ఏపీఈఆర్సీ నిర్ణయించింది. ► ఫీడర్ల వద్ద నష్టాలు నమోదవుతున్నట్లు ప్రయాస్ చెబుతున్నా స్మార్ట్ మీటర్లు అమర్చిన తరువాత ఫీడర్ రీడింగ్ తీయలేదు. ఆ నష్టం విద్యుత్ చౌర్యం వల్ల జరిగి ఉండవచ్చు. ఇలాంటివి అరికట్టేందుకే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ► రెండు, మూడు వారాల్లో స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. రైతులను గందరగోళానికి గురిచేస్తూ పదేపదే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలు, ప్రసారం చేస్తున్న ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాటి యాజమాన్యాలకు లీగల్ నోటీసులు కూడా పంపుతున్నాం. ► మొత్తం 16,66,282 వ్యవసాయ సర్వీసుల్లో 16,55,988 మంది రైతులు బ్యాంకు ఖాతాలు తెరిచి నిరభ్యంతర పత్రాలిచ్చారు. 10,294 మందికి మాత్రమే ఖాతాలు లేవు. వారితో కూడా తెరిపించేందుకు డిస్కమ్‌లు ప్రయత్నిస్తున్నాయి. శ్రీకాకుళంలో ఇలా.. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా 2023 ఫిబ్రవరి నాటికి 29,302 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చగా 83.16 శాతం పని చేస్తున్నాయి. ఈ మీటర్ల ద్వారా 2021–22లో 33.24 శాతం అంటే 2.81 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అయ్యింది. సగటున 6.66 శాతం మాత్రమే పాడవడం, కాలిపోవడం జరిగింది. భవిష్యత్తులో వాటి మరమ్మతుల ఖర్చు సరఫరా సంస్థ భరించేలా టెండర్లు రూపొందించారు. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెడితే కేవలం రెండున్నరేళ్లలోనే పెట్టుబడి వెనక్కి వస్తుంది. -
స్మార్ట్ మీటర్లపై అపోహలు సృష్టించొద్దు: విజయానంద్
సాక్షి, విజయవాడ: స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించొద్దని ఏపీ ఎనర్జీ స్పెషల్ సీఎస్ విజయానంద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘వ్యవసాయంలో విద్యుత్ వినియోగం స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుస్తుంది. స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ మీటర్లని ఏర్పాటు చేస్తున్నాం. మంచి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు పది సంవత్సరాల క్రితం టెక్నాలజీని ఇపుడు ఎలా వాడతాం’’అని విజయానంద్ ప్రశ్నించారు. వాస్తవిక దృక్పథంతో పరిశీలించిన తర్వాతే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ రంగంతో పాటు గృహావసరాలకి, పరిశ్రమలకి కూడా స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలకి అనుగుణంగా 2025 లోపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ వినియోగంపై స్మార్ట్ మీటర్ల ద్వారా దాదాపు కచ్చిత సమాచారం లభిస్తుంది. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులపై భారం ఉండదు’ అని విజయానంద్ స్పష్టం చేశారు. ‘‘రైతు అకౌంట్లలోనే వారి సబ్సిడీ నేరుగా వేస్తాం. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారిలో 11.95 లక్షల మంది రైతులు సార్ట్ మీటర్లకి అంగీకరించారు. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారిలో దాదాపు 99 శాతం స్మార్ట్ మీటర్లకి మద్దతు తెలిపారు. ఫిబ్రవరి నాటికి శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్ట్ లో 83.16 శాతం స్మార్ట్ మీటర్లు పనిచేస్తున్నాయి. దాదాపు 50 శాతం మీటర్లు పనిచేయడం లేదనేది వాస్తవం కాదు’’ అని అన్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. ‘‘స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ చాలా పారదర్శకంగా చేస్తున్నాం. తప్పుడు వార్తలు పదే పదే రాస్తే లీగల్ గా చర్యలు తీసుకుంటాం. స్మార్ట్ మీటర్ల టెండర్లపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. ప్రయాస్ రిపోర్ట్ వృధా.. తప్పు అని అనలేదు. సగటు విద్యుత్ ధర, కొనుగోలు ధరలని లెక్క వేయడంలో పొరపాట్లు వచ్చాయి. యూనిట్ రేట్లో వ్యత్యాసం వేయడం వలనే వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 25 వేల నుంచి 30 వేల మీటర్లని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని పరిశీలన చేశాం. ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత మిగిలి జిల్లాలలో మళ్లీ పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు?. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలియాల్సిన అవసరం ఉంది’’ అని విజయానంద్ అన్నారు. -
స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు
తిరుపతి రూరల్: వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం 18వ రాష్ట్రస్థాయి సలహామండలి(ఎస్ఏసీ) సమావేశం జరిగింది. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా చెబుతోందని తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని, రైతుల నుంచి ఎటువంటి చార్జీలను వసూలు చేయడం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినట్లు చెప్పారు. రానున్న 30ఏళ్ల పాటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ‘సెకీ’ ద్వారా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహించామని, రాష్ట్రవ్యాప్తంగా 75 కేంద్రాల నుంచి వినియోగదారులు తమ సూచనలు, సలహాలను తెలియజేశారని వివరించారు. డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
స్మార్ట్ గా పచ్చ మీడియా అబద్ధాలు
-
AP: స్మార్ట్ మీటర్లపై ఇంధన శాఖకు అభ్యంతరం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఇంధన శాఖకు అభ్యంతరం లేదని, నిజానికి తామే ముందుండి ఈ ప్రాజెక్టును నడిపిస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టంచేశారు. కొన్ని నెలల క్రితం ఆర్థిక శాఖ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాలని తాను డిస్కంలకు అంతర్గతంగా రాసిన లేఖలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని, ఆ లేఖలు పూర్తిగా చదివితే వాస్తవాలు బోధపడతాయని తెలిపారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోనూ స్మార్ట్ మీటర్లు అమర్చాలని కేంద్రం నిర్ణయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. ఇప్పటికే 15 రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు మొదలైందని చెప్పారు. రాష్ట్రంలో తొలి దశలో 18.57 లక్షల వ్యవసాయ, 27.54 లక్షల వ్యవసాయేతర (నెలకు 200 యూనిట్లుపైన విద్యుత్ వినియోగం ఉన్నవి) సర్వీసులకు ఈ మీటర్లు అమర్చనున్నట్లు తెలిపారు. వ్యవసాయేతర సర్వీసుల్లో 4.72 లక్షలు మాత్రమే గృహ సర్వీసులని, అవి కూడా అమృత్ నగరాలు, జిల్లా కేంద్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. రెండో విడతలో 13.54 లక్షల సర్వీసులకు అమర్చాలని అనుకుంటున్నప్పటికీ, వాటికి ఇంతవరకు టెండర్లు పిలవలేదన్నారు. తొలి దశ ఫలితాలను బట్టి మిగతా వారికి మీటర్లు అందిస్తామన్నారు. కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పుడల్లా విద్యుత్ మీటర్లను మారుస్తున్నామని, దానికి వినియోగదారుల నుంచి చార్జీలు తీసుకోవడం కూడా సర్వసాధారణంగా జరిగేదేనని తెలిపారు. కానీ ఇప్పుడే కొత్తగా స్మార్ట్ మీటర్ల భారం వినియోగదారుల మీద వేస్తున్నట్లు, మీటర్లతో బిల్లులు పెరుగుతాయంటూ అసత్య ప్రచారం చేయడం తగదని, ప్రజలపై ఆర్థిక భారం పడదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ, గృహ విద్యుత్ సర్వీసులు కలిపి ఉన్న ఫీడర్లు, ఓవర్‌లోడ్ అయిన ట్రా న్స్‌ఫార్మర్లలో తొలి విడతగా 9 వేలను తొమ్మిది నెలల్లో మార్చి, ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. దీనివ్ల నష్టాలు తగ్గుతాయన్నారు. ఈ పనులకు, స్మార్ట్ మీటర్లకు కలిపి రూ.13,252 కోట్లు ఖర్చవుతుందని, అందులో మీటర్లకు 22 శాతం, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల పనులకు 60 శాతం.. మొత్తం రూ.5,484 కోట్లను కేంద్రం గ్రాంట్‌గా ఇస్తుందని వెల్లడించారు. పాడైన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరు గుతున్నాయన్నారు. ఇకపై విద్యుత్ ప్రమాదాలు జరగకూడదని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పారు కేంద్రం రూపొందించిన బిడ్ డాక్యుమెంట్‌తోనే టెండర్లు కేంద్రం రూపొందించిన ‘స్టాండర్డ్ టెండర్ బిడ్ డాక్యుమెంట్’నే స్మార్ట్ మీటర్ల టెండర్లలో అనుసరిస్తున్నామని విజయానంద్ చెప్పారు. దానిలో ఒక్క అక్షరం మార్చేందుకు తమకు అధికారం లేదన్నారు. టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు కూడా పంపించాకే టెండర్లు పిలిచామన్నారు. ఏ ఒక్కరికో, ఏ ఒక్క సంస్థకో ప్రయోజనం చేకూర్చేలా టెండర్ నిబంధనలు మార్చడం అసాధ్యమని గుర్తించాలన్నారు. బహిరంగ పోటీ ద్వారా అన్ని అర్హతలు ఉన్న సంస్థకే టెండర్లు ఇస్తామని, ఎలాంటి అపోహలకూ తావు లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీట్రాన్స్కో సీఎండీ బి. శ్రీధర్, జేఎండీలు ఐ. పృధ్వితేజ్, బి.మల్లారెడ్డి, సెంట్రల్ డిస్కం సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
‘స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు.. అది తప్పుడు ప్రచారం’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ పంపిణీలో అత్యాధునిక విధానాలు ప్రవేశపెడుతున్నామన్నారు. స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐఆర్డీఏ మీటర్లకు, స్మార్ట్ మీటర్లకు వ్యత్యాసం ఉండదన్నారు. మారుతున్న సాంకేతికని ఇంధనశాఖ అంది పుచ్చుకుంటోందని విజయానంద్ అన్నారు. ‘‘ట్రాన్స్‌కోలో ప్రతీ జిల్లాలో 400 కేవీ సబ్ స్టేషన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాం. వినియోగదారులకి త్వరితగతిన సేవలు అందించడానికే స్మార్ట్ మీటర్లు. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ దేశమంతా ఒకేలా ఉంటుంది. మొదటి ఫేజులో 27 లక్షల మీటర్లు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. ఇందులో 4.72 లక్షలు మాత్రమే గృహావసరాల కనెక్షన్స్ ఉన్నాయి. అమృత్ సిటీలోని జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో 200 యూనిట్లు దాటిన 4.72 లక్షల కనెక్షన్స్‌కి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. రాష్ట్రం మొత్తం 1.80 కోట్లు వినియోగదారులు ఉన్నారు. 1.80 కోట్ల కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లనేది అవాస్తవం’’ అని విజయానంద్ స్పష్టం చేశారు. ‘‘13.54 లక్షల మందికి సెకండ్ ఫేజులో స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాం. ఇంకా టెండర్లు పిలవలేదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్ తదితర 15 రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచాయి. ఏపీ 16వ రాష్ట్రంగా టెండర్లు పిలుస్తోంది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ముందుకువచ్చాయి. ఇందుకు కేంద్రం నుంచి 5,484 కోట్లు గ్రాంటుగా వస్తాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులకి అదనపు భారం పడదు. రైతులకి భారం పడకుండా ప్రభుత్వమే స్మార్ట్ మీటర్ల భారాన్ని భరిస్తోంది’’ అని ఆయన అన్నారు. ‘‘స్మార్ట్ మీటర్ల విషయంలో స్పష్టమైన విధానంతో ఇంధనశాఖ ముందుకు వెళ్తోంది. ఇంధన శాఖకి ఇష్టం లేదనేది అవాస్తవం. అన్ని డిస్కమ్‌లతో చర్చించిన తర్వాతే ఇంధన శాఖ ఈ నిర్ణయం. ఈ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఇంధన వ్యయ వినియోగం నేషనల్ మీటరింగ్ మోనిటరింగ్ సిస్టం పరిధిలోకి వెళ్తాయి. ఇంధన శాఖకి వ్యవసాయ, గృహావసరాల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్‌పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకి ఎక్కువ బిల్లులు వస్తాయనేది అపోహ మాత్రమే’’ అని విజయానంద్ వివరించారు. చదవండి: టీడీపీ నేతల అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం -
స్మార్ట్ మీటర్లపై అపోహలొద్దు
సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్లవల్ల ప్రయోజనాలే తప్ప ఎలాంటి నష్టంలేదని, ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయడంపై పలు పత్రికల్లో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ కథనాల్లోని సందేహాలను నివృత్తి చేస్తూ.. స్మార్ట్మీటర్లవల్ల కలిగే ప్రయోజనాలను, ఈ ప్రాజెక్టులోని వాస్తవాలను ఆయన వివరించారు. విజయవాడ విద్యుత్ సౌథలో గవర్నమెంట్ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్, సెంట్రల్ డిస్కం సీఎండీ పద్మాజనార్ధనరెడ్డిలతో కలిసి మంగళవారం విజయానంద్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో ముందుగా 18.56 లక్షల వ్యవసాయ, హైవాల్యూ.. అంటే నెలకు 500 యూనిట్లు పైన విద్యుత్ వినియోగం ఉన్న 27.68 లక్షల సర్వీసులకు స్మార్ట్‌మీటర్లు అమర్చాలని ప్రభుత్వం అదే ఏడాది నిర్ణయించింది. అలాగే. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలని 2020లో డిస్కంలకు ఆదేశాలు జారీచేసింది. టెండర్ల కోసం దేశమంతా ఒకే నిబంధనలతో ఒక డాక్యుమెంట్‌ను కేంద్రమే రూపొందించింది. దాని ప్రకారం టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. పైగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా టెండర్ డాక్యుమెంట్‌ను న్యాయ సమీక్షకు పంపించి అక్కడ నుంచి అనుమతి వచ్చాక మాత్రమే టెండర్ల ఖరారు జరుగుతుంది. మరోవైపు.. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ ఓపెన్‌గానే ఉంది. ఐఆర్డీఏ, బ్లూటూత్, స్మార్ట్, రేడియో ఫ్రీక్వెన్సీ మీటర్లను ఆయా ప్రాంతాల్లో వెసులుబాటులను బట్టి ఏర్పాటుచేసేలా టెండర్లు రూపొందించాం. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనవచ్చు. ఏ ఒక్క సంస్థకో ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం ఎక్కడా జరగడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మీటర్ ఒక్కటే పెట్టడంతో సరిపెట్టకుండా రైతుల ప్రాణరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. అందుకు అవసరమైన పరికరాలను (అలైడ్ మెటీరియల్) ఆర్థికంగా భారమైనా మీటర్లతో పాటు ఏర్పాటుచేయనున్నాం. మిగతా రాష్ట్రాల్లో కేవలం మీటర్లే ఇస్తున్నారు. మన దగ్గర స్మార్ట్మీటర్తో పాటు (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ)తో కూడిన ఫ్యూజ్బాక్స్నూ అందిస్తున్నాం. ముట్టుకున్నా షాక్ కొట్టని బాక్స్‌ను అందిస్తున్నాం. ఇప్పుడున్నట్లు మూడు ఫ్యూజులు ఉండవు. మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదు. అలాగే, ఎర్తింగ్ రాడ్‌ను కూడా ఏర్పాటుచేస్తాం. గ్రిడ్‌పై లోడ్ పడకుండా జాగ్రత్త పడొచ్చు ఇక ప్రస్తుతం గ్రామాల్లో పొలాల మధ్య ఉండే వ్యవసాయ మీటర్ వద్దకు వెళ్లి రీడింగ్ నమోదు చేయడం శ్రమతో కూడుకున్నది కావడంతో ఎవరూ ముందుకు రావడంలేదు. పూర్తి ఆధునిక సాంకేతికతతో స్మార్ట్‌మీటర్లను ఇస్తున్నాం. అలాగే.. – వీటి ద్వారా మోటార్ ఆన్, ఆఫ్ చెయ్యొచ్చు. రైతు పొలానికి వెళ్లి మోటారు స్విచ్చాన్ చేయాల్సిన అవసరం ఉండదు. – భవిష్యత్‌లో గ్రిడ్‌పై పడే లోడ్‌ను మ్యానేజ్ చేయాలంటే స్మార్ట్‌మీటర్ల ద్వారానే వీలవుతుంది. – అదే విధంగా ఎప్పటికప్పుడు లోడ్‌ను మోనిటర్ చేస్తూ గ్రిడ్‌పై లోడ్ పడకుండా జాగ్రత్తపడొచ్చు. – తద్వారా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా కాపాడుకోవచ్చు. – పైగా ఒక ట్రాన్స్ఫార్మర్పై రెండు, మూడు సర్వీసులుంటే అన్ని సర్వీసులకూ ఒకే విధమైన వినియోగం జరగదు. అందరిదీ కలిపి ఒకే రీడింగ్ చూపిస్తుంది. దీనివల్ల రైతులకు నష్టం కలుగుతుంది. పైలట్ ప్రాజెక్టుతో సత్ఫలితాలు మరోవైపు.. స్మార్ట్ మీటర్లపై శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలిచ్చింది. ప్రయాస్ అనే సంస్థ 20 శాతం విద్యుత్ ఆదా అయినట్లు తేల్చింది. మేం అన్ని సర్వీసులపైనా అధ్యయనం చేశాం. 33 శాతం విద్యుత్ అదా కనిపించింది. ఇక రాష్ట్రంలో 12 వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి వాడుతున్నారు. ఇందులో 20 శాతమే ఆదా అనుకుంటే రూ.1,900 కోట్లు, 33 శాతం అయితే రూ.3,600 కోట్లు మిగులుతాయి. మీటర్లు పెట్టడానికి రూ.4 వేల కోట్లు ఖర్చవుతోంది. అంటే పెట్టిన పెట్టుబడి ఒకటి, రెండేళ్లలోనే వచ్చేస్తుంది. ఈ ఫలితాల ఆధారంగానే స్మార్ట్ మీటర్లపై ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో 99 శాతం మంది రైతులు కూడా ఇప్పటికే తమ అంగీకారాన్ని తెలిపారు. -
స్మార్ట్ మీటర్లపై ‘పచ్చ’ పత్రిక అసత్య కథనాలు
పుంగనూరు (చిత్తూరు జిల్లా): ‘విద్యుత్ వినియోగంపై ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లపై అసత్య కథనాలు వల్లించి, విష ప్రచారం చేసి, టెండర్లకు ఎవరినీ రానీయకుండా చేయడమే ఈనాడు యాజమాన్యం లక్ష్యమా? ఆరోపణలు చేసే వారు టెండర్లు దాఖలు చేయండి.. ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది’ అంటూ రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనాడు కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు మండలం కురప్పల్లెలో గురువారం తొలిరోజు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విషయంలో ఆర్టీఎస్ఎస్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. ఈనాడులో రాసిన మేరకు షిరిడీసాయి ఎలక్ట్రికల్ వర్క్స్వారికి పనులు అప్పగించామని, సాధారణ మీటర్ల ధరతో పోల్చితే అధికంగా ఉందనడం బాధాకరమన్నారు. ఈనాడు పత్రిక తనకు నచ్చిన వారితో టెండర్లు వేసుకోవాలన్నారు. టెండర్లు జరగకుండా పనులు కేటాయించే ప్రసక్తే లేదని చెప్పారు. తెలిసీతెలియకుండా రాయడం మంచిదికాదని, ఇలాంటి విషయాల్లో తగిన సమాచారం సేకరించి వార్తలు రాస్తే బాగుంటుందని హితవుపలికారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. -
Fact Check: స్మార్ట్‌గా ‘పచ్చ’ అబద్ధాలు! ‘ఈనాడు’ రాసిన మరో దిగజారుడు కథనం
సాక్షి, అమరావతి: ఆర్థిక శాఖ అంటే ప్రభుత్వంలో భాగం కాదా? ఇంధన శాఖ అంటే ప్రభుత్వంలో భాగం కాదా? మరి ప్రభుత్వం కుంభకోణానికి ప్రయత్నిస్తే ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ఆపటమేంటి? అసలు ఇలాంటి కథనానికి అర్థమేమైనా ఉందా? ‘స్మార్ట్ మేతకు ఎత్తు’ అంటూ గురువారం ‘ఈనాడు’ ప్రచురించిన వార్త ఇలాంటిదే. ప్రభుత్వం కుంభకోణానికి ప్రయత్నిస్తే, ‘ఇంధన, ఆర్థిక శాఖలు తీవ్ర అభ్యంతరం’ వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం ఫలించలేదన్నది వార్త సారాంశం. స్మార్ట్ మీటర్ల విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అంశాలను పరిశీలించి, తగిన వివరణ ఇవ్వాలంటూ డిస్కంలకు ఇంధనశాఖ కార్యదర్శి మూడు నెలల క్రితం రాసిన లేఖల అర్థ్ధాన్నే మార్చేసి... ఇప్పుడేదో జరిగిపోతున్నట్లుగా కథనాన్ని వండేసింది. విచిత్రమేంటంటే టెండర్లను పిలిచింది ప్రభుత్వమే. శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించిన మీదట... అక్కడ దాదాపు 20 శాతం విద్యుత్ వినియోగం తగ్గింది. పైపెచ్చు విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కం) చంద్రబాబునాయుడు ఏకంగా రూ.21,000 కోట్ల అప్పుల్లో ముంచి దిగిపోవటంతో వాటి ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింది. వాటిని గాడిలో పెట్టాలంటే వాటికీ కాస్త జవాబుదారీ తనం పెరగాలి. మరోవంక మీటర్ల వల్ల రైతులు తాము వాడిన విద్యుత్తుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందుకున్న సొమ్మును తామే నేరుగా డిస్కమ్‌లకు చెల్లిస్తారు. వారికి నాణ్యమైన విద్యుత్తును అడిగే హక్కుంటుంది. ఈ కారణాలతో స్మార్ట్ మీటర్లకు ప్రభుత్వం ముందడుగు వేసింది. కాకపోతే కోవిడ్ సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతిని... ప్రతి వస్తువు ధరా దారుణంగా పెరిగిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అప్పట్లో పిలిచిన టెండర్లు కావటంతో.. ముందుకొచ్చిన కంపెనీలు అప్పటికి తగ్గట్టు రేట్లు కోట్ చేశాయి. రకరకాల కారణాలతో టెండర్లు ఆలస్యం కావా? చివరకు కోవిడ్ తగ్గి పరిస్థితులు మామూలు స్థాయికి రావటంతో పరికరాల ధరలూ తగ్గుముఖం పట్టాయి. ఇది గమనించబట్టే ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి... ప్రస్తుత ధరలతో పిలిస్తే కొంత ఆదా అవుతుందని భావించింది. అందుకే ప్రభుత్వమే టెండర్లను రద్దు చేసింది. మరి దీన్లో కుంభకోణమేంటో.. ప్రభుత్వమే స్కామ్ చెయ్యబోతే దాన్ని ఇంధన శాఖ ఆపేయటమేంటో... రామోజీరావే చెప్పాలి. ఇప్పుడైనా మీరు టెండర్లు వేయొచ్చు కదా? ప్రతిసారీ ప్రభుత్వం చెబుదున్నదొకటే. పనికిమాలిన ఆరోపణలు చేసే బదులు... అలాంటి టెండర్లలో మీరూ పాల్గొనవచ్చు కదా... అని!!. ఎందుకంటే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో వీటికి ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. దాన్లో ఎవరైనా పాల్గొనవచ్చు.ఎవరు తక్కువకు కోట్‌చేస్తే... వారికే పని దక్కుతుంది. రకరకాల రాష్ట్రాల పేర్లు చెబుతూ ఎక్కడెక్కడ ఎంత తక్కువో చెబుతున్న రామోజీరావు... వారితో ఒప్పందం చేసుకుని తానే టెండర్లు వేయొచ్చు కదా? లేకపోతే రామోజీకి తందానతాన పలికే చంద్రబాబునాయుడే టెండర్లు వేయొచ్చు కదా? మీరు తక్కువ కోట్ చేస్తే మీకే వస్తుంది కదా? ఎందుకీ పనికిమాలిన ఆరోపణలు?. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ మీటర్లకు గ్రాంటు ఇస్తూ... వీటి ఏర్పాటుకు రకరకాల నిబంధనలు పెట్టింది. ఆ మార్గదర్శకాలకు లోబడే ఎవరైనా చెయ్యాలి. అలాంటి వాస్తవాలు రాయనే రాయరు. ఇంకా ‘ఈనాడు’ రాసిన ఈ దిగజారుడు కథనంలో అసలు నిజాలేంటంటే... ఆరోపణ: ఇతర రాష్ట్రాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు అమర్చే ఒక్కో స్మార్ట్ మీటర్ (3 ఫేజ్)కు రూ.3,500 వ్యయం వాస్తవం: ఇది పచ్చి అబద్ధం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ మీటర్లకు టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీనికితోడు కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం ముందే చెల్లించేస్తుందంటూ ‘ఈనాడు’ రాయటం కూడా పచ్చి అబద్ధమే. ఎందుకంటే నిర్వహణ వ్యయంలో మాత్రం 40 శాతాన్ని కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన 60 శాతాన్ని ఏడేళ్ల వ్యవధిలో చెల్లిస్తుంది. కానీ మొత్తం 100 శాతాన్నీ కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం ముందే చెల్లించేస్తుందంటూ ‘ఈనాడు’ రాయటాన్ని ఏమనుకోవాలి? అయినా టెండర్ల ప్రక్రియే పూర్తికాకుండా... దానికి ఎక్కువ పెట్టేశారని ఒకసారి... ఇంధన శాఖ అడ్డుకోవటంతోనే రద్దు చేశారని మరోసారి... ఇలాంటి రాతలను ఏమనుకోవాలి రామోజీరావు గారూ? ఈనాడు’ ఆరోపణ: మహారాష్ట్ర కంటే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రెట్లు ఎక్కువ వాస్తవం: రాష్ట్రంలో ఒక్కో స్మార్ట్ మీటర్ ఏర్పాటు, నిర్వహణకు నెలకు రూ.581.16 పైసలు అవుతుందనడం అబద్ధం. అసలు టెండర్లే ఖరారు కానపుడు రేట్లెలా నిర్ధారిస్తారు? ఇంకా విచిత్రమేంటంటే మహారాష్ట్రలోని మీటర్లతో వీటిని పోల్చటం. మహారాష్ట్రలో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్లను అమర్చింది ప్రధానంగా అర్బన్ ప్రాంతంలోని ఇళ్లకు. 80 శాతం సింగిల్ ఫేజ్, 20 శాతం త్రీఫేజ్ మీటర్లు. నిర్వహణ కాల వ్యవధి ఏడున్నరేళ్లు. ఈ వ్యవధిలో కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన మొత్తం మీటరుకు రూ.18,690. కానీ మన రాష్ట్రంలో అమరుస్తున్నది గ్రామాల్లో.. అది కూడా వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు. అన్నీ త్రీఫేజ్ మీటర్లే. మరి వాటికీ వీటికీ పోలిక ఎక్కడ? పైపెచ్చు మన రాష్ట్రంలో టెండర్లు పిలిచే నాటికి ఎక్కడా గ్రామీణ ప్రాంతాల్లో వీటిని అమర్చిన సందర్భాల్లేనందున దీనికి బెంచ్‌మార్క్ ధరంటూ లేదు. అయినా సరే.. కాంట్రాక్టు సంస్థలు కోట్ చేసిన ధర ఎక్కువని ప్రభుత్వమే భావించినందున ప్రభుత్వమే రద్దుచేసి మళ్లీ పిలుస్తోంది. కానీ ‘ఈనాడు’ వంకర రాతలే పనిగా పెట్టుకుంది. ‘ఆరోపణ: స్మార్ట్ మీటర్లలో ఫీచర్లు ఎక్కువ ఉన్నంత మాత్రన అంత ధరలా? వాస్తవం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చారు. మీటర్ రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాలి. వేర్వేరు ప్రాంతాల్లోని ఈ వ్యవసాయ సర్వీసులన్నింటికీ రీడింగ్ తీయడం కష్టమైది. మీటరు బోర్డుకు ఎటువంటి అనుబంధ, భద్రతా పరికరాలను అమర్చలేదు. వ్యవసాయ పంపుసెట్లకు దగ్గరగా బహిరంగ ప్రదేశంలో వీటిని అమర్చడంతో ఎండ, వర్షాలకు పరికరాలు దెబ్బతింటున్నాయి. దీంతో మీటర్లను మార్చాల్సిన పరిస్థితొస్తోది. రీడింగ్ తీయడానికి కూడా ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. విద్యుత్ శాఖ సిబ్బందితోనే ప్రస్తుతం రీడింగ్ తీస్తుండటంతో సాదారణ విధులకు ఆటంకమేర్పడుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లకు ప్రస్తుతం అనుబంధ, భద్రత పరికరాలు ఏమీ లేవు. దీంతో భద్రతా పరికరాలైన కెపాసిటర్లు (నాణ్యమైన ఓల్టేజ్, పంపిణీ నష్టాలు తగ్గింపునకు), సర్వీసు వైరు, పీవీసీ వైరు, ఎర్తింగ్, ఎంసీబీ(ఓవర్ లోడ్ ప్రొటెక్షన్, విద్యుత్ భద్రతా చర్యల బలోపేతానికి) కూడా చేర్చారు. ఈ ఎస్ఎంసీ బాక్స్‌లో మీటర్లను ఏర్పాటు చేస్తారు కనక వివిధ వాతావరణ పరిస్థితుల్లో వాటికి భద్రత ఉంటుంది. రైతులకి విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణా ఉంటుంది. యంసీబీ ద్వారా ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యుర్నూ తగ్గించొచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతు కోసం ఏటా రూ.102 కోట్లు భరించాల్సి వస్తోంది. అందుకే ఈ పరికరాలన్నిటినీ చేరిస్తే... ఇవన్నీ అనవసరమైనవంటూ తేల్చేశారు ఘనత వహించిన రామోజీరావు!!. అదీ ‘ఈనాడు’ పాఠకుల దౌర్భాగ్యం. -
స్మార్ట్ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో తలపెట్టిన స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ఎటువంటి రుణాలు తీసుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ‘సాక్షి’కి స్పష్టంచేశాయి. రూ.1,850 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరాయనడంలో ఎలాంటి నిజంలేదని అవి తేల్చిచెప్పాయి. ‘స్మార్ట్‌గా భారం’ శీర్షికన ‘ఈనాడు’ గురువారం ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె. సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె. పద్మజనార్థనరెడ్డి గురువారం ఖండించారు. పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద అన్ని రాష్ట్రాల్లోనూ మీటర్లను అమర్చుతున్నారని.. అందులో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు 23 శాతం మీటర్లకు మాత్రమే ప్రీపెయిడ్ మీటర్లు (స్మార్ట్ మీటర్లు) అమర్చేందుకు ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారుచేశాయని వారు వివరించారు. దీనిలో భాగంగా ప్రాజెక్టు అమలుకోసం కొత్తగా ఎలాంటి రుణాలు చేయడంలేదని.. అదే విధంగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇంతవరకూ ఎటువంటి విమర్శలు విద్యుత్ సంస్థల వరకూ రాలేదని వారు తెలిపారు. మీటర్ల నాణ్యతలో రాజీపడకుండా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎండీలు వెల్లడించారు. పారదర్శకంగా టెండర్లు ఇక రాష్ట్రంలో మొత్తం 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు దశల వారీగా స్మార్ట్‌మీటర్లను అమర్చనున్నట్లు సీఎండీలు తెలిపారు. తొలిదశకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలైందని.. ఈ టెండర్ల ప్రక్రియలో కేంద్ర ఇంధన శాఖ రూపొందించిన నిబంధనలను పాటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలన్నీ అవే నిబంధనల్ని అనుసరిస్తున్నాయని.. దీని ప్రకారం టెండర్లలో పాల్గొనే సంస్థలు కేంద్ర ఇంధన శాఖ ఆమోదం పొందాలన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో నమోదు ప్రక్రియను పూర్తిచేసి ఆమోదం పొందిన 29 సంస్థల వివరాలను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) వెబ్సైట్లో ఉంచారని వారు చెప్పారు. టెండరు నిబంధనలను ఇష్టానుసారం మార్చేందుకు వీల్లేదని వివరించారు. నెలనెలా చెల్లింపులు.. మరోవైపు.. మీటర్ ధర, దాని నిర్వహణకయ్యే ఖర్చును ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరంలేదని వారన్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థకు ఆ మొత్తాన్నీ పదేళ్లపాటు ప్రతినెలా డిస్కంలు చెల్లిస్తాయన్నారు. తొలి విడత మీటర్ల ఏర్పాటుకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.1,658 కోట్లకు, పశ్చిమ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.947 కోట్లు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.1,508 కోట్లు వ్యయ అంచనాలను రూపొందించి సాంకేతిక, పరిపాలన, డీఆర్సీ, మంత్రిమండలి అనుమతి పొందాయని వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన పత్రాలను న్యాయ సమీక్షకు పంపగా జ్యూడీషియల్ అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో టెండర్ ప్రక్రియను ప్రారంభించాయని.. ఈ మొత్తం వ్యయంలో ఎటువంటి భారం వినియోగదారులపై పడదని వారు స్పష్టంచేశారు. కేంద్ర నిబంధనల మేరకే.. పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) గతేడాది జూలై 20న ప్రారంభమైంది. నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ పంపిణీ, వాణిజ్య నష్టాలు 12–15 శాతం తగ్గించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేయడం.. విద్యుత్ పంపిణీ ఫీడర్లకు, ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లు అమర్చాలనే నిబంధనలు విధించారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ పనులు చేపట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు డిస్కంలు ప్రీ పెయిడ్ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ప్రణాళికలను పంపి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాయి. ఈ పథకం కింద డిసెంబర్ 2023లోగా ఏర్పాటుచేసిన ఒక్కో ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్‌కు రూ.900లు గ్రాంట్ రూపంలోనూ, అదనంగా రూ.450లు ఇన్సెటివ్ రూపంలోనూ కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి.. అని సీఎండీలు వివరించారు. డిస్కంలకు, వినియోగదారులకు మేలు నిజానికి.. కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా డిస్కంలకు, వినియోగదారులకు పలు ప్రయోజనాలున్నాయి. ► ముఖ్యంగా ఈ మీటర్ల ద్వారా వినియోగదారుని బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ► బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి బిల్లును చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ► విద్యుత్ ఏ సమయాల్లో సరఫరా అవుతోంది.. నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందా లేదా.. అనే సమాచారాన్ని కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ► ఇక విద్యుత్ బిల్లు కట్టలేదని లైన్మెన్ కరెంట్ స్తంభం ఎక్కి కరెంట్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఉండదు. ► డిస్కంల పరిధిలో విద్యుత్ చౌర్యాన్ని అడ్డుకునేందుకు ఆస్కారం దొరుకుతుంది. -
ప్రజలపై పైసా భారం లేకుండా స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రజలపై పైసా భారం పడకుండా, పూర్తి పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రంగం సిద్ధం చేశాయి. రాష్ట్రంలోని గృహాలకు, వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఇంధన శాఖ సంకల్పించింది. బోర్లకు మీటర్లు అమర్చడం వల్ల డిస్కంల సమర్థత పెంచవచ్చని, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చని, రైతులకు బాధ్యత పెంచవచ్చనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ వివరాలతో టెండర్ డాక్యుమెంట్లను అక్టోబర్ 21న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు న్యాయ సమీక్షకు పంపించాయి. వాటిపై ప్రజలు, వినియోగదారులు సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన పూర్తికాగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు దరఖాస్తు చేయనున్నాయి. ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తరువాత మీటర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అది అవాస్తవం మీటరుకు రూ. 6 వేలు, నిర్వహణకు రూ.29వేలు చొప్పున మొత్తం రూ.35 వేలను డిస్కంలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవమని డిస్కంలు స్పష్టం చేశాయి. నిజానికి టెండర్లు కోట్ చేసిన రేటు ప్రకారం ఒక నెలకు ఒక్కో మీటరుకు రూ. 255 చొప్పున అన్ని నిర్వహణ బాధ్యతలు, దొంగతనం జరిగిన, మీటర్లు కాలిపోయిన టెండర్ బిడ్ చేసేవారే మీటర్లు మార్చే విధంగా డాక్యుమెంట్ పొందుపరిచారు. దీని ప్రకారం ఐదేళ్లకు రూ. 15,300 మాత్రమే ఖర్చుఅవుతోంది. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు డీఓఎల్ స్టార్టర్లు వాడటం వల్ల 4 నుంచి 5 రెట్లు ఎక్కువ విద్యుత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీటరు సామర్థ్యం దానికి తగ్గట్టుగా ఉండాలి. వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా ఉండదు. అందువల్ల దానికి తగ్గట్టు కమ్యూనికేషన్ వ్యవస్థను టెండర్స్ బిడ్ చేసే వారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటర్లతో ప్రయోజనం స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ వృథా, చౌర్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు వినియోగదారులకు లభిస్తుంది. పంపిణీ వ్యవస్థలో లోపాలను సకాలంలో గుర్తించడం వల్ల విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది. స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ను సపోర్ట్ చేస్తాయి. అంటే వినియోగదారుల మొబైల్‌కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ -
నాణ్యమైన విద్యుత్ కోసమే మీటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నట్టు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. ‘రైతు చేనుకు కడప మీటరు’ పేరుతో ఈనాడు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులో వాస్తవాలతో వారు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు.. రైతుల ప్రయోజనానికే మీటర్లు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోఎంఎస్ 22, తేదీ 01.09.2020) ప్రకారం పెడుతున్న ఈ మీటర్ల వల్ల మోటార్లు కాలిపోవు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ఎంత విద్యుత్ వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల సరిపడా కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవచ్చు. మీటర్ల ఏర్పాటుకు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో.. దానికయ్యే చార్జీలను మొత్తం ప్రభుత్వమే నేరుగా రైతుల ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) కింద జమచేస్తుంది. ఆ డబ్బు నేరుగా రైతుల ద్వారా డిస్కంలకు బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియల వల్ల పూర్తి పారదర్శకత ఉంటుంది. కరెంటు సరఫరా కంపెనీలను ప్రశ్నించేహక్కు రైతులకు లభిస్తుంది. కంపెనీలకు కూడా బాధ్యత పెరుగుతుంది. తగ్గుతున్న నష్టాలు ప్రస్తుతం ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చాం. రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాల్సి ఉంది. ఈ వ్యవసాయ సర్వీసులు దూర ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల ఈ పద్ధతిలో రీడింగ్ తీయడం కష్టంగా ఉంది. అందుకే స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలు సంకల్పించాయి. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో మీటర్లను ఏర్పాటుచేసిన తర్వాత ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ (స్వతంత్ర గ్రూప్) సర్వే రిపోర్టు ప్రకారం నష్టాలు 15–20 శాతానికి తగ్గినట్లు నమోదైంది. ఆ టెండర్లు ఎప్పుడో రద్దు విద్యుత్ సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లోని త్రీఫేజ్ మీటర్లకు డీబీటీ విధానం కోసం ఐదేళ్ల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. ఆర్డీఎస్ఎస్ కింద స్మార్ట్ మీటర్లను గడువులోపు పూర్తిచేస్తే 22.50 శాతం గ్రాంటు రూపంలో సమకూరుతుంది. మొదటి రీడింగ్ తీసిన తర్వాత కాంట్రాక్టర్‌కు ఒక్కో మీటరుకు కెపెక్స్ కింద రూ.1,800 చొప్పున చెల్లిస్తాం. తర్వాత మిగిలిన మొత్తంతోపాటు ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్‌ల కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా ఐదేళ్ల కాంట్రాక్ట్ కాలవ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని ఇస్తాం. వీటికి నెలకు రూ.254 చొప్పున గుత్తేదార్లు టెండర్లను దాఖలు చేశారు. కోవిడ్–19 సమయంలో రూపొందించిన అంచనాల హెచ్చుతగ్గులను పరిశీలించి ప్రభుత్వం టెండర్లు రద్దుచేసింది. ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు లభించిన తర్వాతే కొత్తగా టెండర్లు పిలుస్తాం. ఇటీవల మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్ల కోసం ఆఫర్ చేసిన బిడ్లలో ఒక్కో మీటరుకు నెలకు వ్యయం రూ.200.96 పైసలుగా ఖరారైంది. ఏడున్నర సంవత్సరాల కాలవ్యవధి కలిగిన వీటిలో 80 శాతం సింగిల్‌ఫేజ్ మీటర్లు కాగా 20 శాతం మాత్రమే త్రీఫేజ్ మీటర్లు. కానీ ఏపీలో వ్యవసాయ సర్వీసులన్నీ త్రీఫేజ్ మీటర్లే. ఒక్కో మీటరుకు కేంద్రప్రభుత్వ అంచనా ధర పదేళ్ల కాలపరిమితికి రూ.6 వేలు. దీనికి అనుగుణంగా మీటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట తొమ్మిదిగంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్తు కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి సుమారు రూ.1,700 కోట్లు ఖర్చుచేసి ఫీడర్లను ఏర్పాటు చేశాం. గడచిన 90 రోజుల్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 48 గంటల్లోపే కొత్తవాటిని బిగించాం. రానున్నరోజుల్లో నూటికి నూరుశాతం 48 గంటల్లోపే మార్చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడానికి అన్ని రకాల చర్యలను విద్యుత్ పంపిణీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయం మీటరుకు అనుబంధ పరికరాలు, నిర్వహణకు రూ.29 వేలు ఖర్చవుతోందని ఈనాడు దినపత్రిక రాసిన కథనంలో వాస్తవం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయంతో, మీటరు బాక్స్‌తో పాటు, పీఈసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకం ఆర్డీఎస్ఎస్లో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంకు సమకూరుతుంది. అనుబంధ పరికరాలను అమర్చడానికి, అవి పాడైపోకుండా ఉండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. వ్యవసాయ పంపుసెట్లకు రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని సంస్థలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన వోల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. -
ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: సంప్రదాయ విద్యుత్ మీటర్ల స్థానంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌ను ఏపీలో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలతో మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్, కచ్చితమైన విద్యుత్ బిల్లులు, ఉత్తమ సేవలు అందుతాయని మంత్రి వెల్లడించారు. విద్యుత్ సంస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరగడంతో పాటు సాంకేతిక, వాణిజ్య నష్టాలు తగ్గేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు. బ్రిటన్, కేంద్ర అధికారుల భేటీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ.. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గేరేత్ విన్ ఓవెన్, బ్రిటిష్ హై కమిషన్ ఇంధన సలహాదారు సుష్మిత రామోజీ, కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ఇంధన శాఖ అధికారులను రెండు రోజుల క్రితం కలిసి ఏపీలో చేపట్టనున్న స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుపై చర్చించారని మంత్రికి వివరించారు. ఈ మీటర్లు ఇంటర్నెట్కు అనుసంధానించడం వల్ల విద్యుత్ వినియోగ వివరాలు డిస్కంలకే గాక వినియోగదారులకు కూడా ఏరోజుకారోజు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ చౌర్యం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, వోల్టేజీ హెచ్చుతగ్గులను స్మార్ట్ మీటర్ రికార్డు చేస్తుందని వివరించారు. కాగా, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 5 సర్కిళ్లలో స్మార్ట్ మీటర్ ప్రాజెక్టు అమలుకు రూ.947.15 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించినట్టు డిస్కం సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డి, ఏపీ ఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్లతో నాణ్యమైన విద్యుత్
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఎలాంటి అంతరాయాలు లేకుండా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. స్మార్ట్ మీటర్లతో రైతులకు ఎలాంటి నష్టం కలగదన్నారు. ఇంధన శాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లలో 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేశామన్నారు. త్వరలో మరో 77 వేల కొత్త కనెక్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు సంబంధించిన భారాన్ని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి.. పరిశీలించినట్లు తెలిపారు. ఈ జిల్లాలో సాధారణంగా ఉచిత విద్యుత్ వినియోగానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం కన్నా.. 30 శాతం తక్కువగానే రైతులు వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. 2023 మార్చి నాటికి రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు డీబీటీ ఖాతాలు తెరిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 70 శాతానికి పైగా రైతులు బ్యాంకు ఖాతాలను తెరిచారని.. అక్టోబర్ 15 నాటికి నూరు శాతం పూర్తవుతుందన్నారు. పోస్టాఫీస్‌లలో కూడా రైతులు ఖాతాలు తెరవచ్చన్నారు. రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు.. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై విపక్షాలు రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తోక పార్టీలైన జనసేన, వామపక్షాలు రాజకీయ స్వార్థంతో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విచక్షణ కోల్పోయి చేతులు, వేళ్లు నరకాలని పిలుపునిస్తున్న విపక్ష నేతలు.. తమ చేతులనే నరుక్కుంటున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం జరుగుతుందంటున్న విపక్ష నేతలు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి.. అక్కడి రైతులతో మాట్లాడాలని హితవు పలికారు. స్మార్ట్‌మీటర్ల వల్ల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. రైతులు తమ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసే సబ్సిడీ మొత్తాన్ని వారే స్వయంగా డిస్కంలకు చెల్లించడం ద్వారా నాణ్యమైన విద్యుత్‌పై ప్రశ్నించే హక్కును పొందుతారన్నారు. -
మీటర్లతో మిగులుతున్న విద్యుత్
సాక్షి, అమరావతి: ‘రైతులు, ప్రజా సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండడుగులు వేశారు. నేను నాలుగడుగులు వేస్తాను..’ అని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా ఉచిత విద్యుత్తు పథకం పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించారు. ఉచిత విద్యుత్ పథకం ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదని, దాన్ని రైతుల హక్కుగా మార్చాలని సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రైతులపై ఒక్క రూపాయి భారం పడకుండా.. వారికి శాశ్వత ప్రయోజనం కల్పించేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్ల కిందట శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది. భారీగా విద్యుత్‌ను ఆదా చేస్తోంది. సర్వీసులు పెరిగినా మిగిలిన విద్యుత్ రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా శ్రీకాకుళం జిల్లాలో 2021–22 నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ మీటర్లు అమర్చకముందు.. అంటే 2020–21లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులు 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాయి. 2021 మార్చి నాటికి జిల్లాలో 26,063 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2021–22లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులు 67.76 మిలియన్ యూనిట్లే వినియోగించాయి. 2022 మార్చి నాటికి జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 28,393కు చేరింది. జిల్లాలో ఏడాదిలో 2,330 సర్వీసులు పెరిగినా.. మీటర్లు బిగించడం వల్ల 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. ఇదే విధంగా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే భారీగా విద్యుత్ ఆదా అవుతుందని పైలెట్ ప్రాజెక్ట్ నిరూపించింది. రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్ రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూట 9 గంటలు ఉచితంగా రానున్న 30 ఏళ్ల పాటు సరఫరా చేయాలనేది సీఎం జగన్ ధ్యేయం. డీబీటీ పథకం ద్వారా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా రైతులు తమ హక్కుగా విద్యుత్ పొందుతారని, విద్యుత్ వృధా తగ్గి ఆదా అవుతుందని సీఎం స్పష్టంగా చెప్పారు. దీంతో పథకం అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, కంపెనీ, ప్రభుత్వ కమిటీలంటూ క్షేత్రస్థాయి నుంచి, ప్రభుత్వస్థాయి వరకు వివిధ కమిటీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం. కరపత్రాలు, పోస్టర్లు, ప్రకటనలు, సదస్సుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. –కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ శ్రీకాకుళం జిల్లాలో మోటార్లకు మీటర్లు అమర్చే పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ఇక్కడి రైతులంతా మీటర్లకు తమ సంపూర్ణ మద్దతు తెలిపి, అంగీకారపత్రాలు కూడ ఇచ్చారు. మీటర్ల వల్ల విద్యుత్తు లోడ్‌ను ఎప్పటికప్పుడు సరిచూసి ఆమేరకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించవచ్చు. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ డిస్కంలకు జవాబుదారీ తనం మీటర్ల ఏర్పాటు కోసం రూ. 1,200 కోట్ల వ్యయం అవుతుందనేది ప్రాథమిక అంచనా. ఈ మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. నగదు బదిలీ విధానంలో రైతులపై ఒక్కపైసా కూడా భారం పడదు. వ్యవసాయ విద్యుత్‌కు వచ్చిన బిల్లు మొత్తాన్ని రైతుల బ్యాంకు ప్రత్యేక ఖాతాల్లో ప్రభుత్వమే జమచేస్తుంది. దాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. దీనివల్ల డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుంది. – జె.పద్మజనార్ధనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ -
రాష్ట్రంలో 59.19 లక్షల స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 59.19 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలతోను, అటవీ, పోలీసు అధికారులతోను వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. డిస్కంల సీఎండీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి 46.41 లక్షల స్మార్ట్ మీటర్లు, 2025 మార్చి నాటికి మరో 12.77 లక్షల స్మార్ట్ మీటర్లు బిగించాల్సి ఉందని చెప్పారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక నష్టాలు, విద్యుత్ చౌర్యాలు, ఓవర్ లోడ్, లో ఓల్టేజీ వంటి సమస్యల నియంత్రణకు పటిష్టచర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు ఫెయిలయితే వారం రోజుల్లో మార్చాలని ఆదేశించారు. ఈ విషయంలో రోజుల తరబడి జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయన్నారు. సీఎండీలు దీనిపై దృష్టిసారించి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల నాణ్యత విషయంలో రాజీపడకూడదన్నారు. ఇందుకోసం మొత్తం రూ.4,113 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. జగనన్న కాలనీలు సీఎం మానస పుత్రికలు జగనన్న కాలనీలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికలని, వీటికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఇళ్లస్థలాలు, పక్కాగృహాలను మంజూరు చేశారని, వాటికి అన్ని వసతులను కల్పించాలనే సీఎం లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ దీపాలు, గృహ విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సరఫరాకు విద్యుత్ సదుపాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్దన్‌రెడ్డి, హెచ్.హరనాథ్‌రావు, ఇంధనశాఖ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమన్వయ సమావేశాలు ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సరిహద్దు రాష్ట్రాల అటవీ, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అటవీ, పోలీసు అధికారులతో ఎర్రచందనంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వెంటనే ఆ రాష్ట్రాల అటవీ, పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్‌తో చర్చించి అవసరమైతే పొరుగు రాష్ట్రాల మంత్రుల స్థాయి సమావేశం కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 5.30 లక్షల హెక్టార్లలో ఉన్న ఎర్రచందనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చెక్‌పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని, స్మగ్లింగ్‌కు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని కోరారు. ఎర్రచందనంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,376.043 మెట్రిక్ టన్నుల సీజ్చేసిన ఎర్రచందనం నిల్వలున్నాయని, వీటి విక్రయానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి ప్రతీప్‌కుమార్, అదనపు పీసీసీఎఫ్ (విజిలెన్స్) గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్’గా విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు రానున్నాయి. వీటి ద్వారా నాణ్యమైన, సరఫరాలో లోపాలు లేని విద్యుత్‌ను పొందవచ్చు. మొబైల్ ఫోన్ల లాగానే ముందుగా రీచార్జ్ చేసుకొని మనకు ఎంతమేరకు విద్యుత్ అవసరమో అంతే పొందవచ్చు. దీనివల్ల వినియోగదారులు, డిస్కంలకు పలు ప్రయోజనాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఈ మీటర్లు అమరుస్తున్నారు. 2025 నాటికి స్మార్ట్ మీటర్లు వినియోగంలోకి తేవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. మూడు, నాలుగేళ్లలో అన్ని రాష్ట్రాల్లో 250 మిలియన్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి అవే సంస్కరణలను రైతులు, డిస్కంల శ్రేయస్సు కోసం వినియోగిస్తోంది. ప్రభుత్వ సర్వీసులకు టెండర్లు పిలిచిన ఏపీ డిస్కంలు కేంద్రం రూపొందించిన నమూనా పత్రం ఆధారంగా రాష్ట్రంలోనూ టెండర్లు పిలిచారు. ముందుగా ప్రభుత్వ రంగ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో లక్ష సర్వీసులు చొప్పున, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 1.30 లక్షల సర్వీసులకు టెండర్లు పిలిచారు. డిసెంబర్ 1 నుంచి మీటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు డిస్కంల సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికోసం 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) నుంచి తీసుకోనుంది. ఉచిత విద్యుత్ లక్ష్య సాధనకు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతులపై భారం పడకుండా ఈ మీటర్ల వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో రైతుల సమ్మతితో వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకుని మీటర్లు బిగిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1,200కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వమే మీటర్లు ఏర్పాటు చేస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ‘సాక్షి’కి తెలిపారు. ఎప్పటికప్పుడు మొబైల్‌కు సమాచారం స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ ద్వారా వినియోగదారుల మొబైల్‌కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి. వినియోగదారులు రీచార్జ్ వంటి సేవలను, ఫిర్యాదులను వారి మొబైల్ ద్వారానే పొందవచ్చు. ఎంత విద్యుత్ అవసరమనుకుంటే అంతే రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వ, వ్యవసాయ సర్వీసులకే స్మార్ట్ మీటర్లు అమర్చనున్నందున ప్రభుత్వమే రీచార్జ్ ప్రక్రియను ప్రత్యామ్నాయ విధానాల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నో ప్రయోజనాలు ► స్మార్ట్ మీటర్లతో మొబైల్ రీచార్జ్ మాదిరిగానే ముందుగా విద్యుత్ మీటర్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల పంపిణీ సంస్థలకు ముందుగానే నగదు జమ అవుతుంది. బకాయిల భారం ఉండదు. ► అవసరం మేరకే విద్యుత్ వినియోగించొచ్చు. వృధా ఉండదు ► సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు లభిస్తుంది ► పంపిణీ వ్యవస్థలో లోపాలను, లో ఓల్టేజిని త్వరగా గుర్తించి, విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించొచ్చు ► గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వ్యవసాయ లోడును కచ్చితంగా లెక్కించవచ్చు. లోడు ఎక్కువ ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్ధ్యం పెంచొచ్చు ► రూఫ్ టాప్ సోలార్ ఉన్నవారికి ఆదాయ వనరుగా మారడానికి టూ–వే ఫ్లో డిటెక్షన్‌తో నెట్ మీటరింగ్‌ను కూడా అందిస్తుంది ► సబ్సిడీ విద్యుత్ పొందే ప్రజల సర్వీసులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు లింక్ చేయడం వల్ల సబ్సిడీ సొమ్ము వారి ఖాతాలకు జమ అవుతుంది ► గ్రిడ్‌ను స్థిరీకరించడానికి స్మార్ట్ మీటర్లు సహాయపడతాయి -
ప్రీపెయిడ్ కరెంట్‌కు డెడ్‌లైన్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ రంగ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పదునుపెట్టింది. విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటీకరణే లక్ష్యంగా విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును ప్రకటించిన కేంద్రం.. బిల్లు ఆమోదానికి ముందే అందులోని లక్ష్యాల సాధన దిశగా చర్యలను వేగిరం చేసింది. విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు గడువులను నిర్దేశిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కమ్యూనికేషన్ నెట్వర్క్ లభ్యత ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం మినహా ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు అంతర్జాతీయ ప్రమాణాల(ఐఎస్–16444) మేరకు కింద పేర్కొన్న గడువుల్లోగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ►అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, 50 శాతానికి మించి పట్టణ ప్రాంత వినియోగదారులను కలిగి ఉండి 2019–20లో 15 శాతానికి మించిన సాంకేతిక, వాణిజ్యపర(ఏటీఅండ్‌సీ) నష్టాలున్న విద్యుత్ డివిజన్లలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు.. 2023, డిసెంబర్ నాటికి ప్రీపెయిడ్ పద్ధతిలో విద్యుత్ సరఫరా చేయాలి. 2019–20లో 25 శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన ఇతర విద్యుత్ డివిజన్లు, మండల(బ్లాక్), ఆపై స్థాయిల్లో కూడా ఇదే గడువులోపు అందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి. ఒక్కోసారి ఆరు నెలలకు మించకుండా నోటిఫికేషన్ ద్వారా రెండు పర్యాయాలు ఈ గడువు పొడిగించడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి అవకాశం కల్పించింది. అయితే దీనికి సరైన కారణాలు చూపాలి. ►ఇతర అన్ని ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడంతో పాటు ప్రీపెయిడ్ పద్ధతిలోనే విద్యుత్ సరఫరా చేయాలి. ►అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల సామర్థ్యానికి మించి అధిక మోతాదులో విద్యుత్ వినియోగించే వినియోగదారులకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) సదుపాయం గల స్మార్ట్ మీటర్లను బిగించాలి. ►అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల(డీటీ)కు ఈ కింద పేర్కొన్న గడువుల్లోగా ఏఎంఆర్/ఏఎంఐ సదుపాయం ఉన్న మీటర్లను ఏర్పాటు చేయాలి. ►2022, డిసెంబర్‌లోగా అన్ని ఫీడర్లకు మీటర్లు బిగించాలి. ►50 శాతానికి మించి పట్టణ వినియోగదారులు కలిగి ఉండి... 2019–20లో 15 శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన అన్ని డివిజన్ల పరిధిలోని అన్ని డీటీలకు, 2019–20లో 25శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన అన్ని డివిజన్ల పరిధిలోని డీటీలకు డిసెంబర్ 2023లోగా మీటర్లు బిగించాలి. ►ఇతర అన్ని డివిజన్లలోని డీటీలకు 2025 మార్చిలోగా మీటర్లు ఏర్పాటు చేయాలి. ►25కేవీఏ కన్నా తక్కువ సామర్థ్యం గల డీటీలు, హెచ్‌వీడీఎస్‌లకు పైన పేర్కొన్న గడువుల నుంచి మినహాయింపు. -
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపునకు గడువు
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయేతర విద్యుత్తు వినియోగదారులకు ప్రీపెయిడ్ సౌకర్యం ఉండే స్మార్ట్ మీటర్ల ద్వారా మాత్రమే విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ ఆయా మీటర్ల బిగింపునకు నిర్దిష్ట కాల వ్యవధిని నోటిఫై చేస్తూ కేంద్ర విద్యుత్తు శాఖ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. 2023 డిసెంబర్ నాటికి గడువు ఉన్న కేటగిరీలు ► 50 శాతం కంటే ఎక్కువగా వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉండి, 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీఅండ్‌సీ) 15 శాతానికంటే మించిన ఎలక్ట్రిక్ డివిజన్లలో పాత మీటర్లలో స్థానంలో కొత్తగా ప్రీపెయిడ్ సౌకర్యం ఉన్న స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► అలాగే 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు 25 శాతం మించిన ఎలక్ట్రికల్ డివిజన్లలో కూడా స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► బ్లాక్ స్థాయి, ఆపైస్థాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ తగిన కారణాలు చూపి ఈ కాలవ్యవధిని రెండుసార్లు మాత్రమే పొడిగించవచ్చు. ఒక్కో విడత ఆరు నెలల కంటే ఎక్కువగా పొడిగింపు ఉండరాదు. ► ఇతర అన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లను 2025 మార్చి వరకు అమర్చాలి. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ► అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ సౌకర్యం ఉన్న మీటర్లుగానీ, అడ్వాన్స్డ్ మీటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతి ఉన్న మీటర్లు గానీ అమర్చుతారు. 2022 డిసెంబర్ నాటికి ఈ మీటర్లను అమర్చాలి. ► 50 శాతం కంటే ఎక్కువగా వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉండి, 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు(ఏటీఅండ్‌సీ) 15 శాతాని కంటే మించిన ఎలక్ట్రిక్ డివిజన్లలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, 25 శాతానికి మించి నష్టాలు ఉన్న ఇతర అన్ని ఎలక్ట్రికల్ డివిజన్లలో పాత మీటర్లలో స్థానంలో డిసెంబర్ 2023 నాటికి కొత్తగా మీటర్లు అమర్చాలి. ఇతర ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి మీటర్లు అమర్చాలి. -
Andhra Pradesh: రైతుకు ఫుల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీ విధానం, స్మార్ట్ మీటర్లు అమర్చడం ద్వారా కనిపిస్తున్న ఫలితాలపై రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న శ్రీకాకుళం జిల్లాలో ఈ దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రతి నెలా నేరుగా రైతుల ఖాతాల్లోనే బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. తమ చేతుల మీదుగా విద్యుత్తు సంస్థలకు బిల్లులు చెల్లిస్తూ ధీమాగా నాణ్యమైన కరెంట్ ఉచితంగా పొందుతున్నారు. తమ ఖాతాల్లోనే నేరుగా ప్రభుత్వం నుంచి విద్యుత్తు సబ్సిడీ మొత్తం జమ అవుతుండటం, వారే నేరుగా బిల్లులు చెల్లిస్తుండటంతో నాణ్యమైన విద్యుత్తు సేవల కోసం ప్రశ్నించే హక్కు లభించిందని రైతులు పేర్కొంటున్నారు. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులున్నా, ఎక్కడైనా లో వోల్టేజీ సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే నిలదీసే వీలుంది. మరోవైపు విద్యుత్తు సంస్థల్లోనూ జవాబుదారీతనం పెరిగింది. డిజిటల్ మీటర్లు అమర్చడం వల్ల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పర్యవేక్షించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిద్ధమవుతున్నారు. 26 వేల పంపుసెట్లకు మీటర్లు.. వైఎస్సార్ వ్యవసాయ ఉచిత విద్యుత్తు పథకాన్ని మరింత జవాబుదారీతనంతో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించనున్నారు. వ్యవసాయ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేసే విధానాన్ని ఖరీఫ్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడాదిగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం మంచి ఫలితాలనిచ్చింది. ప్రతి నెలా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్మును జమ చేసింది. ఆ తర్వాత ఈ మొత్తం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఖాతాకు అందింది. ఈ విధానంలో మరింత జవాబుదారీతనంతో విద్యుత్ సరఫరా జరిగినట్టు పరిశీలనలో తేలింది. జిల్లాలో మొత్తం 26 వేల పంపుసెట్లకు మీటర్లు అమర్చారు. శ్రీకాకుళం డివిజనలో 10, టెక్కలి, పాలకొండ డివిజన్లలో 8 వేల చొప్పున పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. నాణ్యమైన మీటర్లు.. విద్యుత్ వినియోగాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన డివైజ్ లాంగ్వేజ్ మెసేజ్ స్పెసిఫికేషన్ (డీఎల్ఎంఎస్) మీటర్ల వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్తు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. దేశీయంగా తయారైన ఈ మీటర్లను టెండర్ ప్రక్రియ ద్వారా ముందే సమకూర్చుకున్నారు. టెస్టింగ్ లేబొరేటరీల్లో వీటిని పరీక్షించారు. నాణ్యమైన పాలీ కార్బొనేట్ మెటీరియల్‌తో తయారు చేయడం వల్ల ఇవి అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకున్నాయి. వర్షాకాలంలోనూ ఎలాంటి విద్యుత్ షాక్‌లు, షార్క్ సర్క్యూట్ లాంటివి నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఇక స్మార్ట్ మీటర్లు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ క్షేతాల్లో స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు డిస్కమ్‌లు ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచాయి. జూలైలో ఈ ప్రక్రియ తుదిదశకు చేరుకునే వీలుంది. ఈ మీటర్ల ద్వారా లోడ్ తెలుసుకుని తగిన సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం స్మార్ట్ మీటర్ ద్వారా ప్రధాన కార్యాలయం పర్యవేక్షించే వీలుంటుంది. దీంతో జవాబుదారీ తనం పెరుగుతుంది. 32 యాంప్స్ సామర్థ్యం గల ఫ్యూజ్లను అమరుస్తారు. వీటి ద్వారా 20 అశ్వశక్తి సామర్థ్యం (హెచ్‌పీ) విద్యుత్ లోడ్ వాడుకోవచ్చు. అంటే రైతు 20 హెచ్‌పీ మోటార్ అమర్చుకున్నా అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే ఉండదు. స్మార్ట్ మీటర్ వీలుకాని చోట ఇన్ఫ్రారెడ్ రీడింగ్ (ఐఆర్ పోర్ట్) పద్ధతిలో రీడింగ్ తీస్తారు. ఈ క్రమంలో డీఎల్ఎంఎస్ మీటర్ విద్యుత్ ప్రసరణ తీరుతెన్నులను అర్థమయ్యే భాషలోకి మార్చి ఐఆర్ విధానానికి తెలియచేస్తుంది. లో వోల్టేజీ ఉంటే పసిగట్టి హెచ్చరిస్తుంది. 300 ఎంఎం వెడల్పు, 700 ఎంఎం పొడవుతో మైల్డ్ స్టీల్‌తో తయారయ్యే మీటర్‌కు గాల్వనైజ్డ్ ఎర్త్ కూడా ఇస్తారు. అందువల్ల ఎలాంటి షాక్‌లకు అవకాశం లేకుండా పూర్తి భద్రతతో ఉంటుందని అధికారులు వివరించారు. -
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ కాలితే.. బీపీ పెరగడం ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు కాలిపోతే వినియోగదారుల నుంచే వాటి విలువను ఆరేళ్ల కింద ఉన్న అధిక ధరలతో వసూలు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయం తీసుకుంది. మీటర్ వ్యయాన్ని వినియోగదారుల నెలవారీ విద్యుత్ బిల్లులో కలిపి వసూలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్‌కు రూ.8,687, త్రీఫేజ్ ప్రీపెయిడ్ మీటర్‌కు రూ.11,279 వ్యయాన్ని జీఎస్టీతో కలిపి వసూలు చేయాలని అన్ని సర్కిళ్ల పర్యవేక్షక ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. 4 రెట్లు అధిక వ్యయం గత కొంతకాలంగా బహిరంగ మార్కెట్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా తగ్గిపోయాయి. 2017 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) నిర్వహించిన టెండర్లలో రూ.2,503కే సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్ విక్రయించడానికి ఐటీఐ లిమిటెడ్ అనే కంపెనీ ముందుకు వచ్చింది. అంతకుముందు టెండర్లలో రూ.2,722కే ఈ మీటర్‌ను విక్రయించడానికి ఎల్అండ్టీ సంస్థ బిడ్ దాఖలు చేసింది. దేశంలోని విద్యుత్ వినియోగదారులందరికీ దశలవారీగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో వీటికి డిమాండ్ భారీగా పెరిగిపోయి ధరలు ఇంకా పతనం అవుతున్నాయి. మరోవైపు కాలిపోయిన మీటర్ల వ్యయాన్ని వినియోగదారుల నుంచి 6 ఏళ్ల కింద ఉన్న నాలుగైదు రెట్ల అధిక ధరలతో వసూలు చేయాలని టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పరిశ్రమలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను టీఎస్ఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం దాదాపు 20 వేల మీటర్లను సింగిల్ ఫేజ్ మీటర్‌కు రూ.8,687, త్రీఫేజ్ మీటర్‌కు రూ.11,279 చెల్లించి ఆరేళ్ల కింద టెండర్ల ద్వారా కొనుగోలు చేసింది. వీటిలో కొన్ని రిజర్వులో ఉన్నాయి. ఎక్కడైనా స్మార్ట్‌మీటర్ పాడైతే... గతంలో అధిక ధరలకు కొన్నవాటినే బిగి స్తున్నామని, సంస్థ నిబంధనల ప్రకారం ఈ ధరలనే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నట్టు ఓ అధికారి వివరించారు. కొత్తగా ప్రీపెయిడ్ మీటర్లు కొనుగోలు చేసే వరకు ఈ పాత ధరలే కొనసాగుతాయని పేర్కొంటున్నారు. ఈ అంశంపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి వివరణ కోసం ‘సాక్షి’ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. చదవండి: హైదరాబాద్ ఐఎస్బీ.. మరో ఘనత కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి.. -
ఎక్కడి నుంచైనా స్విచ్చాఫ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వృథాను అరికట్టేందుకు వీలుగా హైటెక్ ఫీచర్లతో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో ఓ క్లిక్ ఇస్తే సరి.. ఆఫీస్‌లోని మెయిన్ స్విచ్ ఆగిపోతుంది. మళ్లీ మీరు ఆన్ చేసే వరకూ ఏ లైటూ వెలగదు. ఈ తరహా టెక్నాలజీని ఏపీ విద్యుత్ సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. మూడేళ్లలో వినియోగదారులకూ అందుబాటులోకి తీసుకురానున్నారు. హైటెక్ స్మార్ట్ మీటర్ పనితీరు ఇలా.. - స్మార్ట్ మీటర్లో ఓ ఎలక్ట్రానిక్ చిప్ అమరుస్తారు. మీ సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే యాప్‌కు చిప్ సిగ్నల్స్ పంపుతుంది. ఇంకా చెప్పాలంటే రిమోట్‌లా పనిచేస్తుంది. - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారంగా పనిచేసే చిప్‌కు ఆఫీస్‌లో ప్రత్యేకంగా ఇంటర్నెట్ అవసరం లేదు. మీ మొబైల్లో నెట్ సౌకర్యం ఉంటే చాలు. - మొబైల్ యాప్ ఓపెన్ చెయ్యగానే స్మార్ట్ మీటర్ దగ్గర చిప్ ఆఫీస్‌లో కరెంట్ పరిస్థితిని తెలియజేస్తుంది. విద్యుత్ ఉందా? లేదా? అనే విషయం ఇట్టే తెలుసుకోవచ్చు. - ఆఫీస్‌లో ఎంత లోడ్ ఉందో చిప్ సమాచారమిస్తుంది. లోడ్‌ను బట్టి ఏయే ఉపకరణాలు ఆన్‌లో ఉన్నాయనే విషయాలు గమనించవచ్చు. - అనవసరంగా ఉపకరణాలు వెలుగుతుంటే మొబైల్ యాప్‌లో ఆఫ్ బటన్ క్లిక్ చేస్తే మెయిన్ ద్వారా విద్యుత్ ఆగిపోతుంది. ఎప్పటి నుంచి... ? - హైటెక్ స్మార్ట్ మీటర్ల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఏప్రిల్‌లో టెండర్లు పిలిచే వీలుందని అధికారులు చెప్పారు. - ఒక్కో మీటర్ రూ. 4 నుంచి రూ. 7 వేల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. - అతి తక్కువ ధరకు అమర్చే సంస్థనే ఎంపిక చేయాలనే లక్ష్యంతో విద్యుత్ సంస్థలున్నాయి. - ప్రక్రియ పూర్తయి, మీటర్ల తయారీ జరిగితే మే నాటికి ప్రభుత్వ కార్యాలయాలకు, వచ్చే మూడేళ్లలో వినియోగదారులకూ హైటెక్ స్మార్ట్ మీటర్లు బిగించే వీలుంది. ఇంకా ఉపయోగాలేంటి - టైమర్ సౌకర్యం కూడా స్మార్ట్ మీటర్లో ఉంటుంది. అంటే ఎప్పుడు లైట్లు ఆగిపోవాలో యాప్ ద్వారా టైం సెట్ చేసుకుంటే సరిపోతుంది. - ఏ రోజున ఎంత విద్యుత్ వాడుకోవాలనే విషయం ఇక మన చేతుల్లోనే ఉంటుంది. యాప్‌లో ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే వాడకం పరిమితి తర్వాత విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల అధిక బిల్లులను నియంత్రించే వీలుంది. - నెలకు ఎంత బిల్లు వస్తుందనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. నెలవారీ బిల్లును కూడా యాప్ ద్వారానే ఆటోమేటిక్‌గా చెల్లించుకునే వీలుంది. బ్యాంక్, పేటీఎం, ఇతర యాప్‌లకు లింక్ అయితే సరిపోతుంది. - కరెంట్ హెచ్చు తగ్గుల వివరాలూ స్మార్ట్ మీటర్ ద్వారా రికార్డవుతాయి. నాణ్యమైన విద్యుత్ అందనప్పుడు, అంతరాయాల వల్ల ఉపకరణాలు దెబ్బతిన్నప్పుడు పంపిణీ సంస్థను ప్రశ్నించేందుకు కచ్చితమైన ఆధారాలుంటాయి. -
‘స్మార్ట్’గా దోచేద్దాం!
విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సర్కారు సిద్ధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య నేత ఓ ప్రైవేటు కంపెనీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. సదరు సంస్థకు కోట్ల రూపాయలు కట్టబెట్టడం, కమీషన్ల రూపంలో భారీయెత్తున ముడుపులు బొక్కేయడమే దీని వెనుక అసలు రహస్యమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌ల పరిధిలో మీటర్ రీడింగ్ తీసే దాదాపు 4,500 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ల రీడింగ్‌లో అవకతవకలు, క్షేత్రస్థాయి సిబ్బంది యజమానులతో కుమ్మక్కై తక్కువ రీడింగ్ నమోదు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. అవకతవకలు అరికట్టాలంటే స్మార్ట్ మీటర్లు అవసరమని అధికారులు నివేదించారు. 500 యూనిట్లు దాటుతున్న వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించాలని డిస్కమ్‌లు సిఫారసు చేశాయి. వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లే ఈ కేటగిరీలో ఉన్నాయి. ఇలాంటి వినియోగదారులు కేవలం 83,110 మంది మాత్రమే ఉంటారు. అయితే ముడుపులపై కన్నేసిన ముఖ్యనేత గృహ వినియోగానికీ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. -
స్మార్ట్‌గా చెక్
స్మార్ట్ మీటర్ల ప్రయోగంతో సిబ్బంది అక్రమాలకు అడ్డుకట్ట జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ సరికొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్ల ‘షాక్’కు ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. నెలవారీ మీటర్ రీడింగ్ లెక్కింపులో అక్రమాలకు పాల్పడుతున్న విద్యుత్ సిబ్బందికి స్మార్ట్ మీటర్లు కొరకరాని కొయ్యగా మారాయి. ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురావడం వల్ల విద్యుత్ శాఖ రెవెన్యూ ఒక్క నెలలోనే రూ.40 లక్షలకు పెరిగిందంటే ఆశ్చర్యం కలగక మానదు. దీనిని బట్టి గమనిస్తే విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ సమయంలో వినియోగదారులతో ఏ స్థాయిలో లాలూచీ పడుతున్నారో ఇట్టే తెలిసిపోతుంది. నల్లగొండ, న్యూస్‌లైన్, జిల్లాలో గృహ, వ్యవసాయం, పరిశ్రమలకు కలిపి మొత్తం 5 లక్షల 40 వేల విద్యుత్ కనెక్షన్లున్నాయి. అయితే స్మార్ట్ మీటర్లు మాత్రం విద్యుత్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న మండల, పట్టణ కేంద్రాల్లోనే అమరస్తున్నారు. ఇప్పటి వరకు 2.33 లక్షల స్మార్ట్ మీటర్లు గృహాలకు అమర్చారు. దీంట్లో 1.72 లక్షల మీటర్ల నుంచి ఐఆర్ పోర్టు (ఇన్ఫ్రా పోర్టు రీడింగ్) మిషన్ ద్వారా మీటర్ రీడింగ్ నమోదు చేస్తున్నారు. అన్ని కేటగిరీల్లో కలుపుకుని నెలవారీ బిల్లుల వసూళ్లు రూ.36 కోట్లు ఉండగా..ఐఆర్ పోర్టు మిషన్ల ద్వారానే నెలకు రూ. పది కోట్ల వరకు బిల్లులు నమోదు చేస్తున్నారు. అంటే విద్యుత్ శాఖ నెలవారీ రెవెన్యూలో పది శాతం ఐఆర్ పోర్టు విధానం ద్వారానే వసూలవుతోంది. పెరిగిన ఆదాయం.. స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఆరు మాసాల క్రితమే ప్రవేశపెట్టారు. కానీ సీఎండీ రిజ్వీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ విధానం అత్యంత పకడ్బందీగా అమలవుతోంది. మూడు మాసాల నుంచి పట్టణ, మండల కేంద్రాల్లో గృహాలకు స్మార్ట్ మీటర్లు అమర్చడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఈ మీటర్లు అమర్చి ఐఆర్‌పోర్టు మిషన్ల సహాయంతో మీటర్ రీడింగ్ నమోదు చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఏప్రిల్‌లో విద్యుత్ శాఖకు రూ.75 లక్షల 27వేల రాబడి వస్తే...మే నెలకు వచ్చే సరికి అది కాస్తా రూ.కోటి 16 లక్షలకు పెరిగింది. నెల వ్యవధిలో విద్యుత్ శాఖ రాబడి రూ.40 లక్షల 73 వేలకు పెరిగిందన్నమాట. ఈ విధానాన్ని అమలు చేయడంలో హుజూర్నగర్ డివిజన్ ప్రథమ స్థానంలో ఉండగా, భువనగిరి, దేవరకొండ డివిజన్లు చివరి స్థానంలో ఉన్నాయి. హుజూర్నగర్ డివిజన్లో ఒక నెలలో రూ.12.58 లక్షల ఆదాయం పెరిగింది. దేవరకొండలో రూ.2.37 లక్షలు, భువనగిరిలో రూ.3.16లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ డివిజన్లలో స్మార్ట్ మీటర్ల అమర్చే కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. దీనిపై అధికారులు పలు సమీక్షల్లో హెచ్చరించినా మార్పు కనబడటం లేదు. అక్రమాలకు తెర గతంలో విద్యుత్ శాఖ వినియోగించిన మెకానిక్ మీటర్లు సిబ్బందికి కాసులు కురిపించాయి. ఈ మీటర్ల సహాయంతో మీటర్ రీడింగ్‌కు వెళ్లినప్పుడు సిబ్బంది, వినియోగదారులతో లాలూచీ పడి యూనిట్ల సంఖ్యను తక్కువగా నమోదు చేయడం జరిగేది. ఉదాహరణకు ఒక సర్వీసులో 200 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే..దానిని 199 యూనిట్లుగా నమోదు చేస్తూ అక్రమాలకు పాల్పడిన సంఘటనలు విద్యుత్ శాఖ దృష్టికి వెళ్లాయి. దీనివల్ల నెలవారీ బిల్లుల్లో లక్షల రూపాయల సొమ్ము సిబ్బంది జేబుల్లోకి వెళుతున్నట్లు విద్యుత్ అధికారుల నిఘాలో వెల్లడైంది. దీనికి అడ్డుక ట్ట వేసేందుకు స్మార్ట్ మీటర్లు, ఐఆర్ పోర్ట్ విధానాన్ని తెరమీదకు తెచ్చారు. కలిసొస్తున్న సమయం.. అక్రమాలు నియంత్రించడంతో పాటు విద్యుత్ సిబ్బందికి సమయం కూడా కలిసొస్తుంది. గతంలో మీటర్లో నమోదైన రీడింగ్‌ను సిబ్బంది తమ చేతి సహాయంతో మెకానిక్ మీటర్లపై నమోదు చేయడం జరిగేది. కానీ ప్రస్తుతం అలా కాకుండా ఐఆర్ పోర్టు మిషన్లు మీటరు ఎదుట పెడితే దానంతట అదే మీటర్ రీడింగ్ నమోదు చేస్తుంది. దీంతో గతంలో విద్యుత్ శాఖ షెడ్యూల్ ప్రకారం బిల్లులు ప్రతి నెల నమోదు చేస్తున్న 16,17 తేదీల నుంచి ప్రస్తుతం 13,14 తేదీలలోపే బిల్లింగ్ ప్రక్రియ ముగుస్తుంది.