ఇష్టానుసార టెండర్లకు చెక్‌ | TDP Illegal Tenders To Swiss Companies In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇష్టానుసార టెండర్లకు చెక్‌

Published Tue, Jul 9 2019 5:20 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

TDP Illegal Tenders To Swiss Companies In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఇక ఇష్టానుసారంగా టెండర్ల ఖరారు కుదరదు. స్విస్‌ చాలెంజ్‌ ముసుగులో అస్మదీయ సంస్థలకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టడం లాంటి అనైతిక చర్యలకు తెర దించుతూ ఈమేరకు చట్టంలోని లొసుగులను సవరించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదేళ్ల పాలనలో ఎడాపెడా టెండర్లను ఖరారు చేయడమే కాకుండా అంచనాలను భారీగా పెంచేసి కమీషన్లు కాజేయటంపైనే టీడీపీ దృష్టి పెట్టింది. సూటిగా చెప్పాలంటే గత సర్కారు రాష్ట్ర ఖజానా నుంచే భారీ దోపిడీకి పాల్పడింది.

ఈ నేపథ్యంలో టెండర్ల విధానంలో సమూల మార్పులు తెచ్చి ప్రజాధనాన్ని ఆదా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే టెండర్ల స్క్రూటినీ కోసం జ్యుడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే చట్ట సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబలింగ్‌ చట్టం(ఏపీఐడీఈ )–2001లో సవరణలకు మౌలిక సదుపాయాలు, పరిశ్రమలశాఖ కసరత్తు ప్రారంభించింది.
 
సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలకు సర్వ హక్కులు కల్పించిన బాబు సర్కారు
స్విస్‌ చాలెంజ్‌ ముసుగులో రాజధాని రైతుల నుంచి కారు చౌకగా తీసుకున్న భూములను సింగపూర్‌ ప్రైవేట్‌ సంస్ధలకు అప్పగించేందుకు వీలుగా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు తెచ్చింది. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో సీఎస్‌ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆధారిటీ తొలుత ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సి ఉండగా టీడీపీ హయాంలో మాత్రం సింగపూర్‌ కంపెనీల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తరువాత తాపీగా సీఎస్‌ వద్దకు పంపించడం గమనార్హం.

దీన్ని హైకోర్టు తప్పుబట్టడంతో ఏకంగా సీఎస్‌ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అధారిటీనే రద్దు చేస్తూ ఏపీఐడీఈ–2001 చట్టంలో చంద్రబాబు సర్కారు నాడు సవరణలు చేసింది. సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలు కోరిన విధంగా రాజధాని భూములపై సర్వహక్కులు కల్పిస్తూ మరోసారి కూడా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ సింగపూర్‌ కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు చేసిన సవరణలన్నింటినీ ఏపీఐడీఈ చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలను తీసుకురానున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేకు చట్టం
రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌  నిర్ణయించారు. ప్రస్తుతం భూములపై ఉన్న హక్కులు ఊహాజనితమేనని, వాస్తవ హక్కులు కాదని, దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకరికి చెందిన భూమిని మరొకరు కాజేయడం, తప్పుడు హక్కు పత్రాలను సృష్టించడం లాంటి చర్యలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో భూములన్నీ రీ సర్వే కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర టైటిల్‌ను కల్పించేందుకు వీలుగా చట్టం తీసుకురానున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ చట్టంపై కసరత్తు ప్రారంభించారు. భూములన్నీ సర్వే చేసి వాస్తవ యజమానులకు శాశ్వతమైన హక్కు కల్పించడమే దీని లక్ష్యమని ఆ అధికారి వివరించారు. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల్లో ల్యాండ్‌ సర్వే అసిస్టెంట్ల నియామకాలను చేపడుతున్నట్లు తెలిపారు. భూములు రీ సర్వే చేసి శాశ్వత హక్కు  కల్పించిన తరువాత సివిల్‌ న్యాయస్థానాలు ప్రశ్నించకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు తెలిపాయి.  

జ్యుడిషియల్‌ స్క్రూటినీ చేసేందుకు వీలుగా..
ఏపీఐడీఈ చట్టం ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపట్టే ప్రాజెక్టులకే వర్తిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల పనులన్నింటినీ కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చట్టంలో సవరణలను ప్రతిపాదించనున్నారు. మరోవైపు ఇదే చట్టంలో టెండర్లను జ్యుడీషియల్‌ స్క్రూటినీ చేసేందుకు వీలుగా జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ కొత్తగా ప్రొవిజన్‌ చేర్చనున్నారు. దీంతో ఇక పీపీపీ ప్రాజెక్టులతో సహా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల పనుల
టెండర్లను పూర్తి పారదర్శకతతో జ్యుడీషియల్‌ స్క్రూటినీ చేసిన అనంతరమే ఖరారు చేయనున్నారు. తద్వారా టెండర్లలో దోపిడీకి ఆస్కారం లేకుండా రాష్ట్ర ఖజానాకు నిధులు ఆదా అవుతాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. టెండర్ల ఖరారుకు ముందు జ్యుడీషియల్‌ కమిషన్‌ పరిశీలనకు పంపిస్తారు. కమిషన్‌ ఏమైనా మార్పులు చేర్పులు సూచిస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాకే టెండర్లను ఖరారు చేస్తారని ఆ ఉన్నతాధికారి వివరించారు. ఈనెల 11వతేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అప్పగించేందుకు వీలుగా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు తెచ్చింది.

స్విస్‌ చాలెంజ్‌ విధానంలో సీఎస్‌ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆధారిటీ తొలుత ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సి ఉండగా టీడీపీ హయాంలో మాత్రం సింగపూర్‌ కంపెనీల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తరువాత తాపీగా సీఎస్‌ వద్దకు పంపించడం గమనార్హం. దీన్ని హైకోర్టు తప్పుబట్టడంతో ఏకంగా సీఎస్‌ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అధారిటీనే రద్దు చేస్తూ ఏపీఐడీఈ–2001 చట్టంలో చంద్రబాబు సర్కారు నాడు సవరణలు చేసింది. సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలు కోరిన విధంగా రాజధాని భూములపై సర్వహక్కులు కల్పిస్తూ మరోసారి కూడా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ సింగపూర్‌ కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు చేసిన సవరణలన్నింటినీ ఏపీఐడీఈ చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలను తీసుకురానున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేకు చట్టం
రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌  నిర్ణయించారు. ప్రస్తుతం భూములపై ఉన్న హక్కులు ఊహాజనితమేనని, వాస్తవ హక్కులు కాదని, దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకరికి చెందిన భూమిని మరొకరు కాజేయడం, తప్పుడు హక్కు పత్రాలను సృష్టించడం లాంటి చర్యలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో భూములన్నీ రీ సర్వే కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర టైటిల్‌ను కల్పించేందుకు వీలుగా చట్టం తీసుకురానున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ చట్టంపై కసరత్తు ప్రారంభించారు. భూములన్నీ సర్వే చేసి వాస్తవ యజమానులకు శాశ్వతమైన హక్కు కల్పించడమే దీని లక్ష్యమని ఆ అధికారి వివరించారు. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల్లో ల్యాండ్‌ సర్వే అసిస్టెంట్ల నియామకాలను చేపడుతున్నట్లు తెలిపారు. భూములు రీ సర్వే చేసి శాశ్వత హక్కు  కల్పించిన తరువాత సివిల్‌ న్యాయస్థానాలు ప్రశ్నించకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement