సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కాస్త ప్రజా భవన్‌గా మారింది. ప్రజా సందర్శనకు అనుమతి ఇస్తూ.. వాటి ముందు ఉన్న బారికేడ్లను సైతం తొలగించారు. ఆపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ప్రజా భవన్‌ను కేటాయించారు. అయితే కేసీఆర్ హయాంలో దుబార జరిగిందని.. కాబట్టి హంగులు ఆర్బాటాలకు పోకుండా ఉంటామని ప్రకటించుకుంది రేవంత్ సర్కార్. కానీ, ప్రజా భవన్ రిపేర్ల కోసం చేస్తున్న ఖర్చుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ప్రజా భవన్‌లో టాయిలెట్ల రిపేర్లు కోసం.. అలాగే దోమ తెరల కోసం రూ.35 లక్షలకు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచినట్లు తెలుస్తోంది. మరో టెండర్‌లో భాగంగా జిమ్ రూంలో పొడుగు అద్దాలు, గన్‌మెన్ రూముల కోసం రూ.28.70 లక్షలకు టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించిన ప్రతుల పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ ప్రచారంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment