రోడ్డు పక్కకు జారిన వ్యాన్, బస్సు
ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు వ్యాన్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు రోడ్డు మార్జిన్‌లోని పొలాల్లోకి వెళ్లింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని రేపూడి గ్రామశివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హిందూపురం నియోజకవర్గం మడకశిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో విజయవాడ వెళు తోంది. నంద్యాల నుంచి బట్టల లోడుతో విజయవాడ వెళుతున్న వ్యాన్‌కు మండలంలోని రేపూడి గ్రామశివారులో ఎదురుగా ఆటో రావడంతో షడన్ బ్రేకు వేసి రోడ్డు పక్కకు వచ్చాడు. అదే సమయంలో వెనుకగా వస్తున్న ఆర్టీసీ బస్సు వ్యాన్‌ను ఢీకొని రోడ్డు పక్కగా ఉన్న పొలాల్లోకి జారిపోయింది.
సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులు బస్సు డ్రైవర్లు పాపయ్య, నాగరాజులకు ఎటువంటి ప్రమాదం సంభవించ లేదు. వ్యాను డ్రైవర్‌కు ఏ ప్రమాదం జరగలేదు. దీంతో స్థానికులు బస్సులోని ప్రయాణికులను అటుగా వస్తున్న మరో బస్సులో విజయవాడకు పంపించి వేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment