సాక్షి, అమరాతి : రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేందుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బస్సులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అయితే ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ బుకింగ్‌కు అవకాశం కల్పించింది. కేవలం సూపర్ లగ్జరీ సర్వీసులకు మాత్రమే కాకుండా ఆర్డినరీ బస్సులకు కూడా ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. బస్సు సర్వీసుల రూట్లపై ఏపీఎస్ ఆర్టీసీ పూర్తి వివరాలను ప్రకటించనుంది.
వైరస్ వ్యాప్తి చెందకుండా సగం సీట్లు మాత్రమే నింపి బస్సు సర్వీసులు నడపడానికి అనుమతివ్వాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆర్టీసీకి పలు సూచనలు చేశారు. ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని, ఒక్కో బస్సులో 20 మందినే అనుమతించాలని సీఎం స్పష్టం చేశారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి, ప్రయాణికులందరూ మాస్క్ ధరించే విధంగా విధివిధానాలు రూపొందించాలని సీఎం జగన్ ఇదివరకే ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment