
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ : రాయచోటి నుంచి తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సంబేపల్లి మండలం దేవపట్ల బస్‌స్టాప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. బస్సు డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో బస్సు వెంటనే ఆపారు. ప్రయాణీకులందరూ దిగిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ప్రయాణీకులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment