
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. పోలవరం అంశంపై నితిన్ గడ్కరీతో శుక్రవారం ఆయన భేటీ అయి వినతిపత్రం ఇచ్చారు.
రైల్వే బోర్డు చైర్మన్‌తో వెలగపల్లి భేటీ: కాగా, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లొహానీతో శుక్రవారం భేటీ అయ్యారు. తిరుపతిలో రెండు, సూళ్లూరుపేటలో ఒక సబ్ వేల నిర్మాణంపై విన్నవించారు.