ఫాస్ట్ ట్యాగ్ చరిత్రలో రికార్డు స్థాయి వసూళ్లు..! | 148 Percent Jump in FASTag Revenue From 2021 April To 2022 January | Sakshi
Sakshi News home page

ఫాస్ట్ ట్యాగ్ చరిత్రలో రికార్డు స్థాయి వసూళ్లు..!

Published Thu, Feb 10 2022 3:06 PM | Last Updated on Thu, Feb 10 2022 3:06 PM

148 Percent Jump in FASTag Revenue From 2021 April To 2022 January - Sakshi

న్యూఢిల్లీ: 2019-20 ముందు సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్ 2021 నుంచి జనవరి 2022 మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా సేకరించిన ఆదాయం 148% పెరిగినట్లు కేంద్ర రోడ్డు & రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఎఐ) 2016లో ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో ఈ ఏడాది ₹26,622.93 కోట్ల టోల్ వసూలైంది.

2022-23 సంవత్సరంలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ సేకరణ రూ.35,000 కోట్ల వరకు పెరుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఎన్‌హెచ్ఎఐ 2019-20లో ₹10,728.52 కోట్లు ఆర్జించింది. ఈ టోల్ వసూళ్లు 2020-21లో ₹20,837.08 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది. జనవరి 31 వరకు 45 మిలియన్లకు పైగా ఫాస్ట్ ట్యాగ్‌లు జారీ చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం పార్లమెంటులో తెలిపారు. 2025 నాటికి ₹50,000 కోట్లను టోల్ ద్వారా సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామానే తెలిపారు.

ఫిబ్రవరి 5 నాటికి 1.2 మిలియన్ ఫాస్ట్ ట్యాగ్ రీఫండ్ కేసులను జనవరి 202 నుంచి పరిష్కరించినట్లు గడ్కరీ రాజ్యసభకు తెలిపారు. 2020-21 వరకు సుమారు ₹3,36,661 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులను మంత్రిత్వ శాఖ మంజూరు చేసినట్లు గడ్కరీ ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2020లో జాతీయ రహదారులపై జరిగిన 1,16,496 రోడ్డు ప్రమాదాల్లో 47,984 మంది మరణించారని ఆయన తెలిపారు.

(చదవండి: శాల‌రీ రూ.7.3ల‌క్ష‌లు!! విద్యార్ధుల‌కు టీసీఎస్ బంప‌రాఫ‌ర్!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement