న్యూఢిల్లీ: దేశంలో 2021 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. 2020లో 3,66,138 ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా 2021లో ఇవి 4,12,432కు చేరాయని వివరించింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిపారు.
ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు ఇంజనీరింగ్ నిపుణుల సూచనల ప్రకారం రహదారుల పునర్నిర్మాణం, రహదారి భద్రతను పటిష్టం చేయడం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఏ ఒక్క జాతీయ రహదారిని కూడా మూసివేసే ప్రతిపాదన లేదని తెలిపారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ వద్ద ఇప్పటి వరకు 5,215 వాహనాలను తుక్కుగా మార్చినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment