దేశ రోడ్డు రవాణా వ్యవస్థలో కీలకమైన ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పనులు 2023, మార్చి నాటికి పూర్తి కానునట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి కేంద్రం రూ.98 వేల కోట్లతో ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులను 2019 నుంచి చేపడుతుంది. ఈ ప్రాజెక్టు పనులను కేంద్రం మంత్రి గడ్కరీ తనిఖీ చేశారు. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే, ఈ రహదారి మీద నితిన్ గడ్కరీ స్పీడ్ టెస్ట్ నిర్వహించారు.
నిర్మాణ దశలో ఉన్న ఈ రహదారి మీద 170 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లారు. రత్లామ్ జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులను పరిశీలించే సమయంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అకస్మాత్తుగా తన పక్కనున్న వ్యక్తితో కారు వేగాన్ని పెంచామని సూచించారు.. దీంతో ఆ వ్యక్తి వెంటనే కారును 170 కి.మీ వేగంతో తీసుకెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎంపీ లోకేంద్ర పరాశర్ ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గడ్కరీ ఇంతకు ముందు హెలికాప్టర్ లో ఈ ప్రాంతాన్ని తనిఖీ చేశారు.(చదవండి: అమ్మకానికి విరాట్ కోహ్లి కారు ? ధర ఎంతంటే)
#नया_भारत
केंद्रीय मंत्री @nitin_gadkari जी ने रतलाम जिले से गुजरने वाले दिल्ली-मुंबई एक्सप्रेस वे पर 170 किमी प्रति घंटे की रफ्तार से कार चलवाकर लिया स्पीड टेस्ट @BJP4MP pic.twitter.com/Xq5b4jupqs
— लोकेन्द्र पाराशर Lokendra parashar (@LokendraParasar) September 16, 2021
ఇప్పటివరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల ప్రాజెక్టుల కోసం రూ.1.50 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రోడ్డు ప్రాజెక్టుల కోసం మరో లక్ష కోట్ల రూపాయలు మంజూరు చేయబోతున్నాను అని ఆయన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపినట్లు గడ్కరీ పేర్కొన్నారు. 45 నిమిషాలకు పైగా కొనసాగిన ఈ తనిఖీలో గడ్కరీతో పాటు ఎంపిలు గుమాన్ సింగ్ దామోర్, అనిల్ ఫిరోజియా, సుధీర్ గుప్తా, రత్లాం జిల్లా ఎమ్మెల్యే చేతన్యా కశ్యప్ ఉన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ వే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల గుండా వెళుతుంది, వీటిలో రత్లామ్, మాండ్ సౌర్, ఝబువా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment