న్యూఢిల్లీ: ఆమరణ దీక్ష చేస్తున్న అన్నా హజారే డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. లోక్‌పాల్ ఏర్పాటు సహా 11 డిమాండ్లపై స్పష్టత ఇచ్చినందున ఆమరణ దీక్షను విరమించాలని కోరింది. సోమవారం మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన ఢిల్లీలో దీక్ష చేస్తున్న హజారేను కలిసి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘హజారేతో జరిగిన చర్చల్లో ఆయన డిమాండ్లను అంగీకరిస్తామని చెప్పాం. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌లో చాలా అంశాలను పేర్కొన్నాం. మంగళవారం హజారే దీక్ష విరమిస్తారని అనుకుంటున్నాం’ అని మహాజన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment