'కేజ్రివాల్ అంకుల్... మా కుటుంబాన్ని ఆదుకోండి'
'కేజ్రివాల్ అంకుల్... మా కుటుంబాన్ని ఆదుకోండి'
Published Mon, Jan 13 2014 1:41 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
పేదరికంతో బాధపడుతూ బ్రతకడానికి అష్టకష్టాలు పడుతున్న తమను ఆదుకోవాలని ఓ మైనర్ బాలుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ని అభ్యర్థించారు. లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే సాగించిన ఉద్యమంలో బీహార్ లోని సర్ఫు్ద్దీన్ పూర్ కు గ్రామానికి చెందిన దినేశ్ యాదవ్ 2011లో ఆత్మహుతి చేసుకున్నారు. దాంతో దినేశ్ యాదవ్ మృతితో ఆ కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. కష్టాల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కేజ్రివాల్ ను వేడుకున్నారు. తన తండ్రి మరణం తర్వాత పలువురు నేతలు ఆదుకుంటామని చేసిన హామీల వల్ల ప్రయోజనం లేకుండా పోయింది.
'కేజ్రివాల్ అంకుల్, లోక్ పాల్ బిల్లుకు డిమాండ్ చేస్తూ జరిగిన ఉద్యమంలో మా నాన్న ఆత్మత్యాగానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి మేము పేదరికంతో బాధపడుతున్నాం అని యాదవ్ పెద్ద కుమారుడు 14 ఏళ్ల గుడ్డు అభ్యర్థించారు. మానాన్న మరణం తర్వాత స్కూల్ వెళ్లడం లేదు. తప్పని పరిస్థితిలో తాము కూలీలుగా పనిచేస్తున్నాం' అని గుడ్డు వెల్డడించారు. ఇక ఢిల్లీ ప్రభుత్వం మా బతుకుల్ని బాగు చేస్తుందనే ఒకే ఆశతో బతుకుతున్నాం అని యాదవ్ భార్య మల్ మతియా దేవి అన్నారు. కనీసం ఢిల్లీకి వెళ్లడానికి చార్టీలు కూడా లేవు అన్నారు. దినేష్ మరణంతో ఆయన తల్లి తండ్రులు, భార్య, ఐదుగురు పిల్లలు పరిస్థితి దిక్కు తోచని విధంగా మారింది.
Advertisement