న్యూఢిల్లీ: సీఆర్ఎఫ్ నిధుల కింద రాష్ట్రానికి రూ. 830 కోట్లు మంజురు చేయాలని కేంద్ర రవాణా, రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో నితిన్ గడ్కరీతో తుమ్మల భేటీ అయ్యారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ... చౌటుప్పల్ - కంది వయా ఆమన్గన్, సంగారెడ్డి - చౌటుప్పల్, మెదక్ - ఎల్కతుర్తి, హైదరాబాద్ - కొత్తగూడెం మధ్య 650 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్రం ఒప్పుకుందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.