18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాక
బీచ్‌రోడ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 18వ తేదీన నగరానికి రానున్నారని బీజేపీ నగర అధ్యక్షుడు ఎం. నాగేంద్ర తెలిపారు. నగర పార్టీ కార్యాలయంలో మంగళవారం బీజేపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 70వ స్వాతంత్య్రదిన వేడుకలను పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన తిరంగ యాత్రలో పాల్గొనడానికి గడ్కరీ వస్తున్నారని, దీనికి నగర పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వి.ఎస్.ప్రకాస్ రెడ్డి, నాని, గుండ రఘుబాబు పాల్గొన్నారు.