ఏటా 5లక్షల రోడ్డు ప్రమాదాలు: గడ్కరీ
Published Thu, Mar 9 2017 2:37 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏటా జరిగే సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభలో తెలిపారు. రోడ్డు నిర్మాణ డిజైన్‌లో లోపమే ఇందుకు ప్రధాన కారణంగా గుర్తించామని వివరించారు.
ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను, మరణాలను కనీస స్థాయికి తీసుకురావటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని క్వశ్చన్ అవర్‌లో వెల్లడించారు. ఇందులో భాగంగా జాతీయరహదారులపై ఉన్న గ్రామాలు, పట్టణాల్లో మరిన్ని అండర్ పాస్‌లను, ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని తలపెట్టినట్లు తెలిపారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రభుత్వం 2016-17 కాలంలో రూ. 62, 046 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు.
Advertisement
Advertisement