Ujjaini Mahakali
-
శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని
పరమేశ్వరుడు కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఉజ్జయిని. ఇక్కడ ఉన్నది మహాకాళేశ్వరుడు. మహాకాలుడు అంటే చాలా నల్లనివాడు అని ఒక అర్థం. అలాగే మృత్యువుకే మృత్యువు, కాలానికే కాలం.. అంటే కాలాన్నే శాసించేవాడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి విశిష్టత ఏమిటంటే.. తెల్లవారుఝామున జరిగే అభిషేకం. అది భస్మాభిషేకం. ఆ భస్మం చితాభస్మం. అంటే మహాకాలేశ్వరుడి రూపంలో ఉన్న శివుడికి అప్పుడే కాలిన శవభస్మంతో చేసే అభిషేకం అత్యంత ప్రీతిపాత్రం. దీనికే భస్మహారతి అని పేరు. తెల్లవారుఝామున 3.30 గంటలకు మాత్రమే జరిగే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు పురుషులు మాత్రమే అర్హులు. అదీ ప్రత్యేక వస్త్రధారణతో మాత్రమే. సాధారణంగా జాతకంలో అపమృత్యు దోషాలు ఉన్నవారు, దీర్ఘరోగాలతో బాధపడేవారు, అంతుచిక్కని సమస్యలతో మానసిక వేదన పడుతున్నవారు ఈ భస్మహారతిలో పాల్గొని, ఉపశమనం పొందుతుంటారు.నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిని పూర్వం అవంతీ నగరమనేవారు. సప్తమహానగరాలలో అవంతీనగరం కూడా ఒకటి. ఈ ఉజ్జయిని నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మూలంగా ఎంత ప్రసిద్ధి పొందిందో, మహాకాళికాదేవి వల్ల కూడా అంత ప్రసిద్ధి పొందింది కాబట్టి ఉజ్జయినీ నగరానికి వెళితే ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని, అటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మహాకాళిని కూడా సందర్శించి నేత్రపర్వాన్ని పొందవచ్చు.స్థలపురాణంఉజ్జయినీ నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నలుగురు కొడుకులూ తండ్రికి తగ్గ పుత్రులు. ఆ నగరానికి సమీపంలోని పర్వతం మీద దూషణుడనే రాక్షసుడుండేవాడు. వాడు ఋషి పుంగవుల జపతపాలకు, వైదిక ధర్మానుష్టానానికి ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు. దూషణుడు ఉజ్జయినీ పురప్రజలను కూడా అలాగే భయభ్రాంతులకు గురిచేయసాగాడు. అయితే వేదప్రియుడు మాత్రం ఇవేమీ పట్టకుండా ఒక పార్థివ లింగాన్ని తయారు చేసుకుని, శివదీక్షలో తదేక ధ్యానంలో గడపసాగాడు.దూషణుడు ఒకనాడు వేదప్రియుణ్ణి సంహరించేందుకు ప్రయత్నించగా ఆ లింగం నుంచి మహాశివుడు మహాకాళేశ్వరుడిగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని భస్మం చేశాడు. వేదప్రియుడి భక్తితత్పరతలకు సంతోషించిన మహేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అసహాయులైన, దీనులైన తనవంటి భక్తులను అకాల మృత్యుభయం నుంచి కాపాడేందుకు ఇక్కడే ఉండవలసిందిగా నీలకంఠుడిని వేడుకున్నాడు వేదప్రియుడు. ఆ కోరికను మన్నించిన స్వామి ఆనాటి నుంచి మహాకాళేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగస్వరూపుడిగా ఉజ్జయినీ క్షేత్రంలో కొలువుదీరాడు.మరో గాథఉజ్జయినీ రాజ్యాధిపతి చంద్రసేనుడు ఒకరోజు శివపూజ చేస్తుండగా శ్రీకరుడనే గోపాలుడు అక్కడికి వచ్చాడు. చంద్రసేనుడి శివార్చనా విధానాన్ని గమనించి తానూ అలాగే స్వామికి పూజ చేయాలని భావించిన శ్రీకరుడు, దారిలో ఒక రాతిముక్కను తీసుకుని దాన్నే శివలింగంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజించసాగాడు. ఆ బాలుడు పూజలో నిమగ్నమై ఒక్కోసారి బాహ్యస్మృతిని కూడా కోల్పోయేవాడు. తల్లి ఎంత పిలిచినా పలికేవాడు కాదు. ఒకరోజు పూజలో లీనమై బాహ్యస్మృతి మరిచిన శ్రీకరుని దగ్గర నుంచి అతను శివలింగంగా భావిస్తున్న రాతిముక్కను అతని తల్లి తీసిపారేసింది. స్మృతిలోకి వచ్చిన బాలుడు తల్లి చేసిన పనికి చింతస్తూ శివుణ్టి వేడుకుంటూ ధ్యానం చేశాడు. అప్పుడు శివుడు అతన్ని కరుణించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు.భస్మాభిషేకంఉజ్జయినీ మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకానంతరం చితాభస్మంతో అభిషేకం చేయడం ఇక్కడి విశిష్టత. చితాభస్మం సాధారణంగా అమంగళకరమైనా, స్వామిని తాకడం వల్ల అతి మంగళప్రదమైనదిగా మారుతోంది. భస్మ హారతితోబాటు మరోవిధమైన అర్చన కూడా కాలేశ్వరుడికి జరుగుతుంది. ఇది భస్మాభిషేకం. ఆవుపేడను కాల్చి బూడిద చేసి, మూటగట్టి, దానిని శివలింగం పై భాగాన వేలాడదీసి, అటువంటి మరో మూటతో మెల్లగా కొడుతుంటారు.అప్పుడు భస్మం మహాకాలుడి మీదనేగాక, మొత్తం ఆలయమంతా పరుచుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో నాగసాధువులు రుద్రనమకం చెబుతూ ఢమరుకం, మృదంగం, భేరీలు మోగిస్తూ, శంఖనాదాలు చేస్తారు. ఆ సమయంలో ఆలయంలో ఉన్నవారికి సాక్షాత్తూ కైలాసంలోనే ఉన్నామేమో అనుకునేంతటి అలౌకికానుభూతి కలుగుతుంది.ఇతర విశేషాలుమహాకాళేశ్వరాలయం నేటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షి్ర΄ా(శి్ర΄ా)నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో ఏడు సాగర తీర్థాలు, 28 సాధారణ తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండాలు ఉన్నాయి. ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్థులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాలేశ్వర లింగం. ఇది దక్షిణాభిముఖంగా ఉంటుంది. మహాకాలేశ్వరుడి విగ్రహం పైన ఓంకారేశ్వర లింగం ఉంటుంది. ఆ పైన ఉండేది నాగచంద్రేశ్వర లింగం. ఆలయంలో గణపతి, ΄ార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పుగోడలపై ఉంటాయి. దక్షిణభాగంలో మహాదేవుని వాహనమైన నంది విగ్రహం ఉంటుంది. మహాకాలేశ్వరలింగం స్వయంభూలింగం. ఇది అత్యంత ్ర΄ాచీనమైనది. సృష్టి ్ర΄ారంభంలో బ్రహ్మ శివుడిని ఇక్కడ మహాకాలునిగా కొలువు తీరి ఉండమని ్ర΄ార్థించాడట. బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరానికి ప్రత్యేక శోభను ఇస్తున్నాడని పురాణగాథలు ఉన్నాయి. వేల సంవత్సరాలుగా ఉన్న ఉజ్జయిని మహాకాలుడి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండదీ΄ాలని పిలుస్తారు.కాలభైరవాలయంఉజ్జయిని వెళ్లినవారు ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవుని సందర్శించుకుని, అటు పిమ్మట మహాకాళికా లేదా మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం ఆచారం. కాగా కాలభైరవుడి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేయడం, మామూలుగా గుడికి కొబ్బరికాయ తీసుకు వెళ్లినట్లుగా కాలభైరవుడి ఆలయానికి వెళ్లే భక్తులు మద్యం, కల్లు సీసాలను తీసుకువెళ్లి సమర్పించడం ఆచారం. కాలభైరవార్చన విశిష్ట ఫలప్రదమైనదిగా పేరు పొందింది.ఎలా వెళ్లాలంటే..? హైదరాబాద్‌నుంచి ఉజ్జయినికి నేరుగా రైళ్లున్నాయి. లేదంటే పూణే వెళ్తే అక్కడినుంచి కూడా ఉజ్జయినికి రైళ్లుంటాయి. హైదరాబాద్‌నుంచి జైపూర్ఎక్స్ప్రెస్ ట్రెయిన్ ఎక్కితే సుమారు 19 గంటల్లో ఉజ్జయినిలో దిగవచ్చు. చవకగా, తొందరగా వెళ్లగలిగే మార్గాలలో అది ఒకటి. ఇంకా యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా వెళ్లవచ్చు. విమానంలో అయితే హైదరాబాద్‌నుంచి పూణే లేదా ఇండోర్ వెళ్తే అక్కడినుంచి ఉజ్జయినికి రైలు లేదా బస్సులో వెళ్లవచ్చు.– డి. పూర్ణిమాభాస్కర్ (చదవండి: దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!) -
గ్రీన్, క్లీన్, సేఫ్ మధ్యప్రదేశ్..
సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాతిగాంచిన జ్యోతిర్లింగాలలో ఒక్కటైన ఉజ్జయిని మహకాళి దేవాలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. అదే సమయంలో దేవి లోక్ శక్తిపీఠం, ఓంకారేశ్వరలోని 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, ఇతర దేవాలయాలు మధ్యప్రదేశ్‌లో ఆధ్యాతి్మక పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.ప్రాణ్‌పూర్ చందేరి సమీపంలో భారతదేశపు మొదటి క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ గ్రామం, చందేరి ఫెస్టివల్, కునో ఫారెస్ట్ ఫెస్టివల్, గాం«దీసాగర్ ఫారెస్ట్ రిట్రీట్, జల్ మహోత్సవ్ వంటి పండగలు, అక్కడి సంస్కృతి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 785 పులులతో ‘టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా’ టైటిల్‌ను సొంతం చేసుకున్న వన్యప్రాణి అటవీ ప్రాంతం, 14 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లతో సహా హెరిటేజ్ టూరిజం స్పాట్లు మహారాష్త్ర సొంతం. ఎనిమిది నగరాలను కలుపుతూ భారతదేశంలోనే మొదటి ఇంట్రా స్టేట్ ఎయిర్ ట్యాక్సీ సేవలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న మధ్యప్రదేశ్‌లో పర్యాటక రంగం ఇటీవలి కాలంలో గణనీయంగా వృద్ధి చెందుతోంది.పెరిగిన పర్యాటకులు..అధికారిక లెక్కల ప్రకారం 2022లో పర్యాటకుల సంఖ్య 34.1 మిలియన్లుగా ఉండగా.. 2023లో ఆ సంఖ్య 112.1 మిలియన్లకు చేరింది. గణనీయమైన పెరుగులతో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు వివిధ రాష్ట్రాల్లో రోడ్‌షోలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ‘గ్రీన్, క్లీన్, సేఫ్ మధ్యప్రదేశ్’ అనే థీమ్‌తో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ స్థానిక ఓ స్టార్ హోటల్లో రోడ్ షో నిర్వహించింది. ట్రావెల్ ఏజన్సీలు, టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక అవగాహన కల్పించారు.సాంస్కృతిక కళలు.. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్, లోక్రంగ్, తాన్సేన్ సమారో (2025లో 100వ ఎడిషన్), అల్లావుద్దీన్ ఖాన్ సంగీత్ సమారో, అఖిల భారతీయ కాళిదాస్ సమారోహ్ తో సహా ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలను అందిస్తోంది. ‘హార్ట్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియాను సందర్శించడానికి ఔత్సాహికులను ఆహా్వనిస్తున్నారు. సత్సంబంధాల కోసం..హైదరాబాద్‌లో రోడ్ షో విజయవంతమైంది. పలు సంస్థలతో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ చేసుకున్న అవగాహన ఒప్పందాలు పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య బలమైన బంధాలు ఏర్పాటు చేస్తుంది. ట్రావెల్ ఏజన్సీలు, టూర్ ఆపరేటర్లు ఈ వర్క్ షాప్‌లో తమ అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉంది. పర్యాటకంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నవారిని రాయితీలతో ఆహ్వానిస్తున్నాం. – బిదిషా ముఖర్జీ, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ -
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని పూజలు
-
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర..!
-
వైభవంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు..!
-
ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఊపిరులూదిన అప్పయ్య బోయీ!
ప్రభువెక్కిన పల్లకి కాదోయి అది మోసిన బోయీలెవ్వరు అన్నాడు శ్రీ శ్రీ. రాజులూ రాణుల పల్లకిలే కాదు యుద్దాలు జరిగినప్పుడు గాయపడ్డ సైనికులను చికిత్స కోసం శిబిరాలకు చేర్చడానికి కూడా రాజులు బోయీల సేవలను వాడుకున్నారు. అలా అంగ్లేయుల పాలనా కాలంలో సికింద్రాబాద్ మిలిటరీ బటాలియన్లో ఒక 'బోయీ'గా పని చేసినవాడు సూరిటి అప్పయ్య. 1813 వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాదులలో ప్లేగు మహమ్మారి విజ్రుoభించి వేలాది మంది జనం కుప్ప తెప్పలుగా చనిపోతున్న కాలంలో బెటాలియాన్తో పాటు మధ్య భారత్ లోని ఉజ్జయినికి బదిలీ పై వెళ్లిపోయాడు అప్పయ్య. అంతేకాదు అక్కడున్న మహంకాళి ఆలయానికి వెళ్లి తనకోసమో తన కుటుంబం కోసమో కాదు అందరికోసం తల్లీ! ఈ మహా విపత్తు నుండి మానవాళిని కాపాడుమని, అదే జరిగితే సికింద్రాబాద్ లో ఉజ్జయిని అమ్మవారి విగ్రహం పెడతానని, గుడి కడతానని మొక్కుకున్నాడు. 'ఈ సామాన్య బోయీతో అది అయ్యే పనేనా, అయినా సరే భక్తుడిని పరీక్షిద్దా' మనుకుందో ఏమో అన్నట్లుగా ఆ వ్యాధి తగ్గుముఖం పట్టడం, అప్పయ్య సికింద్రాబాద్‌కు బదిలీ అయి రావడం జరిగిపోయింది. సూరిటి అప్పయ్య తన మాట తప్పకుండా సహచరుల సహాయం కూడా తీసుకొని కర్రతో చేసిన ఉజ్జయిని అమ్మవారి విగ్రహాన్ని నాటి లష్కర్ లోని ఓ ఖాళీ ప్రదేశంలో (1815 జులైలో) ప్రతిష్టించి, చిన్న గుడి కూడా కట్టించాడట. ఆ నిర్మాణ సమయంలో అక్కడున్న ఒక పాత బావిని బాగు చేస్తున్నప్పుడు దొరికిన మాణిక్యాలమ్మ విగ్రహాన్ని కూడా ఆ గుడిలోనే ప్రతిష్టించాడని చెబుతారు. అప్పయ్యనే భక్తుల సహకారంతో (1864 లో )కర్ర విగ్రహం స్థానంలో రాతి విగ్రహం పెట్టించాడంటారు. ఆ తర్వాతి కాలంలో అప్పయ్య కుమారుడు సంజీవయ్య (1900) ఆయన కుమారుడు మేస్త్రి లక్ష్మయ్య ( 1914), అతని వారసుడు కిష్టయ్య వరసగా ఉజ్జయిని మహంకాళి ఆలయ అభివృద్ధికి కృషి చేశారట. ఇంతా జరిగాక 'చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు' అన్నట్లుగా పలుకుబడి గల పెద్దల కమిటీలు రంగ ప్రవేశం చేసి, పూజారి వర్గాన్ని తెచ్చి, చివరికి దేవాదాయ శాఖవారికి ఈ ఆలయాన్ని( 1947 లో ) అప్పగించారట. ఎట్లయితేనేమి,తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల సందర్బంగా లక్షలాది మంది భక్తులు వచ్చే ఒక ఆలయానికి ప్రభుత్వ అజమాయిషీ అవసరమే కాదనడం లేదు, కానీ అసలు సిసలు ధర్మకర్తలను, ఈ ఆలయాన్ని స్థాపించిన సామాన్యులను ఎవరూ లెక్క చేయక పోవడమే విచారకరం. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ వారి అధికారిక వెబ్ సైట్ లో , తెలంగాణ ప్రభుత్వ టూరిజం వారి సమాచారంలో 'సూరిటి అప్పయ్య డోలి బేరర్'అని ఒక్క మాట అనేసారే గాని ఈ ఆలయ ఏర్పాటు కోసం అయన పడ్డ పాట్లను చెప్పలేదు, ఈ గుడి కోసం చెమటోడ్చిన అప్పయ్య మూడు తరాల మేస్త్రి వారసుల ప్రస్తావన అసలే తేలేదు. అంతా పల్లకి నెక్కిన ప్రభువులను కొనియాడే వారే, అది మోసిన బోయీల సేవలను గుర్తించే దెవరు? బోనాల పండగ మరుసటి రోజు 'భవిష్య వాణి' కోసం మాతంగి స్వర్ణలత చుట్టూ మూగేవారే అందరూ కానీ తరతరాలుగా ఆ భాగమ్మలు జోగమ్మలు పడుతున్న బాధలు పట్టించుకునేదెవరు? -వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి చదవండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా! -
వివాదంలో జొమాటో యాడ్.. హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Hrithik Roshan Zomato Ad Get Angers Mahakaleshwar Temple Priests: బాలీవుడ్ హీరోలను చూస్తుంటే జాలి వేసే పరిస్థితి ఏర్పడింది. వాళ్లు ఏం ముట్టుకున్న, పట్టుకున్న పెద్ద వివాదమై కూర్చొంటుంది. ఇప్పటికే హిందీ హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు, దేవుళ్లపై నమ్మకం లేదు, బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఆ ట్రెండ్‌తో అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్', తాప్సీ 'దొబారా' కలెక్షన్లు రాక విలవిల్లాడాయి. విడుదలైన వాటిని పక్కన పెడితే రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిత్రాలను సైతం బాయ్‌కాట్ అంటూ గొంతెత్తి అరుస్తున్నారు. ఈ చిత్రాల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ చిత్రం 'విక్రమ్-వేద' కూడా ఉంది. అయితే ఇప్పుడు హృతిక్ రోషన్ చేసిన పనితో ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇంకా ఎక్కువ ప్రభావం చూపేలా ఉంది. ఇంతకీ హృతిక్ రోషన్ చేసిన పని ఏంటంటే? ప్రముఖ ఫుడ్ డెలీవరి యాప్ జొమాటో యాడ్‌లో నటించడమే. ఇటీవల జొమాటో ఫుడ్ డెలీవరి యాప్ హృతిక్ రోషన్‌తో ఒక యాడ్ షూట్ చేసి బయటకు వదిలింది. ఈ యాడ్‌లో హృతిక్ చెప్పిన డైలాగ్‌లు, చూపించిన పేర్లు వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని సదరు మతస్థులు గగ్గోలు పెడుతున్నారు. చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడో తెలుసా? ఈ యాడ్‌లో కమాండో అయిన ఆకలి వేసి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాడు. మిగతా కమాండోలు 'ఈ ఆర్డర్ ఎవరిచ్చారు?' అని అడగ్గా.. 'నేనే. నాకు ఆకలి వేసింది. మనం ఉజ్జయినిలో ఉన్నాం. అందేకే మహాకాల్ నుంచి తాలీ ఆర్డర్ చేశా' అని హృతిక్ రోషన్ అందరికీ చెబుతున్నట్లు ఉంటుంది. ఈ సంభాషణపై ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయానికి చెందిన పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఆలయం నుంచి భక్తులకు, యాత్రికులకు తాలీ అనే పేరుతో ప్రసాదాన్ని అందిస్తారు. అయితే అందులో మహాకాళేశ్వరం ఆలయాన్ని కాకుండా మహాకాల్ రెస్టారెంట్‌ను చూపించలేదు. చదవండి: తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం మహాకాల్ అనేది పరమ శివునికి మరో పేరు. హిందువులు పూజించే పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరం ఆలయం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. అలా ఎంతో పవిత్రంగా భావించే తాలీ ప్రసాదాన్ని ఫుడ్‌గా, అలాగే మహాకాళేశ్వరం ఆలయాన్ని రెస్టారెంట్‌గా పేర్కొని పంపిణీ చేసినట్లుగా చిత్రీకరించడం పట్ల ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 'హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పాలి' అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు 'బాయ్‌కాట్ జొమాటో' అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పలువురు నెటిజన్లు సైతం ఈ యాడ్‌పై అసహనం వ్యక్తం చేశారు. వారికి (బాలీవుడ్ వాళ్లకు) సనాతన ధర్మాలపై గౌరవం లేదంటూ ఒకరు అంటే, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించిన ఆ ప్రకటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు డిమాండ్ చేశారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు ఈ గొడవపై జొమాటో తాజాగా స్పందించింది. 'ఇదంతా లోకల్ రెస్టారెంట్లను ప్రమోట్ చేసే పాన్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగం. ఉజ్జయినిలో జొమాటోకు మహాకాల్ రెస్టారెంట్ నుంచి తరచూ అత్యధిక ఆర్డర్లు వస్తాయి. అలాగే అక్కడి మెనూలో తాలీ పేరుతో ఫుడ్ ఐటమ్ కూడా ఉంది. ఆ ఫుడ్‌ను ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటారు' అని ట్విటర్ హ్యాండిల్లో పేర్కొంది జొమాటో. ఇదంతా చూస్తుంటే పాపం హృతిక్ రోషన్ అనిపిస్తుంది. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్ రోషన్ సినిమాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ Logically looking at the biased history of @deepigoyal's @zomato, none can negate that @iHrithik's ad trivializing Bhagwan #Mahakal was a deliberate attempt to demean Hindu Dharma thereby hurting Hindus' sentiments. O Hindus, its high time to resort to financially #BoycottZomato pic.twitter.com/BgbATbiKcZ — Sanatan Prabhat (@SanatanPrabhat) August 21, 2022 -
మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్ : ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం జరిగిన రంగం కార్యక్రమంలో స్వర్ణలత ‘భవిష్యవాణి’ వినిపించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బోనాల జాతర జరిపినందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది బోనాల ఏర్పాట్లపై పెదవి విరిచిన అమ్మవారు.. ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొన్నారు. ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరారు. మారు బోనం తప్పకుండా సమర్పించాలని సూచించారు. ‘ఈ ఏడాది ప్రజలంతా సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారు. ప్రజలందరినీ సంతోషంగా ఉంచుతాను. నా చెల్లెలు గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోర్కెలు నెరవేరుతున్నాయి. రాష్ట్రంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. నా అక్కాచెల్లెళ్లు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. రైతులను సుఖ సంతోషాలతో ఉంచే బాధ్యత నాదేన’ని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. -
అంగ రంగ వైభవం
సాక్షి, సిటీబ్యూరో: అంబారీపై అమ్మవారి ఊరేగింపు..పోతురాజుల విన్యాసాలు...కళాకారుల ప్రదర్శనలు..ఫలహారం బండ్ల ఊరేగింపు... అశేష భక్తజన వాహిని కోలాహలం మధ్య సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సోమవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు రంగం వైభవంగా నిర్వహించారు. -
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్.
-
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కేసీఆర్ మొక్కులు చెల్లించికున్నారు. అనంతరం ఆలయ అధికారులు కేసీఆర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు మహంకాళి అమ్మవారిని ఆలయానికి కేసీఆర్ దంపతులు చేరుకోగానే... వారికి తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్‌రెడ్డి, మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్తోపాటు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. బోనాలు సందర్భంగా సికింద్రాబాద్ లో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. -
బోనాల సందడి
బోనాల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలో భక్తిభావం ఉప్పొంగింది. భక్తులు భారీగా తరలిరావడంతో సందడి వాతావరణం కన్పించింది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయంలో శిఖర పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం భక్తులు పోటెత్తారు. బోనాలకు ముందుగా వచ్చే శుక్రవారం కావడంతో వేలాది మంది భక్తుల రాకతో దేవాలయంతోపాటు పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. బోనాలతో వచ్చిన వారిని నేరుగా అమ్మవారి దర్శనానికి పంపించగా మిగతా భక్తులను క్యూ లైన్ ద్వారా పంపించారు. రద్దీ బాగా ఉండడంతో సుభాష్‌రోడ్‌లోని మసీదు వరకు భక్తులు క్యూ కట్టారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెర్నకోల చేతపట్టుకుని డ్యాన్సు చేస్తూ అందరిని ఉత్సాహపరిచారు. సిక్‌విలేజ్‌కు చెందిన భక్తుడు నరేష్‌రాజు భక్తులకు అన్నదానం చేశారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, నాయకులు మల్లికార్జున్‌గౌడ్, శీలం ప్రభాకర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. 119 కుండలతో అమ్మవారికి సాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా బన్సీలాల్‌పేట్‌కు చెందిన బంగారు తెలంగాణ లష్కర్ బోనాల ఉత్సవ కమిటీ నాయకులు కె.సతీష్, సుధాకర్ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి 119 కుండలతో సాక పెట్టారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసి వాటిపై ఒక్కో నియోజకవర్గం పేరు రాశారు. మహిళలంతా పసుపు రంగు చీరలు ధరించి ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి సాక పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.