అంకురార్పణ సందర్భంగా విష్వక్సేనుడి వద్ద పూజలు చేస్తున్న వేదపండితులు. చిత్రంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్
తిరుమల: కోవిడ్–19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయ చరిత్రలో తొలిసారి ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కల్యాణోత్సవ మండపంలో వాహన సేవలు జరుగుతాయన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఏకాంతంగా అంకురార్పణ జరిగిందని.. శనివారం ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు. సుబ్బారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే..
► 23వ తేదీ గరుడసేవ రోజున సాయంత్రం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
► 24న ఉదయం సీఎం వైఎస్ జగన్, కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. తర్వాత కర్ణాటక సత్రాల నిర్మాణానికి ముఖ్యమంత్రులిద్దరూ భూమిపూజ చేస్తారు.
► ఈ నెల 27వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
టీడీపీ హయాంలోనే నిధుల దుర్వినియోగం
► టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని సంస్థతో ఆడిట్ చేయించాలని ఎంపీ సుబ్రమణ్యస్వామి కోర్టులో పిల్ వేశారు.
► గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సీఎంతో చర్చించినపుడు గత ప్రభుత్వ హయాంలోనే కాకుండా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల ఖర్చుపైనా కాగ్‌తో ఆడిట్ చేయించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ దృష్ట్యా కాగ్ ఆడిట్ జరపాలని తీర్మానం చేశాం.
Comments
Please login to add a commentAdd a comment