
సీతారామలక్ష్మణ సమేత స్వామి వారికి హారతి ఇస్తున్న అర్చకులు
తిరుమల: అక్టోబర్ 5న తిరుమలలో బ్రేక్ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ పీఆర్‌వో విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 5న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంగా అక్టోబర్ 4న వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
నాదనీరాజనంపై బాలకాండ పారాయణం
తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం బాలకాండలోని 3 నుంచి 7వ సర్గ వరకు ఉన్న మొత్తం 142 శ్లోకాలను పండితులు పఠించారు. బాలకాండ పారాయణం నిర్వహిస్తోన్న ఎస్వీ వేద వర్సిటీ ఆధ్యాపకులు ఆచార్య ప్రవా రామక్రిష్ణ సోమయాజులు మాట్లాడుతూ.. ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఈ పారాయణాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద వర్సిటీ అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత వర్సిటీకి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment