
విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతున్న తిరుమల
తిరుమల: కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు సోమవారం అంకురార్పణతో ఆరంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు విష్వక్సేనుడు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారు. అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న పెరుమాళ్ల తిరునాళ్లకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది.
మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణతో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ప్రారంభమవుతాయి. సాయంత్రం పెద్దశేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఇల వైకుంఠనాథుని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల సప్తగిరులను టీటీడీ సుందరంగా ముస్తాబు చేసింది.
విద్యుత్ దీపాలు అలంకరణతో కొండ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆలయ పరిసర పాంతాలు, ప్ర«ధాన మార్గాలను పలు రకాల పూల మొక్కలతో ప్రత్యేక అలంకరణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment