
సాక్షి, తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప విచ్చేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు పాటు తిరుమలలోనే సీఎం వైఎస్ జగన్ ఉండనున్నారు. 23వ తేది సాయంత్రం తిరుమలకు సీఎం చేరుకోనున్నారు. గరుడ సేవ సందర్భంగా 23 సాయంత్రం శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. (సెప్టెంబరు 19 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు)
24న ఉదయం శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించుకోనున్నారు. దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అనంతరం కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు సీఎంలూ పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకోని అల్పాహారం స్వీకరించి సీఎం జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment