యువకుడి ఆత్మహత్యాయత్నం
Published Wed, Aug 17 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
జఫర్‌గఢ్ : ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం కొందరు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు వారు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక మనోవేదనకు గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఓబులాపూర్‌కు చెందిన వంగాల నరేష్ కొన్నేళ్ల క్రితం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు తీగల కరుణాకర్‌రావు.. స్థానిక రైతు గార్లపాటి నీరజారెడ్డి భూమిని జేసీబీతో చదును చేయించాడు.
అయితే జేసీబీ ద్వారా చేసిన పనిని ఉపాధిహామీ ద్వారా కూలీ లతో చేయించినట్లుగా రికార్డు చేయాలని కరుణాకర్‌రావు, నీరజారెడ్డిలు ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్‌పై ఒత్తిyì చేయగా ఆయన నిరాకరిం చాడు. దీంతో ఉపాధిహామీలో అవకతవకలు జరిగాయని, ఇందుకు బాధ్యుడైన ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్‌పై చర్యలు తీసుకోవాలని నీరజారెడ్డి, కరుణాకర్‌రావులు ఉపాధి హామీ పీడీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడితో విచారణ చేపట్టిన అధికారులు నరేష్‌ను విధుల నుంచి తొలగించారు. అయితే కొన్ని రోజుల తర్వాత తిరిగి అదే ఉద్యోగాన్ని మళ్లీ ఇప్పిస్తామంటూ సదరు ఫిర్యాదుదారులు నరేష్‌తో ఒప్పందం చేసుకున్నారు.
ఈ మేరకు నరేష్ వారికి కొన్ని నెలల క్రితం రూ. 1.50 లక్షలు ముట్టజెప్పాడు. అయినప్పటికీ వారు ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన నరేష్ బుధవారం ఉదయం నీరజారెడ్డి, కరుణాకర్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనిం చిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలిచ్చారు. విష యం తెలుసుకున్న నరేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు కారకులైన వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కరుణాకర్‌రావు, నీరజారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితుడి భార్య వంగాల సుమలత ఫిర్యాదు మేరకు కరుణాకర్‌రావు, నీరజారెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు హెడ్ కాని స్టేబుల్ శ్యాంసుందర్ తెలిపారు.
Advertisement