
కృష్ణా : హాస్టల్‌భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. నూజివీడులోని ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థిని బోడు సుష్మా పావని గురువారం ఉదయం హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సుష్మా.. వరంగల్‌జిల్లాలోని గుండెగ గ్రామానికి చెందినట్లు సమాచారం.