ఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం
ఒంగోలు సెంట్రల్ : అట్రాసిటీ కేసు విచారణలో తనకు న్యాయం జరగలేదని మనస్తాపం చెందిన ఓ దళిత మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగి, ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది.
బాధిత మహిళ కథనం ప్రకారం...
దొనకొండలోని వీర వెంకటాపురం ఎస్సీ కాలనీకి చెందిన గొట్టెముక్కల సుజాతకు నరసరావుపేట మున్సిపాలిటీ వల్లూరివారి పాలెంలో తన తాత నుంచి ఎకరం పొలం వచ్చింది. 1974 నుంచి ఆమె తండ్రి దీనిని సాగు చేస్తున్నాడు. 2014కు ముందు మూడేళ్లుగా పొలాన్ని సాగు చేయడం లేదు. 2014 జూలై 17న బాధిత మహిళ పొలానికి వెళ్లగా, పక్క పొలంలోని బోడేపాటి హనుమంతురావు, అంజమ్మ, సత్యనారాయణ, పిన్నెల్లి హనుమంతురావు అనే వారు బాధితురాలిని పొలం నుంచి Ðð ళ్లిపోవాలని కొట్టారు. దీంతో బాధితురాలు నరసరావుపేట రూరల్ పొలీసుస్టేషన్‌లో 253, 2014 క్రై ం నంబర్‌తో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2015 నవంబర్ 23వ తేదీన గతంలో నరసరావుపేటలో దాడి చేసిన నిందితులే తిరిగి మరోసారి దాడి చేశారని దొనకొండ పొలీసుస్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు 81/2015 నంబరుతో పోలీసుస్టేషన్‌లో రిజిస్టర్ అయింది. కే సును నమోదు చేసుకున్న ఎసై ్స కె.అజయ్‌కుమార్, అది అట్రాసిటీ కేసు కావడంతో దర్శి డీఎస్పీ వి.ఎస్.రాంబులకు రిఫర్‌చేశారు. అనంతర కాలంలో డీఎస్పీ బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆ తర్వాత బాధితురాలు గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో న్యాయం జరగడం లేదని గతవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరోసారి ఎస్పీని కలవడానికి వచ్చిన ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇక తనకు న్యాయం జరగదని భావించిన సుజాత తన వెంట తెచ్చుకున్న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. కొద్దిసేపటికే స్ఫహæకోల్పోవడంతో పొలీసులు గమనించి, అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు. మాత్రలను కక్కించిన రిమ్స్ వైద్యులు బాధితురాలికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. తాలుకా సీఐ ఆంటోని రాజ్ చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. తాను స్ఫహæ కోల్పోయిన సమయంలో తన వద్ద ఉన్న పత్రాలను పోలీసులు తీసుకున్నారని బాధితురాలు చెప్పింది. తనకు న్యాయం చేయాలని హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కూడా కలిశానని తెలిపింది.