
సబ్సిడీతో పాడి పథకం మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలాదరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం!
ఈ వారం స్కీమ్ ప్రధానమంత్రి ఎం΄్లాయ్‌మెంట్ జెనరేషన్ ప్రోగ్రామ్.మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలాదరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటివివరాలను ‘‘ఓనర్‘షిప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ ప్రధానమంత్రి ఎప్లాయ్‌మెంట్ జెనరేషన్ ప్రోగ్రామ్.
పీఎమ్‌ఈజీపీ (PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జెనరేషన్ ప్రాగ్రామ్) స్కీమ్... పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం రూ పొందించిన పథకం ఇది. ఇందులో 35 శాతం సబ్సిడీతో రూ. 10 లక్షల నుంచి కోటి వరకు రుణ సహాయం అందుతుంది. దీనికి అయిదు ఎకరాల సొంత లేదా రిజిస్ట్రేషన్ లీజు కలిగిన భూమి ఉండాలి. గ్రామం, పట్టణం.. ఎక్కడైనా ఈ పరిశ్రమను పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు గరిష్ఠంగా 35 శాతం రాయితీ లభిస్తుంది.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి...
పద్ధెనిమిదేళ్లు్ల పైబడి.. 730 సిబిల్ స్కోర్ దాటినవారు ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్, ఏరియాపాపులేషన్ రి΄ోర్ట్, టెన్త్‌క్లాస్ ఉత్తీర్ణతా సర్టిఫికెట్, ఇతర విద్యార్హతల సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, భూమికి సంబంధించిన పట్టా, పాస్‌బుక్ కాపీలను జతచేస్తూ పీఎమ్‌ఈజీపీ ఆన్‌లైన్ ్ర΄÷ఫైల్‌ను నింపాలి. అది సంబంధిత కేవీఐబీ లేదా కేవీఐసీకి వెళ్తుంది. వాళ్లు అప్రూవ్‌చేసి ఆ దరఖాస్తును బ్యాంకులకు పంపుతారు. బ్యాంక్‌ల నుంచి పిలుపు రాగానే వారు సూచించిన ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్లు, సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సమర్పించాలి. బ్యాంక్‌లు వాటిని పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తారు. మళ్లీ అది కేవీఐబీ లేదా కేవీఐసీకి వస్తుంది. తర్వాత 15 రోజులు ఆన్‌లైన్ ట్రైనిం ఉంది., సంబంధిత పరీక్ష రాయాల్సి ఉంటుంది. అది పాస్ అయితేనే రుణం విడుదల అవుతుంది. అప్పుడే సబ్సిడీనీ శాంక్షన్ చేయించుకోవాలి. దాన్ని మూడేళ్ల వరకు బ్యాంక్‌లోనే డిపాజిట్ చేస్తారు. మూడేళ్ల తర్వాత దాన్ని బ్యాంక్ వాడుకుంటుంది. ΄÷ందిన సబ్సిడీకి వడ్డీ ఉండదు. ఈ మొత్తం రుణానికి బ్యాంక్ ఎటువంటి పూచీకత్తు అడగదు. అందిన రుణంలోని కొంత మొత్తంతో షెడ్డును నిర్మించి, ఇంకొంత మొత్తంతో గేదెలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పశువైద్యనిపుణులు సర్టిఫై చేసిన ఆరోగ్యకరమైన గేదెలకు మాత్రమే బ్యాంక్ అనుమతిస్తుంది. కొన్నచోటు నుంచి రసీదు తీసుకోవాలి. షెడ్డును కూడా ప్రభుత్వ సూచనల మేరకు.. గాలి వెలుతురు ధారాళంగా సోకేలా, నీటి సౌలభ్యం, డ్రైనేజీ వసతులు ఉండేలా నిర్మించాలి. అధికంగా పాలనిచ్చే సూడి గేదెలను మాత్రమే కొనాల్సి ఉంటుంది. నాణ్యమైన పాల ఉత్పత్తి, వేరొక జాతి పశువులతో కలపని పూర్తిస్థాయి దేశీ పశు అభివృద్ధే ఈ పథకం ముఖ్యోద్దేశం.
ఇదేకాకుండా నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) నుంచి అందుతున్న పశుజాతి అభివృద్ధి (Breed Multiplication Farm) పథకమూ ఉంది. దీనికి రూ. 4 కోట్ల రుణం అందుతోంది. అందులో సగం అంటే రూ. 2 కోట్లకు సబ్సిడీ ఉంటుంది. పది శాతం బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ అంటే రూ.4 కోట్ల ప్రాజెక్ట్‌కు రూ. 40 లక్షలు సొంత పెట్టుబడి ఉండాలి. మిగిలిన కోటీ అరవై లక్షలకు బ్యాంకు నుంచి రుణాన్ని పొందవచ్చు. అయితే దీనికి పూచీకత్తు తప్పనిసరి. అయిదు ఎకరాల భూమిలో ప్రాజెక్ట్ ఉండాలి.
పదేళ్ల పైబడి లీజుకు రిజిస్ట్రేషన్ చేయించాలి. సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో ఎన్‌డీడీబీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ స్క్రూటినీ అనంతరం పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ లోన్, ప్రభుత్వ సబ్సిడీలు పొందిన తర్వాతప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి. అయిదు ఎకరాల భూమిలో పాడికి అవసరమైన పచ్చగడ్డిని పండించాలి. దేశీ పశు అభివృద్ధి ప్రణాళికతో తయారైన, ప్రభుత్వం సప్లయ్ చేస్తున్న దాణాను కూడా సబ్సిడీ ధరలకు కొనుక్కోవచ్చు. ఈ పథకం ద్వారా చాలామంది పాడి రైతులు తాము లాభపడటమే కాక మరికొంత మందికీ ఉపాధి కల్పిస్తున్నారు. ఇది మహిళా రైతులకు మరింత ప్రోత్సాహకరం.
– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్
నిర్వహణ : సరస్వతి రమ
మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.com
Comments
Please login to add a commentAdd a comment