మైసూరు(కర్ణాటక): కోవిడ్ రిపోర్టును నెగిటివ్‌గా మార్చుకుని చెక్‌పోస్టు దాటాలని చూసిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకుని తిరిగి వెనక్కి పంపిన ఘటన మైసూరు జిల్లా హెచ్‌డీకోటె తాలూకా బావలి చెక్‌పోస్టు వద్ద గురువారం చోటు చేసుకుంది. మైసూరు సమీపంలోని కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతంగా ఉండటంతో కేరళ–మైసూరు సరిహద్దులో భారీ బందోబస్తు ఉంది. కోవిడ్ నెగెటివ్ ఉన్న వారినే మాత్రమే కర్ణాటకలోకి అనుమతిస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం ఉదయం ఓ వ్యక్తి తన పాజిటివ్ రిపోర్టును నెగెటివ్‌గా మార్చుకుని చెక్‌పోస్టు దాటాలని చూశాడు. చెక్‌పోస్టు పోలీసులు బస్సులో ఉన్న ఇతని రిపోర్టును నిశితంగా పరిశీలించి మార్చినట్లుగా గుర్తించి తిరిగి వెనక్కి పంపారు. ( చదవండి: ‘బుల్లి బాయ్’ సృష్టికర్త అరెస్ట్ )
మరో ఘటనలో..
కళాశాలలో వ్యాక్సిన్ డ్రైవ్
బనశంకరి: పుట్టేనహళ్లిలోని జేపీ.నగర నారాయణ పీయూ కళాశాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. గురువారం కాలేజీలో నిర్వహించిన వ్యాక్సిన్ డ్రైవ్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్ సతీశ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ప్రభావతి రమేశ్, జల్లిరమేశ్, మాజీ నగరసభ సభ్యుడు మురళీధర్, బీజేపీ నేత రమేశ్‌రాజు, కాలేజీ డీన్ సురేంద్రనాథరెడ్డి, ప్రిన్సిపాల్ జగదీశ్, ఏజీఎం బాబు, రీజనల్ ఇన్‌చార్జ్ నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment