
శ్రీనగర్ : కరోనా కారణంగా 40 ఏళ్ల సీఆర్‌పీఎఫ్ జవాను మరణించారు. జమ్ముకాశ్మీర్‌లో వైరస్ కారణంగా చనిపోయిన మొదటి జవాను ఇతడేనని అధికారులు పేర్కొన్నారు. దీంతో జమ్మూ కశ్మీర్లో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 42కు చేరుకుంది. జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలతో జూన్ 5న ఆస్పత్రిలో చేర్పించగా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటికే శ్వాసకోశ సమస్యలు తేలడంతో పరిస్థితి విషమించి కన్ను మూసినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మిగతా సీఆర్‌పీఎఫ్ సిబ్బందిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మృతుడు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారని అధికారులు పేర్కొన్నారు. లాక్‌డౌన్ 4.0లో భాగంగా కేంద్రం భారీ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా ఉదృతమవుతుంది. గత 24 గంటల్లోనే 9,983 కొత్త కేసులు వెలుగుచడటంతో మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులు తలెత్తె అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment