
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణ దేశంలో అంతకంతకూ అధికమవుతోంది. లాక్‌డౌన్ పటిష్ట అమలు ఒక్కటే వైరస్ కట్టడికి మార్గమని తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో లాక్‌డౌన్ విధుల్లో ఉన్న 122 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. మరో 100 మంది రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు శనివారం వెల్లడించారు. వైరస్ బారినపడింది బెటాలియన్ 31కు చెందిన పారామిలటరీ బలగానికి జవాన్లుగా అధికారులు తెలిపారు. పశ్చిమ ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేస్-3వో వారు విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ విభాగంలోని 12 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దాంతో ఆ విభాగంలో పనిచేస్తున్న 47 మందిని సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. (ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులకు కరోనా)
(చదవండి: మా జవాన్‌కు సంకెళ్లు వేస్తారా?)
Comments
Please login to add a commentAdd a comment