
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిపోవడంతో పదకొండు మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకెళితే.. పూంచ్ జిల్లాలో కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మొఘల్ రోడ్డు గుండా షోపియాన్ వెళ్తుండగా పీర్‌కి గాలి అనే చోటు వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా, ఏడుగురు గాయాలపాలయ్యారు.
చనిపోయిన వారిలో 9మంది అమ్మాయిలున్నారు. క్షతగాత్రులను అధికారులు షోపియాన్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలియజేస్తూ ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించి తొందరగా కోలుకునేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment