కుల్గాంలో ఎన్‌కౌంటర్‌ : 5 గురు ఉగ్రవాదులు కాల్చివేత | Encounter underway in J&K Kulgam, 5 terrorists killed | Sakshi
Sakshi News home page

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌ : 5 గురు ఉగ్రవాదులు కాల్చివేత

Published Sat, Sep 15 2018 9:18 AM | Last Updated on Sat, Sep 15 2018 8:21 PM

Encounter underway in J&K Kulgam, 5 terrorists killed - Sakshi

ఫైల్‌ ఫోటో

కుల్గాం : జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో5 గురు  ఉగ్రవాదులను భద్రతాదళాలు కాల్చి చంపాయి.  కజిగూండ్‌లోని  చౌగమ్ ప్రాంతంలో భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య  శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ఎన్‌కౌంట‌ర్‌ జరిగింది. ఉగ్రవాదులు ఈ ఏరియాలో తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు కార్డన్‌  సెర్చ్‌  నిర్వహించారు.  ఈ సందర్భంగా తీవ్రవాదులు కాల్పులు జరపడంతో, భద్రతా దళాలు ముగ్గురు తీవ్ర వాదులను హతమార్చినట్టు  అధికారులు వెల్లడించారు.  మ‌రో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల కోసం గాలింపు కొన‌సాగుతోందన్నారు. 

అయితే  తాజా సమాచారం ప్రకారం మిగిలిన ఇద్దరు  కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా బారాముల్లా-క్వాజిగుండ్ మ‌ధ్య రైలు,ఇంటర్నెట్‌ సర్వీసులను  నిలిపి వేసినట్టు అధికారులు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement