
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లోరన్ నుంచి పూంజ్‌కు బయలుదేరిన ఒక బస్సు బయలుదేరిన ఒక బస్సు అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూంజ్‌కు సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న ప్లెరా ప్రాంతంలో ఘటన జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
సంఘటనా స్థలానికిచేరుకున్న అధికారులు స్థానికుల సహాయంతో రక్షణ, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment