4జీ సేవల్ని ప్రారంభించిన ఎయిర్ సెల్! | Aircel launches 4G services in Tamil Nadu, Jammu & Kashmir | Sakshi
Sakshi News home page

4జీ సేవల్ని ప్రారంభించిన ఎయిర్ సెల్!

Aug 18 2014 3:01 PM | Updated on Jun 4 2019 6:47 PM

4జీ సేవల్ని ప్రారంభించిన ఎయిర్ సెల్! - Sakshi

4జీ సేవల్ని ప్రారంభించిన ఎయిర్ సెల్!

టెలికాం రంగంలో ఎయిర్ సెల్ ఓ ఘనతను సాధించింది. టెలికాం రంగంలో 2జీ, 3జీ, 4జీ సేవల్ని కలిగిఉన్న సంస్థగా ఎయిర్ సెల్ అవతరించింది.

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో ఎయిర్ సెల్ ఓ ఘనతను సాధించింది. టెలికాం రంగంలో 2జీ, 3జీ, 4జీ సేవల్ని కలిగిఉన్న సంస్థగా ఎయిర్ సెల్ అవతరించింది. తాజాగా తమిళనాడు, జమ్మూ&కాశ్మీర్ రాష్ట్రాల్లో 4జీ సేవల్ని ఎయిర్ సెల్ ఆరంభించింది. తమిళనాడు, జమ్మూల్లో 4జీ ఎల్ టీఈ (లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) సేవల్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని కంపెనీ ఓ ప్రకటనల్లో తెలిపింది. 
 
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, అస్సాం, ఉత్తర, తూర్పు జమ్మూ,కాశ్మీర్ రాష్ట్రాల్లో 20ఎంహెచ్ జెడ్, 2300 ఎంహెచ్ జెడ్ బ్యాండ్ సేవల్ని అందిస్తోందని ఎయిర్ సెల్ చీఫ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement