ఆత్మాహుతి దాడికి సిద్ధమైన సదియా అన్వర్ షేక్
సాక్షి, శ్రీనగర్ : గణతంత్ర దినోత్సవ వేడుకలనాడు పెద్ద ప్రమాదం తప్పింది. ఓ అనుమానిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది (యువతి)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు అమర్చుకున్న బాంబుతో సహా పేల్చుకుందామని, అందుకు అనువైన ప్రదేశాన్ని వెతుకుతున్న సమయంలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేసి భారీ ప్రాణనష్టాన్ని అడ్డుకోగలిగారు. ఆమె ఓ పద్దెనిమేదేళ్ల యువతి అని, ఆమెది పుణె అని మాత్రమే పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. గణతంత్ర దినోత్సవ వేడుకలు లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భారత్‌లో ఆత్మాహుతి దాడికి ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది.
దీంతో వారు పుణె పోలీసులను అప్రమత్తం చేశారు. వారు చెప్పిన ప్రకారం ఆ యువతి పేరు సదియా అన్వర్ షేక్ అని, ఆమె ఇటీవలె జమ్ముకశ్మీర్‌కు వెళ్లి ప్రతిరోజు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో టచ్‌లో ఉంటోంది. అయితే, గణతంత్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు కశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. కశ్మీర్‌లోని రిపబ్లిడే పరేడ్ వద్ద ఈమె ఆత్మహుతి దాడికి పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆమెకోసం తీవ్రంగా గాలించిన పోలీసులు దక్షిణ కశ్మీర్‌లో గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించని అధికారులు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా టెర్రరిజానికి సంబంధించి ఈమెను విచారించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment