ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తొలగించారని.. అయినప్పటికి మరోసారి క్యాన్సర్ బారిన పడడంతో ఆపరేషన్ చేసి మరో ఊపిరితిత్తిలో సగభాగం తీసేసినట్లులు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారని , మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు. అయితే సిరివెన్నెలకు సిగరేట్ అలవాటు ఉండడం వల్లే క్యాన్సర్ బారిన పడినట్లు తెలుస్తోంది.
సిరివెన్నెల గతంలో ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మోకింగ్ అలవాటుపై కీలక విషయాలు చెప్పారు. చిన్నప్పటి నుంచే స్మోకింగ్ అలవాటు ఉన్నట్లు వెల్లడించారు. సరదాగా మొదలుపెట్టిన స్మోకింగ్.. వ్యసనంగా మారిందని చెప్పారు. నాకు అసలే అహంకారం ఎక్కువ.. అయినా సిగరెట్ ముందు ప్రతిసారి తలవంచుతున్నానని చెప్పారు. తన పిల్లలకు కూడా అదే విషయాన్ని చెపినట్లు తెలిపారు. పబ్లిక్ తిరిగే ప్రాంతంలో కానీ, చిన్న పిల్లల ముందు కాని సిగరేట్ కాల్చొద్దని తనకు తానే ఓ రూల్‌ని పెట్టుకున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్యర్‌తో మరణించిన నేపథ్యంలో గతంలో స్మోకింగ్‌పై సిరివెన్నెల చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment