‘వారికి కోవిడ్‌-19 ముప్పు అధికం’ | WHO Says Smoking Linked To Higher Risk Of Coronavirus | Sakshi
Sakshi News home page

పొగతాగేవారిలో కోవిడ్‌-19 రిస్క్‌ అధికం

Published Thu, Jul 2 2020 6:39 PM | Last Updated on Thu, Jul 2 2020 7:53 PM

WHO Says Smoking Linked To Higher Risk Of Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల్లో పొగతాగే అలవాటున్న వారు తీవ్ర అనారోగ్యానికి గురవడం, మరణించే అవకాశం అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అయితే పొగతాగేవారికి కోవిడ్‌-19తో నిర్ధిష్టంగా ఎంతటి ముప్పు ఉంటుందనేది డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేయలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 5.1 లక్షలకు చేరింది. కోవిడ్‌-19 నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 54 లక్షలకు పెరిగింది.మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6 లక్షలు దాటగా మరణాల సంఖ్య 17,834కు ఎగబాకింది. చదవండి : ఆ ఔషధ ఉత్పత్తిని పెంచండి: డబ్ల్యూహెచ్‌ఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement