దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేసేందుకు కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధిస్తున్నాయి. బతికుంటే బలుసాకైనా తిని బ్రతకొచ్చని ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కానీ ఏ వీధి మలుపు తిరిగినా.. ఏ సందు చివర చూసినా పొగరాయుళ్లే దర్శనమిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లతో గుప్పుగుప్పు మంటూ పెట్టెలు కొద్దీ సిగరెట్లు కాల్చే పొగరాయుళ్లు.. ఇళ్లలో ఉండలేక ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సిగరెట్లు కాల్చేందుకు బయటకొస్తున్నారు.
అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్ చేసేవారు యుక్తవయస్సు వారైనా, పెద్దలైనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల ‘జో కోవిడ్ సింప్టమ్స్ స్టడీ యాప్’ డేటా ఆధారంగా స‍్మోక్ చేయని వారికంటే స్మోక్ చేసే వారిలో కరోనా ప్రభావం 14 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దగ్గు, ఛాతి నొప్పి, ఛాతి వెనుక భాగంలో వేడి, వాసన, రుచి కోల్పోతున్నట్లు తేలింది. కండరాల నొప్పి, గందరగోళం, విరేచనాలు, అలసటతో 50 శాతం మందికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిర్ధారించారు. స్మోకింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుందని.. ఇమ్యూనిటీ పవర్ ను తగ్గించి కరోనా పై పోరాడే శక్తిని కోల్పోతారని వరల్డ్ హెల‍్త్ ఆర్గనైజేషన్ సైతం తెలిపింది.
అయితే స్మోకర్స్ లో ఏమాత్రం మార్పు రాకపోవడంతో నెటిజన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాత్కాలిక ఆనందం కోసం విలువైన జీవితాన్ని పణంగా పెడుతున్నారు, వారి వ్యసనం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియో చూస్తే తెలిసి పోతుందంటూ నెటిజన్లు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెద్దాయన ఆక్సిజన్ సిలిండర్ తో ఊపిరి పీల్చుకుంటూ అవసరమైనప్పుడు ఆక్సిజన్ పైప్ తీసేసి స్మోక్ చేయడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment