
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలులో సిగరెట్ తాగొద్దనందుకు గర్భవతిని హత్యచేశాడు ఓ కిరాతకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్-బీహార్ జలియన్ వాలా ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీలో చినత్ దేవి (45) అనే గర్భవతి తన కుటుంబసభ్యులతో కలసి ప్రయాణిస్తున్నారు. అదే బోగిలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడే సిగరేట్ తాగుతున్నాడు. సిగరెట్ పొగ వల్ల తాము చాలా ఇబ్బంది పడుతున్నామని... ఆపేయాలని చినత్ దేవి ఆ వ్యక్తిని కోరారు.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆ మహిళపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్ లో రైలును ఆపి, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చినత్ దేవిని పరీక్షించిన డాక్టర్లు... అప్పటికే ఆమె మృతి చెందిందని తెలిపారు. నిందితుడిని సోనూ యాదవ్ గా గుర్తించామని పోలీసులు చెప్పారు. చనిపోయిన మహిళ తన కుటుంబంతో కలసి చాత్ పూజ కోసం బీహార్ వెళుతోందని తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment