
లక్నో: టీలో చక్కెర తక్కువైందన్న కారణంతో గర్భంతో ఉన్న భార్యను హతమార్చాడో కర్కోటక భర్త. ఈ దారుణ ఘటన సోమవారం ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాకు చెందిన బబ్లూ కుమార్ - రేణు దేవీ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. రేణుదీవి ప్రస్తుతం గర్భిణీ కూడా. ఆమె సోమవారం ఉదయం తన భర్తకు టీ చేసి ఇచ్చింది. అయితే అందులో చక్కెర తక్కువైందని బబ్లూ ఆమెను నిందించాడు. (చావు బ్రతుకుల మధ్య 8 రోజులుగా..)
ఈ క్రమంలో వారిద్దరి మధ్య మొదలైన గొడవ పెద్దది కావడంతో అతడు ఆవేశంలో పదునైన కత్తితో భార్య గొంతు కోశాడు. వీరి అరుపులతో నిద్రిస్తున్న పిల్లలిద్దరూ ఒక్కసారిగా మేల్కొని భయంతో బిక్కుబిక్కుమంటూ వంటగదిలోకి వచ్చి చూడగా అప్పటికే వారి తల్లి రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి బద్రీ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. (ప్రియునితో టీ గొడవ)
Comments
Please login to add a commentAdd a comment