
ఉత్తర ప్రదేశ్: సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. ప్రస్తుతం మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పిన విధంగా చెట్టుకు చీర కట్టినా కామాంధులు వదలటం లేదు. ఏకంగా నెలలు నిండిన(గర్భిణి) ఓ 32 ఏళ్ల మహిళపై కొంతమంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కచౌలా గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కచౌలా గ్రామానికి చెందిన ఓ గర్భిణి శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లింది. ఒంటరిగి వెళ్తున్న ఆమెను చూసి కొంత మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గట్టిగా అరవడంతో నోటిలో అరుపులు వినబడకుండా ఓ గుడ్డ పెట్టారు. అయితే బయటి వెళ్లిన మహిళ ఎంత సేపటికీ రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెంది గాలింపులు చేపట్టారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి స్థానికి ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment