
ప్రతీకాత్మక చిత్రం
మెదక్ మున్సిపాలిటీ: బహిరంగ ప్రదేశంలో సిగరేట్ తాగిన ఇద్దరికి న్యాయమూర్తి జరిమానా విధించిన సంఘటన గురువారం మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ శ్రీరాం విజయ్‌కుమార్ కథనం ప్రకారం సంగారెడ్డికి చెందిన అబేద్ హుస్సేన్, కొల్చారం మండలం వరిగుంతంకు చెందిన శ్రీనివాస్‌లు బస్టాండ్‌లో బుధవారం సిగరేట్ తాగుతూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడంతో వారిపై కోక్‌టా యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ తెలిపారు. ఈ మేరకు గురువారం మొబైల్ మేజిస్ట్రేట్ లావణ్య ఒక్కొక్కరికి రూ.200ల చొప్పున జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment