భర్త వివాహేతర సంబంధం.. అది తెలుసుకున్న భార్య.. | Wife Killed Husband Due To Fight Over Extramarital Affair With Another Woman, Details Inside - Sakshi
Sakshi News home page

భర్త వివాహేతర సంబంధం.. అది తెలుసుకున్న భార్య..

Published Wed, Mar 20 2024 12:08 PM | Last Updated on Wed, Mar 20 2024 1:22 PM

husband murdered by wife - Sakshi

కోవూరు: భర్తను భార్య రోకలి బండతో కొట్టి చంపిన ఘటన కోవూరులోని బండారుమాన్యంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పి.అయ్యప్ప (42) అనే వ్యక్తి ఫ్లెక్సీలు కడుతుంటాడు. చిన్నచిన్న పనులు చేస్తుంటాడు. అతడికి దుర్గ అనే మహిళతో వివాహమైంది. వారికి పదేళ్ల వయసున్న బాలుడు, ఐదేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. అయ్యప్ప రాజేశ్వరి అనే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి ఆమె, అతను కలిసి మద్యం తాగారు.

 తర్వాత అయ్యప్ప ఇంటికి రాగా భార్యాభర్తలిద్దరూ తాగారు. అయ్యప్పకు రాజేశ్వరితో వివాహేతర సంబంధం ఉందని దుర్గకు అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగింది. రాజేశ్వరిని ఇంటికి తీసుకురావాలని అయ్యప్ప అరిచి చెప్పడంతో దుర్గ వెళ్లి ఆమెను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా వారి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. కాసేపటికి రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అయ్యప్ప భార్యపై రోకలి బండతో దాడి చేయబోయాడు. 

ఆమె దానిని లాక్కొని భర్తను కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అయ్యప్ప సోదరుడు కోవూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రంగనాథ్‌ గౌడ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీఎస్పీ చుట్టుపక్కల వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement