
బొమ్మనహళ్లి: వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. భార్య మరొకరితో సన్నిహితంగా ఉండటంతో భర్త ఆమెను దుడ్డుకర్రతో బాది అంతమొందించాడు. ఈ ఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకా తమ్మనాయకనహళ్లిలో చోటు చేసుకుంది. ఆనేకల్ పోలీసుల కథనం మేరకు మహదేవయ్య ఆనేకల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మమ్మ(40) గారె పనికి వెళ్లేది.
వీరికి ఆరు మంది సంతానం ఉన్నారు. లక్ష్మమ్మ తాను పనులు చేసే ప్రాంతంలో ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. ఇదే విషయంపై దంపతుల మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. లక్ష్మమ్మ వ్యవహారంపై స్థానికులు చర్చించుకుంటుండటంతో మహదేవ మనోవేదనకు గురయ్యాడు.
శనివారం రాత్రి లక్ష్మమ్మ నిద్రిస్తున్న సమయంలో దుడ్డుకర్రతో తలపై బాదాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికకక్కడే మృతి చెందింది. ఆనేకల్లు పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి మహదేవయ్యను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment