
బనశంకరి: ప్రియుడు దూరంగా ఉండటాన్ని సహించలేక ప్రియురాలు అతడిపై చాకుతో దాడిచేసి హత్యకు ప్రయత్నించిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రియుడు జోగిశ్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. అసోంకు చెందిన జుంటిదాస్ (36) అనే మహిళ.. భర్తకు విడాకులు ఇచ్చి 18 ఏళ్లు కూతురితో కలిసి జిగణిలో నివాసముంటోంది.
డే కేర్ సంస్థలో జుంటిదాస్ పనిచేసేది. గత కొద్దినెలల క్రితం అసోంకే చెందిన జోగిశ్ (27) పరిచయమై ప్రేమగా మారి సహజీవనం ప్రారంభించారు. జోగిశ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆమె తరచూ డబ్బుల కోసం వేధిస్తుండడంతో జోగిశ్ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఆ మహిళ అతనిపై చాకుతో ఇష్టానుసారం దాడిచేసి పరారైంది. వివేకనగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని మహిళను అరెస్ట్‌చేశారు. బాధితుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment