భర్త ఇంట్లో ఉండగానే ప్రియుడ్ని పిలిచి మరీ.. | Wife Beat Husband With Boyfriend Because Of Extramarital Relationship Is Not Good | Sakshi
Sakshi News home page

భర్త ఇంట్లో ఉండగానే ప్రియుడ్ని పిలిచి మరీ..

Published Wed, Jul 24 2024 12:46 AM | Last Updated on Wed, Jul 24 2024 8:29 PM

Wife Beat Husband With Boyfriend Because Of Extramarital Relationship Is Not Good

తాడిపత్రి రూరల్‌: వివాహేతర సంబంధం మంచిది కాదన్నందుకు ఏకంగా ప్రియుడితో కలసి భర్తను ఓ భార్య చితకబాదింది. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన శ్రీరంగడు పుట్టుకతోనే మూగ. ఆయన భార్య రేవతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బండల పాలీస్‌ యూనిట్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని శ్రీరంగడు పోషించుకుంటున్నాడు. 

అదే యూనిట్‌లో పనిచేస్తున్న చిన్నపొలమడకు చెందిన ధర్మ తరచూ శ్రీరంగడు కోసం ఇంటికి వెళుతూ రేవతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న శ్రీరంగడు పలుమార్లు తన భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. 

సోమవారం రాత్రి భార్యాభర్తలు మరోసారి ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో ధర్మకు రేవతి ఫోన్‌ చేసి రప్పించుకుంది. అనంతరం ఇద్దరూ కలసి శ్రీరంగడుపై విచక్షణారహితంగా దాడి చేసి చితకబాది అక్కడి నుంచి ఉడాయించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమారుడిని చుట్టుపక్కల వారి సాయంతో తల్లి రంగమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లింది. రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement