
దారుణ వీడియో : బతికుండగానే పీక్కుతిన్నాయి
సోవెట్స్కీ(రష్యా) :
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని వీధి కుక్కలు అతికిరాతకంగా చంపితిన్నాయి. ఈ సంఘటన సెంట్రల్ రష్యాలో సోవెట్స్కీలోని కాంటీ- మాన్సీలోని ఓ మారుమూల ప్రాంతమైన ఒక్రుగ్లో చోటుచేసుకుంది. సెక్యురిటీగార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి(పేరు వెల్లడించలేదు) గత రెండేళ్లుగా 12 వీధి కుక్కలకు అప్పుడప్పుడు ఆహారం పెట్టేవాడు. అయితే మద్యం మత్తులో వీధికుక్కలున్న దారిగుండా వెళుతున్న సమయంలో.. ఆహారం తీసుకువచ్చాడని భావించిన కుక్కలు ముందుగా అతన్ని చుట్టుముట్టాయి.
చేతిలో బీరు బాటిల్తో మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఆహారం పెట్టకుండానే వీధికుక్కలని దాటాలని ప్రయత్నించాడు. దీంతో ఆకలిమీద ఉన్న కుక్కలు ముందుగా అతనిపై అరచి, ఆ తర్వాత దాడి చేశాయి. రెండు సార్లు కుక్కల దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి సఫలమైనా, చివరకు అన్ని కుక్కలు కలిసి ఒకేసారి దాడి చేయడంతో కిందపడిపోయాడు. కుక్కల దాడిలో కేవలం రెండు నిమిషాల్లోనే అతను మరణించినట్టు వీడియోఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. దాడి జరిగిన మరుసటి రోజు బాధితుడి శరీర అవయవాలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా, సీసీటీవీ ఫుటేజీతో అసలు విషయం వెలుగు చూసింది.