తాగి ఎక్కడపడితే అక్కడ పడేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల బెడద ప్రపంచ దేశాలతోపాటు టర్కీ దేశానికి కూడా ఎక్కువగానే ఉంది. పుజెడాన్ కంపెనీ దీనికి సరైన పరిష్కార మార్గాన్ని కనొగొన్నది. స్మార్ట్ రీసైక్లింగ్ బిన్ పేరిట తయారు చేసిన ఈ బాక్సుల వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఇది వీధి కుక్కలకు కావాల్సిన ఆహారాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. ఈ బాక్సులో పైభాగాన ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను పడేసేందుకు ఓ అర, దిగువున మిగిలిపోయిన నీటిని పోసేందుకు ఓ అర ఉంటుంది. వాటర్‌ను కింది అరలో పోసి పైభాగంలో ఉన్న అరలో వాటర్ బాటిల్ వేస్తే సరి. కంపెనీ వారు వచ్చి ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకెళ్లి రీసైక్లింగ్ చేస్తారు. అందుకు బదులుగా బాక్స్ పూర్తి దిగువ భాగాన్న అమర్చిన అరలో వీధి కుక్కలకు అసరమైన ఆహారాన్ని ఎప్పటికప్పుడు వచ్చేలా అమర్చారు. ఇక వాటికి కావాల్సిన నీరు కూడా ప్రజలు పోసే మిగిలిన వాటరు ద్వారా సమకూరుతుంది.