వీధికుక్కపై రాక్షసంగా ప్రవర్తించిన ఇద్దరు వైద్య విద్యార్థులు రూ.4 లక్షలు జరిమానా చెల్లించుకున్నారు. చెన్నై కున్రత్తూరుకు చెందిన సుదర్శన్, ఆశిష్ ఆరు నెలల కిందట వీధికుక్కను మూడో అంతస్తు నుంచి కిందకు విసిరివేశారు. వీడియో తీసి స్నేహితులతో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక ఈ దృశ్యాన్ని వాట్సాప్‌లో పెట్టి పలువురికి తమ ఘనతను చాటుకున్నారు.